రైల్వేలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(డీఎంఎస్), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) పోస్టులకు సంబంధించి నిర్వహించనున్న స్టేజ్-1 ఆన్‌లైన్ పరీక్ష హాల్‌టికెట్లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మే 18న విడుదల చేసింది. రీజియన్ల వారీగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. జేఈఈ, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను సమర్పించి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 22 నుంచి స్టేజ్-1 ఆన్‌లైన్ పరీక్షలు (సీబీటీ) నిర్వహించనుంది. అభ్యర్థులకు పరీక్షకు నాలుగురోజుల ముందు మే 18న అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డులో పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, పరీక్ష సమయానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ వెబ్‌సైట్
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసినసంగతి తెలిసిందే. వీటిల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులతోపాటు డిపో మెటీరియల్ సైపరింటెండెంట్, కెమికల్ & మెటర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి జనవరి 2 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశ(స్టేజ్-1) రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారినే రెండో దశ (స్టేజ్-2) పరీక్షలకు ఎంపికచేస్తారు.
ఆర్ఆర్‌బీ జేఈ పరీక్ష షెడ్యూలు, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి

No comments:
Post a Comment