Friday, 24 May 2019

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. 8 నుంచి ఇంటర్ అర్హత ఉంటే చాలు

ఏపీలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. చెన్నైలోని జోన‌ల్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్, గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూల్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఒంగోలులోని పరేడ్ గ్రౌండ్‌లో జులై 5 నుంచి 15 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 

* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

పోస్టుల వివరాలు..

పోస్టులుఅర్హత
సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీపదోతరగతి/ తత్సమాన విద్యార్హత
సోల్జర్ టెక్నిక‌ల్‌ఇంటర్ (ఎంపీసీ)
సోల్జర్ టెక్నిక‌ల్ (ఏవియేష‌న్‌/ అమ్యూనిష‌న్ ఎగ్జామిన‌ర్‌)ఇంటర్ (ఎంపీసీ)
సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌/ న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్నరీఇంటర్ (బైపీసీ)
సోల్జర్ క్లర్క్‌/ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌ఇంటర్ (ఆర్ట్స్, కామర్స్, సైన్స్)
సోల్జర్ ట్రేడ్‌మెన్ప‌దో త‌ర‌గ‌తి
సోల్జర్ ట్రేడ్‌మెన్ఎనిమిదో త‌ర‌గ‌తి

వయోపరిమితి: సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 17.5 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా. 

ముఖ్యమైన తేదీలు.. 
✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2019. 
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.06.2019. 
✦ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 20.06.2019 నుంచి. 
✦ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ: 05.07.2019 - 15.07.2019. 

Notification 

Website 

No comments:

Post a Comment