Friday 31 August 2018

తెలంగాణ‌లో 9355 జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి పోస్టులు (చివ‌రి తేది: 11.09.18)


తెలంగాణ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి పోస్టుల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జూనియర్‌ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తూ మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా వీరిని క్రమబద్ధీకరిస్తుంది. వివ‌రాలు....* జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిఅర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కొత్త జిల్లాల్లో వారు స్థానిక అభ్యర్థులై ఉండాలి.వ‌య‌సు: 18-39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.ప‌రీక్షా విధానం: రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మూడు గంటల వ్యవధిలో రెండు పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపరు 150 మార్కులతో జనరల్‌ నాలెడ్జి, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీకి చెంది ఉంటుంది. రెండో పేపరు మరో 150 మార్కులతో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, ప్రభుత్వ పథకాలకు చెంది ఉంటుంది. పశ్నపత్రాలు జంబ్లింగ్‌ పద్ధతిలో ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.400. ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 10.09.2018ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.09.2018
 
 

Thursday 30 August 2018

RRB Admit Card: ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి 2018 ఎగ్జామ్: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్....

దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 62,907 గ్రూప్-డి పోస్టుల భర్తీకి సెప్టెంబరు 17న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులకు 10 రోజుల ముందునుంచే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ కల్పించనుంది. అడ్మిట్ కార్డులను సెప్టెంబరు 7 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. గ్రూప్-డి పోస్టుల భర్తీకి మొదటిసారిగా ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో మొత్తం 100 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సమయం 90 నిమిషాలు.
రాతపరీక్షలో ఉత్తీర్ణులైవారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇప్పటికే గ్రూప్-సి విభాగానికి సంబంధించి 66,502 అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలిసారిగా ఆన్‌లైన్ రాతపరీక్ష(ఆగస్టు 9) నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-డి పోస్టుల భర్తీకి కూడా ఆన్‌లైన్ పరీక్షనే నిర్వహించనున్నారు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా...
* మొదట indianrailways.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* వెబ్‌సైట్‌లో Recruitment ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Tuesday 28 August 2018

సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే, నాగ్‌పూర్‌లో 313 అప్రెంటిస్‌ ఖాళీలు (చివ‌రి తేది: 15.09.18)

సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే, నాగ్‌పూర్ డివిజ‌న్, వ‌ర్క్‌షాప్ మోటిబగ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు .....* అప్రెంటిస్‌మొత్తం పోస్టులు: 313ట్రేడుల‌ వారీగా ఖాళీలు: ఫిట్ట‌ర్‌-26, కార్పెంట‌ర్‌-20, వెల్డ‌ర్‌-20, ఎల‌క్ట్రీషియ‌న్‌-30, స్టెనోగ్రాఫ‌ర్‌-50, ప్లంబ‌ర్‌-20, పైయింట‌ర్‌-20, వెయిర్‌మ్యాన్‌-20, త‌దిత‌రాలు....అర్హ‌త‌: 50శాతం మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 15 - 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.చివ‌రితేది: 15.09.2018.
 
 

Wednesday 22 August 2018

TSLPRB SCT SI, PC & ASI Hall Tickets Download...

SCT SI Civil and / or Equivalent PWT on 26th August 2018
Sunday, 10 AM to 1 PM 
New

 SCT PC Civil and / or Equivalent PWT on 30th September 2018
Sunday, 10 AM to 1 PM
New 



SCT SI IT & C / ASI FPB PWT on 9th September 2018
Sunday, 10 AM to 1 PM for SCT SI IT & C New
2.30 to 5.30 PM for SCT ASI FPB
New



Download Here !!!
 
https://www.tslprb.in/Account/Login

Download Here !!!

డిప్లొమా అర్హతతో.. స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు!

విశాఖ‌ప‌ట్నంలోని భార‌త ఉక్కు మంత్రిత్వ శాఖ‌కు చెందిన న‌వ‌ర‌త్న‌ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్' (ఆర్ఐఎన్ఎల్‌) సంస్థ రాయ్‌బ‌రేలి(ఉత్తర్ ప్రదేశ్)లో కొత్త‌గా నెల‌కొల్పిన 'ఫోర్జ్‌డ్ వీల్' ప్లాంటు కోసం వివిధ ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో తగు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు జులై 26 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివ‌రాలు....

* మొత్తం ఖాళీలు సంఖ్య‌: 95

1) ఆప‌రేట‌ర్ (ఎస్‌-4 గ్రేడ్‌): 36
విభాగాల‌ు ఖాళీలు
మెకానిక‌ల్‌ 17
ఆటోమేష‌న్‌ 05
ఎన్‌డీటీ 06
ల్యాబొరేట‌రీ 04
ఎల‌క్ట్రిక‌ల్‌ 04
మొత్తం ఖాళీలు 36

అర్హ‌త‌:
స‌ంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు 6 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు:
33 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. 

