Monday, 27 May 2019

ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు సోమవారం (మే 27) విడుదలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు మే 27న ఫలితాలను వెల్లడించింది. రీవెరిఫికేషన్‌ ఫలితాలతో పాటు.. విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్‌ కాపీలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో ఫెయిలైన మొత్తం 3,82,116 మంది విద్యార్థుల ఫలితాలను ఇంటర్‌ బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. వీటిలో 92,429 జవాబు పత్రాలను అధికారులు రీవెరిఫికేషన్ చేశారు. వీటి ఫలితాలనే బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్‌ నెంబరు నమోదుచేసి స్కానింగ్‌ కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

జూన్ 7 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. 
షెడ్యూలు ప్రకారం జూన్‌ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను కళాశాలల లాగిన్‌లో మే 25 నుంచి అందుబాటులో ఉంచారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ వాటిని డౌన్‌లోడు చేసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ హాల్‌టికెట్లతో జూన్‌ 7 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరుకావాలి. జూన్ 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

No comments:

Post a Comment