తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చే నెల 3 న పరిక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 1,131 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. ఈ పరీక్షకు 5.36 లక్షల మంది హాజరవన్నున్నారని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖలో 9,613 కానిస్టేబుల్స్, 539 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం 10,152 ఉద్యోగాల భర్తీకి గాను తెలంగాణా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటుచేసిన పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నపుడు పోలీస్ అధికారులందరూ జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ పోలీస్ కమీషనర్లతో పాటుగా ఐజీలు, డీఐజీ లు, అన్ని జిల్ల్లాల ఎస్పీలు, పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీ పూర్ణచంద్రరావు పరీక్షలు జరిగే విధానం పై పవర్ పాయింట్ ప్రసంటేషన్ ఇచ్చారు.
జేఎన్‌టీయూ సహకారంతో జరుగుతున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 3 న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జరగబోయే పరీక్షల్లో 5.36 లక్షల మంది, 17 ఏప్రిల్ న జరగబోయే సబ్ ఇనస్పెక్టర్ పరీక్షలకు 1.38 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఈ సమావేశంలో తెలిపారు. ఇందుకు గాను ఆదిలాబాదు జిల్లాలో ఆదిలాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్, ఉట్నూర్ లో 110 పరిక్ష కేంద్రాలను, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, మంథని లో 106, వరంగల్ జిల్లాలో జనగాం, నర్సంపేట, వరంగల్ లో 109, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి లో 112, నల్గొండ జిల్లాలో కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట లో 156, మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల, కల్వకుర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, షాద్ నగర్, వనపర్తి లో 195, నిజామాబాదు జిల్లాలో ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాదు లో 79, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ తో సహా 124, హైదరాబాదు లో 74 పరిక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లోకి వాచీతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరని, ఒక నిమిషం ఆలస్యం అయినా కూడా అనుమతించే ప్రసక్తి ఉండదని పరీక్షలు మధ్యాహ్నం వేళలో జరుగుతాయని బోర్డ్ చైర్మన్ శ్రీ పూర్ణచంద్రరావు వివరించారు.
No comments:
Post a Comment