Tuesday 14 May 2019

నాబార్డులో 87 ఉద్యోగాలు

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్).. రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ విభాగంలో 87 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Current Affairsపోస్టుల వివరాలు..
  1. అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఏ): 79.అర్హత:పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీ/సీఏ/కాస్ట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ; బీఈ/బీటెక్, బీబీఏ/బీఎంఎస్ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది. 
    వయసు: 2019, మే 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 
  2. మేనేజర్ (గ్రేడ్-బి): 8. అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
    వయసు: 2019, మే 1 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫేజ్-1 (ప్రిలిమినరీ), ఫేజ్-2 (మెయిన్) ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: మే 26, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in

No comments:

Post a Comment