Sunday 25 September 2016

రిలయన్స్ జియో సిమ్ కార్డు కావాలా?

రిలయన్స్ జియో సిమ్ కార్డు కావాలా....?


reliance jio
రిలయన్స్ జియో సిమ్ కార్డు కోసం అనేక మంది నానా తిప్పలు పడుతున్నారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ల ముందు సిమ్‌ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, పెద్దగా శ్రమించకుండానే జియో సిమ్ కార్డు పొందే సౌకర్యాన్ని రిలయన్స్ సంస్థ చేపట్టింది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 
 
ఇందులోభాగంగా 1800-200-200-2 నెంబరుకు మీ ఫోన్ నుంచి కాల్ చేయాలి. ఆపై మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే, ప్లే స్టోర్ నుంచి 'మైజియో' యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మొట్టమొదట 'గెట్ జియో సిమ్' అన్న బ్యానర్ కనిపిస్తుంది. 
 
ఆపై నిబంధనలను అంగీకరించి, 'గెట్ జియో సిమ్ ఆఫర్'పై క్లిక్ చేస్తే, మీ లొకేషన్‌ను తెలియజేయాలన్న మెసేజ్ వస్తుంది. మీరెక్కడుంటారో చెప్పి, నెక్ట్స్ బటన్ క్లిక్ చేస్తే, మీ మొబైల్ స్క్రీన్‌పై 'ఆఫర్ కోడ్' కనిపిస్తుంది. ఈ ఆఫర్ కోడ్‌తో పాటు ఐడీ ప్రూఫ్, ఫోటో, రెసిడెన్స్ ప్రూఫ్ తదితరాలను తీసుకుని రిలయన్స్ స్టోర్‌కు వెళితే, వెంటనే సిమ్ లభిస్తుందని తెలిపింది.

చిట్కాలు...


 చిట్కాలు...


మీకోసం క్రింద ఇచ్చిన లింక్ ద్వార పొందండి....!


https://drive.google.com/file/d/0B9x_hRQispGWUDNWVVZWaXZGc3M/view?usp=sharing






Saturday 17 September 2016

ఢిల్లీ పోలీస్‌లో 4669 టెంపరరీ కానిస్టేబుల్స్(

ఢిల్లీ పోలీస్‌లో 4669 టెంపరరీ కానిస్టేబుల్స్(ఎగ్జిక్యూటివ్)

ఢిల్లీ పోలీస్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో టెంపరరీ కానిస్టేబుల్స్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsఖాళీలు: 4669
కానిస్టేబుల్ (పురుషులు): 3115 (అన్‌రిజర్వుడ్ - 1557, ఓబీసీ - 847, ఎస్సీ - 473, ఎస్టీ-238)
కానిస్టేబుల్ (మహిళలు): 1554 (అన్‌రిజర్వుడ్ - 815, ఓబీసీ- 443, ఎస్సీ-250, ఎస్టీ - 46)
అర్హత: 10+2 ఉత్తీర్ణత . ఫురుషులు వ్యాలీడ్ డ్రైవింగ్ లెసైన్స్ (మోటార్ సైకిల్/కార్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 2016 నాటికి పురుషులకు 18-21 ఏళ్లు, మహిళలకు 18-25 ఏళ్లు. వేతన శ్రేణి: రూ.5200- రూ.2020 (గ్రేడ్ పే రూ.2000)
శారీరక ప్రమాణాలు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులు 170 సెం.మీ ఎత్తు, ఛాతీ 81 సెం.మీ, గాలి పీల్చుకుని ఛాతీ విస్తరిస్తే 85 సెం.మీ ఉండాలి. జనరల్/ఓబీసీ మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి.
పరీక్ష విధానం: శారీరక ప్రమాణాల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్)ల్లో అర్హులైనవారికి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. గంటన్నర (90 నిమిషాలు) వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు), జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (50 ప్రశ్నలు, 50 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (15 ప్రశ్నలు, 15 మార్కులు) ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 100, మొత్తం మార్కులు 100.
శారీరక సామర్థ్య పరీక్ష: మొదటి దశలో 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. పురుషులు ఆరు నిమిషాల్లో, మహిళలు 8 నిమిషాల్లో పరుగెత్తాలి. తర్వాత పురుషులకు 14 ఫీట్, మహిళలకు 10 ఫీట్ లాంగ్‌జంప్ ఉంటుంది. అదేవిధంగా పురుషులకు 3.9 ఫీట్, మహిళలకు 3.0 ఫీట్ హైజంప్ ఉంటుంది.
ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.100 ఎస్‌బీఐ చలాన్, నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ssconline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 10, 2016
ఫీజు చెల్లించడానికి చివరి తేది: అక్టోబర్ 13, 2016
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: మార్చి 4, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: ssc.nic.in

