Monday, 20 August 2018

న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టుల వివ‌రాలు:
కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు
* మొత్తం పోస్టుల సంఖ్య‌: 8,339

పోస్టులుసబ్జెక్టులు
పీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ, హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, ఎక‌నామిక్స్‌, మ‌ర్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌
టీజీటీ హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్‌, పీ &హెచ్ఈ, ఆర్ట్‌& ఎడ్యుకేష‌న్‌,డ‌బ్ల్యూఈటీ.

అర్హత: పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లోమాస్టర్ డిగ్రీ, డిగ్రీ. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రేరి సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రరీ సైన్స్ విభాగంలో ఏడాది డిప్లొమా చేసి ఉండాలి.

గ‌రిష్ఠ వ‌య‌సు:
పోస్టులు వయోపరిమితి (31.08.2018)
ప్రిన్సిప‌ల్ 35 - 50 సంవత్సరాలు
వైస్ ప్రిన్సిప‌ల్ 35 - 45 సంవత్సరాలు
పీజీటీ 40 సంవత్సరాలు
టీజీటీ 35 సంవత్సరాలు
లైబ్రేరియన్ 35 సంవత్సరాలు
ప్రైమరీ టీచర్ 30 సంవత్సరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
పోస్టులు ఖాళీల సంఖ్య
ప్రిన్సిప‌ల్ 76
వైస్-ప్రిన్సిప‌ల్ 220
పీజీటీ 592
టీజీటీ 1,900
ప్రైమ‌రీ టీచ‌ర్లు 5,300
ప్రైమ‌రీ టీచ‌ర్లు (మ్యూజిక్) 201
లైబ్రేరియ‌న్ 50
మొత్తం ఖాళీల సంఖ్య 8,339

No comments:

Post a Comment