దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 62,907 గ్రూప్-డి
పోస్టుల భర్తీకి సెప్టెంబరు 17న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో
భాగంగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అభ్యర్థులకు 10 రోజుల
ముందునుంచే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ కల్పించనుంది.
అడ్మిట్ కార్డులను సెప్టెంబరు 7 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే అవకాశం
ఉంది. గ్రూప్-డి పోస్టుల భర్తీకి మొదటిసారిగా ఆన్‌లైన్ రాతపరీక్ష
నిర్వహించనున్నారు. రాతపరీక్షలో మొత్తం 100 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు
ఉంటాయి. సమయం 90 నిమిషాలు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా...
* మొదట indianrailways.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* వెబ్‌సైట్‌లో Recruitment ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
రాతపరీక్షలో
ఉత్తీర్ణులైవారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇప్పటికే
గ్రూప్-సి విభాగానికి సంబంధించి 66,502 అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్
పోస్టుల భర్తీకి సంబంధించి తొలిసారిగా ఆన్‌లైన్ రాతపరీక్ష(ఆగస్టు 9)
నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-డి పోస్టుల భర్తీకి కూడా ఆన్‌లైన్
పరీక్షనే నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా...
* మొదట indianrailways.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* వెబ్‌సైట్‌లో Recruitment ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
No comments:
Post a Comment