Wednesday 14 September 2016

Airtel కొత్త ఆఫర్, 5జీబి ఇంటర్నెట్ ఉచితం

Airtel కొత్త ఆఫర్, 5జీబి ఇంటర్నెట్ ఉచితం

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోని ప్రతి ఒక్కరు ఈ ఉచిత డేటాను పొందవచ్చు.



 మీ ఫోన్ UMTS modeను మార్చుకోవటం ద్వారా నెట్‌వర్క్ మోడ్ మారుతుంది. ఇందుకు మీరు ఫోన్ Settingsలోకి వెళ్లి → Connections → More Networks → Mobile Networks → Network Modeను మార్చుకంటే సరిపోతుంది.

#1

ముందుగా myAirtel appను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌లో మీ 10 డిజిట్ ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా వన్‌టైమ్ పాస్‌వర్డ్ మీ ఫోన్‍‌కు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీకు కొన్ని కండీషన్స్‌తో కూడిన 5జీబి ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది.

#2

ఎయిర్‌టెల్ అందిస్తోన్న ఉచిత 5జీబి ఇంటర్నెట్ రాత్రి వేళ్లలో మాత్రమే వాడుకోవాలి. అదికూడా రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే.

#3

myAirtel app ద్వారా మీరు రూ.200 అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని రీచార్జ్ చేసినట్లయితే మీకు 1జీబి డేటా ఉచితంగా లభిస్తుంది.

#4

మీ myAirtel app యాప్‌లోని Airtel Walletలో రూ.100 లోడ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ మీకు ఉచితంగా లిభిస్తుంది.

#5

మీ వాలెట్ ద్వారా రూ.100కంటే ఎక్కువ మొత్తాన్ని మరో myAirtel app యూజర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయటం ద్వారా మీకు అదనంగా 500MBఇంటర్నెట్ లభిస్తుంది.

#6

ఎయిర్ టెల్ Wynk మ్యూజిక్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని 10 పాటలను వినటం ద్వారా మీకు 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. Wynk గేమ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని అన్ లాక్ చేయటం ద్వారా మీకు 700 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.

#7

Wynk మూవీ యాప్‌లో సినిమాలు చూడటం ద్వారా 1జీబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. Wynk మ్యూజిక్ యాప్‌ నుంచి ఒక పాటను మీరు పూర్తిగా డౌన్ లోడ్ చేసుకున్నట్లయితే 200 ఎంబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది.

#8

మీ Airtel Wallet నుంచి మీ మిత్రులకు రూ.10 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయటం ద్వారా 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది

#9

myAirtel app లింక్‌ను మీ మిత్రులకు షేర్ చేసి, వారు కూడా దానిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే 500 MB ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది

Tuesday 13 September 2016

తెలంగాణా तेलंगाना Telangana

    Telangana New Districts Maps

Download Telangana New District Map

Download Adilabad District Map

Download Hanamkonda District Map

Download Hyderabad District Map

Download Jagtial District Map

Download Jaya-shankar District Map

Download Kamareddy District Map

Download Karimnagar District Map

Download Khammam District Map

Download Komaram bheem District Map

Download Kothagudem District Map

Download Mahabubabad District Map

Download Mahabubnagar District Map

Download Malkajgiri District Map

Download Medak District Map

Download Nagarkurnool District Map

Download Nalgonda District Map

Download Nirmal District Map

Download Nizamabad District Map

Download Peddapalle District Map

Download Rangareddy District Map

Download Sangareddy District Map

Download Shamshabad District Map

Download Siddipet District Map

Download Suryapet District Map

Download Wanaparthy District Map

Download Warangal District Map

Download Yadadri District Map

Monday 12 September 2016

TELANGANA STATE NEW DISTRICT MAP

TRS came up with the proposal of making the 10 districts in Telangana into 24 with 4-6 Assembly constituencies under each one of them.

