Friday 11 March 2016

ఇక ఆధార్ కు చట్టబద్దత

న్యూఢిల్లీ : యూనిక్ ఐడెంటిటీ నెంబర్ గా పేర్కొనే 'ఆధార్' కు ఇక చట్టబద్ధత లభించింది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ కార్డును అనుసంధానించడాన్ని 'ఆధార్'కు చట్టబద్ధత కల్పించే బిల్లును శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధార్ అనుసంధానంపై సభలో వివరణ ఇచ్చారు. దేశంలో 97శాతం మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారన్నారు.
 
ఆధార్ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, బయో మెట్రిక్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోమని జైట్లీ స్పష్టం చేశారు. వ్యక్తిగత సమచార భద్రతకు భంగం వాటిల్లకుండా బిల్లులో నిబంధనలు ఏర్పాటు చేశామని వివరించారు. యుఐడిని పౌర ఆమోదపత్రం కింద నమోదు చేస్తామని వివరించారు. ఈ బిల్లులోని క్లాజ్‌ 9ని అనుసరించి ఓ వ్యక్తి, అతనికి సంబంధించిన వివరాలను ఆధార్‌ నంబర్‌ తెలిసినంత మాత్రన వెల్లడించే హక్కు ఉండదని జైట్లీ పేర్కొన్నారు. రోజుకు 5 నుంచి 7 లక్షలమంది ఆధార్ నమోదు చేయించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం  పౌరులందరికీ ఆధార్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆధార్ కార్డు ద్వారా లబ్దిదారులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం పథకాలకు అందజేయనుంది.

No comments:

Post a Comment