తల్లిదండ్రులకు అన్నంలో నిద్రమాత్రలు పెట్టిన కుమార్తె!
ప్రేమ ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది. కన్నతల్లిదండ్రులను సైతం హతమారుస్తుంది. తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని భావించిన ఓ కూతురు అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను చంపడానికి యత్నించింది. ఇది తెలంగాణలోని మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడలో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి గ్రామానికి చెందిన ఎస్‌ఐ రామకృషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అదే గ్రామానికి చెందిన కిషన్, అన్నపూర్ణలు రెండేళ్లు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో అన్నపూర్ణకు బుద్ధి చెప్పి మందలించారు. అయినా వారు ఏమి పట్టించుకోక ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా తన ప్రేమకు తల్లిదండ్రులే అడ్డుగా ఉన్నారని భావించిన అన్నపూర్ణ తల్లిదండ్రులను చంపాలని ప్లాన్ వేసింది.
ఈనేపథ్యంలో అన్నంలో నిద్ర మాత్రలను కలిపింది. ఈ విషయం తెలియని మల్లయ్య రోజూలాగే భోజనం చేశాడు. కొద్దిసేపటి తర్వాత మల్లయ్యకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అతన్ని సిద్దిపేట ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో అన్నంలో నిద్రమాత్రలు కలిపినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత చికిత్స అనంతరం కోలుకున్న మల్లయ్య తన కూతురు అన్నపూర్ణ, ఆమె ప్రియుడు కిషన్‌లు కలిసి నిద్ర మాత్రలను ఇచ్చి తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు అన్నపూర్ణ, కిషన్‌లపై కేసు నమోదు చేశారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కుట్ర పన్ని తనపై నింద వేస్తున్నారని కుటుంబసభ్యులకు తెలిపిన కిషన్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాగా తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, తనే ఆత్మహత్య చేసుకొనేందుకు ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని ఉత్తరం రాసి పరారయ్యాడు. కిషన్ కనిపించకుండా పోయాడని అతని తల్లి ఉత్తరాన్నిపోలీసులకు అందజేసింది.
this truee...?
ReplyDeleteayyo
ReplyDelete