Telangana Districts:

1) Siddipet - Siddipet, Dubbaka, Gajwel, Manakonduru and Siricilla

2) Medak - Medak, Ella Reddy, Kama Reddy, Jukkal and Bhansuwada

3) Mahbubnagar - Mahbubnagar, Shadnagar, Jadcherla, Maktal and Devarkadra

4) Vanaparthi - Vanaparthi, Gadwal, Alampur, Narayanapet and Kodangal

5) Nagar Kurnool - Nagar Kurnool, Kalvakurthi, Acchampet and Kollapur

6) Nalgonda - Nalgonda, Nakirekal, Munugodu, Devarakonda and Nagarjuna Sagar

7) Suryapet - Suryapet, Miryalaguda, Tundaturthi, Huzurnagar and Kadada

8) Khammam - Khammam, Madhira, Paleru, Vyra and Yellandu

9) Bhadrachalam - Bhadrachalam, Pinapaka, Aswaraopet, Sattupalli and Kothagudem

10) Adilabad - Adilabad, Boath, Nirmal, Khanapur and Byamsa

11) Mancherial - Mancherial, Sirpur Kagaznagar, Asifabad, Bellampalli and Chennur

12) Warangal - Warangal West, Warangal East, Vardannapet, Palakurthi and Parakala

13) Janagam - Janagam, Aleru, Station Ghanpur, Mahabubabad and Dornakal

14) Acharya Jayashankar District (Bhupalapalli) - Bhupalapalli, Mandhani, Mulugu and Narsampet

15) Jagtial - Jagtial, Korutla, Vemulawada, Husnabad and Dharmapuri

16) Karimnagar - Karimnagar, Peddapalli, Ramagundam, Choppadandi and Huzurabad

17) Nizamabad - Nizamabad Urban, Nizamabad Rural, Arkuru, Balkonda and Bodhan

18) Ranga Reddy (District Head Quarters - Vikarabad) - Vikarabad, Parigi, Thanduru, Chevella and Rajendranagar

19) Hyderabad Central - Nampalli, Khairatabad, Goshamahal, Amberpet and Musheerabad

20) Charminar - Charminar, Yakatpura, Chandrayana Gutta, Bhahadurpura, Karvan and Maheswaram

21) Golkonda - Jubille Hills, Kukatpally, Patancheru, Serilingampally and Kutbullapur

22) Hyderabad East (District Head Quarter - Bhuvanagiri) - Bhuvanagiri, Uppal, LB Nagar, Ibrahimpatnam and Malakpet

23) Secunderabad - Secunderabad, Cantonment, Sanathnagar, Malkajgiri and Medchal

24) Sangareddy - Sangareddy, Zaheerabad, Andole, Narayankhed, Narsapur

Happy Bakrid

May Allah this occasion flood your life with happiness, ur heart with love, ur soul with spirtual, ur mind with wisdom,wishing u a very Happy Bakrid Mubarik.

నవోదయలో 2072 పోస్టులు............

నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: నవోదయ విద్యాలయ సమితి కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. దేశంలోని ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 2072
విభాగాల వారీగా ఖాళీల వివరాలు...

అసిస్టెంట్ కమిషనర్


-ఖాళీల సంఖ్య - 2. వీటిలో జనరల్ - 1, ఓబీసీ - 1 ఉన్నాయి. వీటిలో ఒకటి పీహెచ్‌సీ కేటగిరీకి కేటాయించారు.
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 7,600/-
అర్హతలు: హ్యూమనిటీస్ / సైన్స్ లేదా కామర్స్‌లో పీజీతోపాటు కనీసం ఐదేండ్లపాటు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రభుత్వ లేదా సెమీ గవర్నమెంట్ లేదా అటానమస్ సంస్థల్లో పనిచేసి ఉండాలి.
వయస్సు: 2016, జూలై 31నాటికి 45 ఏండ్లు మించరాదు.