2) టెక్నీషియ‌న్ (ఎస్‌-3 గ్రేడ్‌): 59

విభాగాల‌ుఖాళీలు
ఆప‌రేష‌న్‌ 26
మెకానిక‌ల్‌ 17
ఎల‌క్ట్రిక‌ల్ 07
క్రేన్‌ 04
ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌ 02
ప్లానింగ్‌ 03
మొత్తం ఖాళీలు 59

అర్హ‌త‌: స‌ంబంధిత ట్రేడులు/ బ్రాంచులు ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు 3 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు:
30 సంవత్సరాలకు మించ‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక‌ విధానం:
రాత‌ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
రూ.300.

* ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం 26.07.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది 13.08.2018

నోటిఫికేషన్
వెబ్‌సైట్

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో 300 పోస్టులు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs
పోస్టుల వివరాలు..
  1. అసిస్టెంట్: 150
    అర్హత:
    కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  2. అసోసియేట్: 50
    అర్హత:
    కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, సీఏ-ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
  3. అసిస్టెంట్ మేనేజర్: 100
    అర్హత:
    కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ/రెండేళ్ల ఫుల్‌టైం ఎంఎంఎస్/రెండేళ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
వయసు: 2018, జనవరి 1 నాటికి 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 6, 2018. వెబ్‌సైట్: www.lichousing.com

ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు (చివ‌రితేది: 09.09.18)

బిలాస్‌పూర్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న ఆగ్నేయ మధ్య రైల్వే.. రాయ్‌పుర్ డివిజ‌న్‌, వ్యాగ‌న్ రిపేర్ షాప్ (రాయ్‌పుర్‌)లో అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* ట్రేడ్ అప్రెంటిస్ ట్రేడులు: వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, కార్పెంట‌ర్‌, ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, స్టెనో, పెయింట‌ర్‌, మెషినిస్ట్ త‌దిత‌రాలు.మొత్తం ఖాళీలు: 413 (రాయ్‌పూర్ డివిజ‌న్-255, వ్యాగ‌న్ రిపేర్ షాప్-158)అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 15 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: విద్యార్హ‌త మార్కులు, వైద్య ప‌రీక్ష ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివ‌రితేది: 09.09.2018.
 
 

Monday 20 August 2018

న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టుల వివ‌రాలు:
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 8,339

పోస్టులుసబ్జెక్టులు
పీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ, హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, ఎక‌నామిక్స్‌, మ‌ర్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌
టీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్‌, పీ &హెచ్ఈ, ఆర్ట్‌& ఎడ్యుకేష‌న్‌,డ‌బ్ల్యూఈటీ.

అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లోమాస్టర్ డిగ్రీ, డిగ్రీ. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ విభాగంలో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.

గ‌రిష్ఠ వ‌య‌సు:
పోస్టులు వయోపరిమితి (31.08.2018)
ప్రిన్సిప‌ల్ 35 - 50 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిప‌ల్ 35 - 45 సంవత్సరాలు
పీజీటీ 40 సంవత్సరాలు
టీజీటీ 35 సంవత్సరాలు
లైబ్రేరియన్ 35 సంవత్సరాలు
ప్రైమరీ టీచర్ 30 సంవత్సరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పోస్టులు ఖాళీల సంఖ్య
ప్రిన్సిప‌ల్ 76
వైస్-ప్రిన్సిప‌ల్ 220
పీజీటీ 592
టీజీటీ 1,900
ప్రైమ‌రీ టీచ‌ర్లు 5,300
ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్) 201
లైబ్రేరియ‌న్ 50
మొత్తం ఖాళీల సంఖ్య 8,339

Monday 13 August 2018

Happy Independence Day

TSPSC Upcoming Notification

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ కు సిద్దమైంది. త్వరలోనే 6,603 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఇటీవలే తండాలను, గిరిజన గ్రామాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే. 500 జనాభాను మించిన ప్రతి గ్రామాన్ని పంచాయతీగా మార్చారు. దీంతో నూతనంగా దాదాపు 4,383 గ్రామ పంచాయ‌తీల‌ు ఏర్పడ్డాయి. ఇలా పాతవి, కొత్తవి కలుపుకుని మొత్తం 12,741 పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి.

అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధికారులతో సమావేశమై వెంటనే సీఎం ఆదేశాల దిశగా పనిచేయాలని సూచించారు.

దీంతో కొత్త, పాత పంచాయితీలకు కలిపి 6,603 పంచాయతీ కార్యదర్శులు అవసరముంటారని అధికారులు ప్రభుత్వానికి నివేధిక అందించారు. దీనికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపింది. అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

TSTRANSCO Recruitment 2018: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!

ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ట్రాన్స్‌కో).. జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని పూర్వపు జిల్లాల ప్రాతిప‌దిక‌న జోన‌ల్ విధానంలోనే ఈ పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత‌ప‌రీక్ష‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. కామర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా నిర్ణీత తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 
ఉద్యోగ వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 106

* జూనియ‌ర్ అకౌంట్స్ ఆఫీస‌ర్ (జేఏఓ): 44
* జూనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్ (జేపీఓ): 62


అర్హ‌త‌:

జేఏఓ పోస్టులకు ప్ర‌థ‌మ శ్రేణిలో బీకాం లేదా ఎంకాం డిగ్రీ (లేదా) సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ-ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌ ఉండాలి.
జేపీఓ పోస్టులకు ప్ర‌థ‌మ శ్రేణిలో బీఏ/ బీకాం/ బీఎస్సీ ఉత్తీర్ణ‌త ఉండాలి.
వ‌య‌సు: 01.07.2018 నాటికి 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక‌ విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.

తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ సమాఖ్యలో 82 ఉద్యోగాలు

Jobsతెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
 విభాగాల వారీ ఖాళీలు: 
 1. అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్-2 అండ్ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్: 6
 అర్హత:
డెయిరీ టెక్నాలజీలో బీఎస్సీ/బీటెక్/బీవీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
 దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2018.

 2. ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ అండ్ ఫీల్డ్ సూపర్ వైజర్ : 16
 అర్హత: ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌తో పాటు డెయిరీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. ప్రాసెసింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు డెయిరీ టెక్నాలజీలో బీఎస్సీ/బీటెక్/బీవీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
 దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2018.

 3. ల్యాబ్ అసిస్టెంట్ : 10
 అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత (కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి).
 దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2018.

 4. బాయిలర్ ఆపరేటర్ (గ్రేడ్ 2) :  3
 అర్హత:
పదో తరగతి ఉత్తీర్ణత.

 5. ప్లాంట్ ఆపరేటర్ : 25
 అర్హత:
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్ అండ్ ఫిట్టర్ విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్.

 6. మార్కెటింగ్ అసిస్టెంట్ : 10

 7. సూపర్‌వైజర్ (మార్కెటింగ్) : 12
 అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు మార్కెటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
 వయసు: అన్ని పోస్టులకు 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్లకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు  ఉంటుంది).

 దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో
 దరఖాస్తు ఫీజు: రూ.200 (రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు లేదు).
 దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 9, 2018
 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
 వెబ్‌సైట్: https://tspsc.gov.in

యూపీఎస్సీ-సీడీఎస్ ఎగ్జామ్- 2018

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్ (2)-2018 ప్రకటన విడుదల చేసింది.
Jobs
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు: 414

1. ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), డెహ్రాడూన్: 100
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

2. ఇండియన్ నేవల్ అకాడమీ, (ఎజిమల): 45 అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
3. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్: 32
అర్హత:
గ్రాడ్యుయేషన్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో)/బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.

4. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు, స్త్రీలు): 237 అర్హత: ప్రొఫెషనల్/టెక్నికల్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాత పరీక్ష విధానం :
ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
సబ్జెకు సమయం మార్కులు
ఇంగ్లిష్ 2 గం. 100
జనరల్ నాలెడ్జ్ 2 గం. 100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గం. 100

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
సబ్జెక్టు సమయం మార్కులు
ఇంగ్లిష్ 2 గం. 100
జనరల్ నాలెడ్జ్ 2 గం. 100

రాత పరీక్ష తేదీ
: నవంబర్ 18, 2018.
తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు). దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 3, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: http://upsc.gov.in/

Sunday 12 August 2018

TSLPRB 2018: ఎస్సై, ఏఎస్సై పరీక్షల తేదీ మారింది

telangana police recruitment test postponedతెలంగాణలో పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీ మారింది. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలను సెప్టెంబర్ 2న జరగాల్సి ఉండగా.. వాటిని సెప్టెంబర్ 9కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 2నే టీఎస్‌పీఎస్సీ ఏఎస్ఓ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎస్ఎల్‌పీఆర్బీ) ప్రకటించింది. కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ సీ) పరీక్షను 13,944 మంది రాయనుండగా.. ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై ఎగ్జామ్‌ను 7700 మంది అభ్యర్థులు రాయనున్నారు. 
ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటం వల్ల నష్టపోతామని, పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాస రావు తెలిపారు. 1500 మంది అభ్యర్థులు రెండు పరీక్షలనూ రాస్తున్నారని ఆయన తెలిపారు. కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ సీ) పరీక్షను సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట మధ్య నిర్వహించనున్నారు. ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పరీక్షను అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు.