ఉత్తమ తెలుగు చిత్రం కంచె, ఉత్తమ నటుడు అమితాబ్ బచ్చన్, ఉత్తమ నటి కంగనారనౌత్, బాజీరావ్ మస్తానీకి అవార్డుల పంట!
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తరుణమిది. 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎందరో మహామహులకు సాధ్యం కాని స్వప్నం బాహుబలి చిత్రంతో నెరవేరింది. రాజమౌళి కలల చిత్రం బాహుబలి 63వ జాతీయ అవార్డుల విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికై తెలుగు వాడు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ ఘనతను సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచి చరిత్రను సృష్టించింది. మన సాంకేతిక నిపుణులు, నటీనటుల ప్రతిభను దిగంతాలకు చాటిచెప్పి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 600కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి తెలుగు చిత్రపరిశ్రమ వైపు ప్రపంచ సినిమా ఆసక్తిగా చూసేలా చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై బాహుబలి కొత్త చరిత్రకు నాంది పలికింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఖ్యాతిని దక్కించుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ పీకూ చిత్రంలో ఓ విచిత్రమైన వ్యాధిగ్రస్తుడి పాత్రలో అద్వితీయ అభినయంతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైయ్యారు. 73 ఏళ్ల వయసులోనూ తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్నారు. గత ఏడాది క్వీన్ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా నిలిచిన కంగనా రనౌత్ మరోసారి ప్రతిభను చాటింది. తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. పీష్వా బాజీరావ్, మస్తానీ జంట అమర ప్రేమగాథతో తెరకెక్కిన బాజీరావ్ మస్తానీ చిత్రం ఈ పురస్కారాల్లో సత్తాను చాటింది. ఉత్తమ దర్శకుడు, సహాయనటి, సినిమాటోగ్రాఫర్‌తో పాటు ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను సాధించి అత్యధిక జాతీయ అవార్డులను దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ జాతీయ అవార్డుకు ఎంపికైయ్యారు. బాజీరావ్ తల్లి రాధాభాయి పాత్రలో నటించిన బాలీవుడ్ నటి తన్వీ ఆజ్మీ ఉత్తమ సహాయనటిగా నిలిచారు.
తమిళ నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించిన విసరాణై చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఓ ఆటోడ్రైవర్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై మన్ననల్ని అందుకుంది.ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించిన దర్శకుడు సముద్రఖని ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఎడిటర్ బాధ్యతల్ని నిర్వహించి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన కిషోర్ ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గురునానక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆయన భోధనల ఆధారంగా తెరకెక్కిన పంజాబీ చిత్రం నానక్ షా ఫకీర్ చిత్రం ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ మేకప్, ఉత్తమ కాస్ట్య్టూమ్ డిజైన్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. తెలుగులో ఇవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు చిత్రం స్ఫూర్తితో హిందీలో తెరకెక్కిన దమ్ లగాకే హైస్సా చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ గేయరచయిత విభాగాల్లో అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడితో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలకు గాను పీకూ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ రూపొందించిన కంచె చిత్రం నిలిచింది. రెండవ ప్రపంచ యుద్దం, ప్రేమ అంశాల నేపథ్యంలో కులవ్యవస్థను చర్చిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా చక్కటి విజయాన్ని దక్కించుకుంది. బాల దర్శకత్వంలో రూపొందిన తారాయ్ తప్పట్టాయ్ చిత్రానికిగాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఇళయరాజా అవార్డును కైవసం చేసుకున్నారు. తొలి చిత్ర దర్శకుడిగా ఇందిరాగాంధీ జాతీయ అవార్డుకు మసాన్ చిత్రాన్ని తెరకెక్కించిన హైదరాబాద్‌కు చెందిన నీరజ్ ఘయ్‌వాన్ ఎంపికయ్యారు.
బాహుబలి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఊహల్లోంచి పుట్టిన అద్భుత సృష్టి. ఈ కలను సాకారం చేసుకోవడానికి అలుపెరగని పోరాటం చేశారు. ఎన్నో కష్టాలకోర్చారు. మూడేళ్ల శ్రమతో పాటు వందల కోట్ల వ్యయం, వేల సంఖ్యలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాలు అన్నింటికీ మించి రాజమౌళి దర్శకత్వ ప్రతిభ బాహుబలి చిత్రాన్ని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించేలా చేసి వందేళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. అనితర సాధ్యంకాని ఎన్నో రికార్డులు బాహుబలి పేరిట లిఖించబడ్డాయి. 600 కోట్లకు పై చిలుకు వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా కీర్తిపతాకాల్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ఈ చిత్రం విదేశీ వేదికలపై సత్తా చాటింది. తెలుగు వాడి ప్రతిభాపాటవాల్ని విశ్వవ్యాప్తం చేసింది. బాహుబలిని తెరపై ఆవిష్కరించడానికి రాజమౌళి బృందం పెద్ద సంగ్రామమే చేసింది. విమర్శలు, సాధ్యాసాధ్యాలు, బడ్జెట్ పరిమితులు, గాయాలు..ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ఉత్తమ జాతీయ చిత్రం : బాహుబలి
ఉత్తమ దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పీకూ)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ సహాయ నటుడు: సముద్రఖని (విసరాణై)
ఉత్తమ సహాయ నటి : తన్వీ ఆజ్మీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : బాహుబలి
ఉత్తమ గేయ రచయిత : వరుణ్ గ్రోవర్ (దమ్ లగాకే హైసా)
ఉత్తమ నృత్యదర్శకుడు : రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఎడిటింగ్ : టీ ఈ కిషోర్ (విసరాణై)
ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు : ఇళయరాజా (తారాయ్ తప్పట్టాయ్)
ఇందిరాగాంధీ అవార్డు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : నీరజ్ ఘయ్వాన్ (మసాన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బజరంగీ భాయిజాన్
ఉత్తమ నేపథ్య గాయని: మోనాలీ ఠాకూర్( దమ్ లగాకే హైసా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: మహేష్ కాలే (కత్యార్ కల్జాత్ షుసాలి) (మరాఠీ)
నర్గీస్ దత్ అవార్డు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం : నానక్ షా ఫకీర్( పంజాబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎమ్ జయచంద్రన్ (ఎన్ను నింతే మెయిదేన్) ( మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం : దురంతో
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ :ప్రీతి షీల్ సింగ్, క్లోవర్ వూటెన్ (నానక్ షా ఫకీర్)
స్పెషల్ జ్యూరీ : రిషికా సింగ్ (ఇరుది సుత్తురు)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ (బాజీరావ్ మస్తానీ)
ఉత్తమ ఆనిమెటేడ్ ఫిలిం: ఫిషర్‌మెన్, తుక్‌తుక్
ఉత్తమ స్క్రీన్‌ప్లే: జూహీ చతుర్వేది (పీకూ), హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు: కంచె
తమిళం : విసారణై, హిందీ : దమ్ లగాకే హైసా, కన్నడ : తిథి
మలయాళం పాతేమరి, ఒడియా: పహడా రా లుహ.
పంజాబీ: చౌతీ కూట్, కొంకణీ : ఎనిమీ
బెంగాలీ: సంకాచిల్, హర్యాన్వీ: సత్‌రంగీ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్: నానక్ షా ఫకీర్

No comments:
Post a Comment