ప్రిన్సిపాల్


-ఖాళీల సంఖ్య - 40. వీటిలో జనరల్ - 22, ఓబీసీ - 10, ఎస్సీ - 6, ఎస్టీ - 2 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 15,600 - 39, 100 + గ్రేడ్ పే రూ. 7,600/-
వయస్సు: 35 -45 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఎడ్ లేదా టీచింగ్‌లో తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. వీటితోపాటు అనుభవం ఉండాలి.

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)


-ఖాళీల సంఖ్య - 880. సబ్జెక్టుల వారీగా ఖాళీలు...
-బయాలజీ - 77. వీటిలో జనరల్ - 44, ఓబీసీ - 17, ఎస్సీ - 15, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
-కెమిస్ట్రీ - 90. వీటిలో జనరల్ - 46, ఓబీసీ - 12, ఎస్సీ - 15, ఎస్టీ - 17 ఖాళీలు ఉన్నాయి.
-కామర్స్ - 52. వీటిలో జనరల్ - 20, ఓబీసీ - 15, ఎస్సీ - 11, ఎస్టీ - 6 ఖాళీలు ఉన్నాయి.
-ఎకనమిక్స్ - 112. వీటిలో జనరల్ - 44, ఓబీసీ - 23, ఎస్సీ - 33, ఎస్టీ - 12 ఖాళీలు ఉన్నాయి.
-ఇంగ్లిష్ - 76. వీటిలో జనరల్ - 32, ఎస్సీ - 11, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-జాగ్రఫీ - 56. వీటిలో జనరల్ - 32, ఓబీసీ - 9, ఎస్సీ - 10, ఎస్టీ - 5 ఖాళీలు ఉన్నాయి.
-హిందీ - 56. వీటిలో జనరల్ - 57, ఎస్సీ - 12, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-హిస్టరీ - 70. వీటిలో జనరల్ - 48, ఓబీసీ - 8, ఎస్సీ - 9, ఎస్టీ - 5 ఖాళీలు ఉన్నాయి.
-మ్యాథ్స్ - 117. వీటిలో జనరల్ - 36, ఓబీసీ - 25, ఎస్సీ - 31, ఎస్టీ - 25 ఖాళీలు ఉన్నాయి.
-ఫిజిక్స్ - 102. వీటిలో జనరల్ - 49, ఓబీసీ - 19, ఎస్సీ - 15, ఎస్టీ - 19 ఖాళీలు ఉన్నాయి.
-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 50. వీటిలో జనరల్ - 33, ఎస్సీ - 7, ఎస్టీ - 10 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34, 800 + గ్రేడ్ పే రూ. 4,800/-
వయస్సు: 40 ఏండ్లు మించరాదు.
అర్హతలు:కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో రెండేండ్ల పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఐటీ పోస్టుకు మాత్రం బీఎడ్ అవసరం లేదు. ఇంగ్లిష్, హిందీలో ప్రావీణ్యత ఉండాలి.

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)


-ఖాళీల సంఖ్య - 660. సబ్జెక్టుల వారీగా ఖాళీలు...
-ఇంగ్లిష్ - 159. వీటిలో జనరల్ - 77, ఓబీసీ -26, ఎస్సీ - 19, ఎస్టీ - 37 ఖాళీలు ఉన్నాయి.
-హిందీ - 132. వీటిలో జనరల్ - 78, ఓబీసీ - 28, ఎస్సీ - 18, ఎస్టీ - 8 ఖాళీలు ఉన్నాయి.
-మ్యాథ్స్ - 229. వీటిలో జనరల్ - 99, ఓబీసీ -20, ఎస్సీ - 51, ఎస్టీ - 59 ఖాళీలు ఉన్నాయి.
-సైన్స్ - 72. వీటిలో జనరల్ - 35, ఓబీసీ - 6, ఎస్సీ - 9, ఎస్టీ - 22 ఖాళీలు ఉన్నాయి.
-సోషల్ స్టడీస్ - 68. వీటిలో జనరల్ - 49, ఓబీసీ - 8, ఎస్సీ - 2, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
అర్హతలు: రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. లేదా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోధనా సామర్థ్యం కలిగి ఉండాలి. కొన్ని సబ్జెక్టులకు ఆయా ప్రాంతాల స్థానిక భాషల్లో బోధన చేయాలి. సీబీఎస్‌ఈ నిర్వహించిన సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి.

మిసిలీనియస్ కేటగిరీ


-ఖాళీల సంఖ్య - 255. విభాగాల వారీగా...
-మ్యూజిక్ - 41. వీటిలో జనరల్ - 14, ఓబీసీ - 21, ఎస్సీ - 2, ఎస్టీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-ఆర్ట్ - 50. వీటిలో జనరల్ - 20, ఓబీసీ - 26, ఎస్టీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-పీఈటీ (పురుషులు) - 28. వీటిలో జనరల్ - 12, ఓబీసీ - 16, ఖాళీలు ఉన్నాయి.
-పీఈటీ (మహిళలు) - 91. వీటిలో జనరల్ - 54, ఓబీసీ - 21, ఎస్సీ - 8, ఎస్టీ - 8 ఖాళీలు ఉన్నాయి.
-లైబ్రేరియన్ - 45. వీటిలో జనరల్ - 35, ఓబీసీ - 10 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4, 600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-లైబ్రేరియన్ పోస్టుకు లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రెరీ సైన్స్‌లో ఏడాది కాలపరిమితిగల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్, హిందీలో లేదా స్థానిక భాషలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి.

టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)


-ఖాళీల సంఖ్య - 235.
-వీటిలో తెలుగు - 4 (ఎస్టీ కేటగిరీలో) ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34, 800 + గ్రేడ్ పే రూ. 4,600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా
-సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో బోధించాలి. వీటితోపాటు సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి.
నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, మహిళలకు 10 ఏండ్లు (అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్స్‌పాల్ పోస్టులకు మాత్రం సడలింపు లేదు), నవోదయ ఉద్యోగులకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీజీటీ, మిస్‌లీనియస్ (లైబ్రెరీ), టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు మాత్రం కేవలం రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-రాతపరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 42 కేంద్రాల్లో నిర్వహిస్తారు. మనకు దగ్గర్లోని కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం.

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: అసిస్టెంట్ కమిషనర్ - రూ. 1,500/-, ప్రిన్స్‌పాల్ - రూ. 1,500/, పీజీటీ, టీజీటీ, మిసిలీనియస్, రీజనల్ లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు రూ. 1,000/-
-చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 14
-రాతపరీక్ష: 2016 నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.nvshq.org / www.mecbsegov.in

4669 కానిస్టేబుల్ పోస్టులు

ఢిల్లీ పోలీస్ - 2016 విభాగం
కింద 4669 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: తాత్కాలిక ప్రాతిపదికన కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 4669
-కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష అభ్యర్థులు - 3115. వీటిలో జనరల్ - 1557, ఓబీసీ - 847, ఎస్సీ - 473, ఎస్టీ - 238.
-కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు - 1554. వీటిలో జనరల్ - 815, ఓబీసీ - 443, ఎస్సీ - 250, ఎస్టీ - 46.
-వీటిలో 10 శాతం పోస్టులు ఎక్స్‌సర్వీస్‌మెన్లకు కేటాయించారు.
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2016, జూలై 1 నాటికి
పురుష అభ్యర్థులకు 18 - 21 ఏండ్ల మధ్య ఉండాలి.
మహిళా అభ్యర్థులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: పీఈ అండ్ ఎంటీ, ఆన్‌లైన్ పరీక్ష, డీఎంఈ ద్వారా
-పీఈ అండ్ ఎంటీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఢిల్లీ పోలీస్ శాఖ పంపిస్తుంది.
-పీఈ అండ్ ఎంటీ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లను అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న రాష్ర్టాల్లో/ యూటీల్లో నిర్వహిస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ల్లో నిర్వహిస్తారు.
ఈ పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది.
SSC
రాతపరీక్ష విధానం:
-ఈ పరీక్షను 2017, మార్చి 4న నిర్వహించనున్నారు
నోట్: ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే రాతపరీక్షకు అనుమతిస్తారు.
-దరఖాస్తు చేసుకొన్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లకు హాజరు కావాలి
-రాతపరీక్ష ఉత్తీర్ణులైన వారికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలను ఢిల్లీ పోలీస్ శాఖ నిర్వహిస్తుంది.
అనంతరం మెడికల్ ఎగ్జామ్ రివ్యూని కూడా ఢిల్లీ పోలీస్ నిర్వహిస్తుంది. చివరగా అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్‌ను నిర్వహించి అపాయిట్‌మెంట్ లెటర్‌ను ఢిల్లీ పోలీస్ ఇస్తుంది.
శారీరక ప్రమాణాలు:
-పురుష అభ్యర్థులకు (జనరల్/ఓబీసీ, ఎస్సీ) - 170 సెం.మీ. ఎత్తు, 81 సెం.మీ ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. వరకు వ్యాకోచించాలి.
-ఎస్టీ అభ్యర్థులకు - ఎత్తు 165 సెం.మీ., ఛాతీ 76 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 80 సెం.మీ వరకు వ్యాకోచించాలి.
-మహిళా అభ్యర్థులకు - జనరల్, ఓబీసీ
- 165 సెం.మీ.,
-ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు - 155 సెం.మీ. ఎత్తు ఉండాలి.
-ఫిజకల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (క్వాలిఫయింగ్) 31 ఏండ్ల వరకు ఉన్న పురుష అభ్యర్థులకు - 1600 మీటర్లు పరుగు పందాన్ని 6 నిమిషాల్లో, 14 అడుగుల లాంగ్ జంప్, హైజంప్ 39.
-31 ఏండ్లులోపు మహిళా అభ్యర్థులకు - 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పరుగెత్తాలి. లాంగ్‌జంప్ 10 అడుగులు, హైజంప్ 3 అడుగులు.
పేస్కేల్: రూ. 5200-20200/-
గ్రేడ్ పే: రూ. 2000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 10
(సాయంత్రం 5 గంటల వరకు)
-పరీక్ష ఫీజు: రూ. 100/- (ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
పరీక్ష తేదీ: 2017, మార్చి 4
వెబ్‌సైట్: http://ssconline.nic.in

Friday 2 September 2016

How to Get Jio Sim Easy...

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్........ఉద్యోగాలు

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్.. వివిధ విభాగాల్లో పోలీస్ కానిస్టేబుల్, వార్డర్స్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల వివరాలు...
పోలీస్ కానిస్టేబుల్(సివిల్): 3216
పోలీస్ కానిస్టేబుల్(ఏఆర్): 1067
వార్డర్స్(మేల్): 240
వార్డర్స్(ఫిమేల్): 25
అర్హత:
ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి/ తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:సెప్టెంబర్ 14
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: recruitment.appolice.gov.in

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో ..........279 పోస్టులు

ఎస్‌ఎస్‌సీలో279 పోస్టులు

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌ీసీ) ఈస్టర్న్ రీజియన్ ప్రకటనను విడుదల చేసింది. పదో తరగతి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు గల అభ్యర్థులకు ఇందులో పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 279
ఖాళీల వివరాలు...
  1. జూనియర్ ఇంజనీర్ (క్వాలిటీ అస్యూరెన్స్)- 105 (అమ్యునిషన్-40, వెపన్స్ -14, ఇన్‌స్ట్రుమెంట్స్-7, స్మాల్ ఆర్మ్స్-24, మెటలర్జీ-20).
  2. సైంటిఫిక్ అసిస్టెంట్-66 (మెకానికల్-9; కెమికల్-28; రబ్బర్, ప్లాస్టిక్, టెక్స్‌టైల్-5, ఎలక్ట్రికల్-8, సివిల్-13, నాన్ డిస్ట్రక్టివ్-3).
  3. ఆఫీస్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)-40.
  4. ఫీల్డ్ అటెండెంట్-19
  5. ల్యాబ్ అసిస్టెంట్-19
  6. రీసెర్చ్ అసిస్టెంట్-5
  7. జూనియర్ కెమిస్ట్-5
  8. సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ (వీవింగ్)-4
  9. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్-4
  10. జూనియర్ జియోగ్రాఫికల్ అసిస్టెంట్-2
  11. డిప్యూటీ రేంజర్-2
  12. అసిస్టెంట్ ఆర్కైవిస్ట్-1
  13. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-1
  14. డూప్లికేటింగ్ మెషిన్ ఆపరేటర్-1
  15. ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1
  16. స్పీచ్ థెరపిస్ట్-1; 17. లైబ్రరీ క్లర్క్-1
  17. మెట్రోలాజికల్ అసిస్టెంట్-1
  18. హెరాల్డిక్ అసిస్టెంట్-1.

విద్యార్హత-అనుభవం:
  1. జూనియర్ ఇంజనీర్: అమ్యునిషన్ విభాగం పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్). వెపన్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ప్రొడక్షన్/మెషిన్ అండ్ టూల్స్). స్మాల్ ఆర్మ్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ (లేదా) డిప్లొమా(మెకానికల్ ఇంజనీరింగ్). మెటలర్జీ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) (లేదా) డిప్లొమా (మెటలర్జికల్ ఇంజనీరింగ్). జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి.
  2. సైంటిఫిక్ అసిస్టెంట్: కెమికల్ విభాగం పోస్టులకు పీజీ (కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) (లేదా) కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్, రెండేళ్ల పని అనుభవం. సివిల్ పోస్టులకు పీజీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ), రెండేళ్ల పని అనుభవం.
  3. ఆఫీస్ అటెండెంట్: పదో తరగతి/తత్సమానం.
  4. లేబొరేటరీ అసిస్టెంట్: 10+2 (లేదా) బయాలజీతో తత్సమాన విద్యార్హత. జువాలజీ ల్యాబ్‌కు సంబంధించిన పని అనుభవం.
  5. ఫీల్డ్ అటెండెంట్: పదో తరగతి (లేదా) తత్సమానం.
వయసు : జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18-30 ఏళ్లు; ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు 18-27 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
వేతనం: జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌లకు రూ.9,300-34,800+గ్రేడ్‌పే. ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.5,200-20,200+గ్రేడ్‌పే.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులను బట్టి ఒక్కో పోస్టుకు 25 మంది చొప్పున రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ తదితర పరీక్షలు నిర్వహిస్తారు.

రాత పరీక్ష :
  1. పదో తరగతి విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున; జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
  2. ఇంటర్మీడియెట్ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ అనే నాలుగు సబ్జెక్టుల నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. యూజీ/పీజీ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు కూడా రాత పరీక్ష ఇదే తరహాలో ఉంటుంది. అయితే ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్‌తోపాటు రీజనింగ్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్లను వేర్వేరుగా సమర్పించాలి. పరీక్ష రుసుం కూడా విడివిడిగా చెల్లించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్‌కు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, వయసు, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి.

చిరునామా :
ది రీజనల్ డెరైక్టర్ (ఈఆర్), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈస్ట్ రీజియన్, నిజాం ప్యాలెస్, ఫస్ట్ ఎంఎస్‌వో బిల్డింగ్, ఎనిమిదో అంతస్తు, 234/4, ఏజేసీ బోస్ రోడ్డు, కోల్‌కతా, 700020.

పరీక్ష రుసుం : ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు నింపేందుకు, ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 26.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్ రీజనల్ ఆఫీసుకు చేరాల్సిన తేది: 2016, సెప్టెంబర్ 26 నుంచి పది రోజుల్లోపు.
వెబ్‌సైట్: ssconline.nic.in/sscselectionpost
l సింగిల్ డిజిట్ ఖాళీలున్న ఉద్యోగాల విద్యార్హత, వయసు, అనుభవం, వేతనం తదితర వివరాలకుకింది వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.sscer.org

ప్రసార భారతిలో 27 పోస్టులు...............

ప్రసార భారతిలో 27 పోస్టులు

ప్రసార భారతి.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గువహటి, శ్రీనగర్, జైపూర్, అహ్మదాబాద్, భోపాల్, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్, పాట్నా ప్రాంతాల్లో ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ డెరైక్టర్, డెరైక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: డిప్యూటీ డెరైక్టర్ (ఖాళీలు-5), డెరైక్టర్ (ఖాళీలు-22)
అర్హత: ఎంబీఏ (ఫైనాన్స్)/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పీజీడీఎం (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్), కమర్షియల్ అకౌంటింగ్‌లో పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 16 (ఆగస్టు 27 నుంచి 21 రోజులు)
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.prasarbharati.gov.in