Tuesday 14 May 2019

ఇంటర్ ప్రవేశ షెడ్యూలు విడుదల



తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మొదటి విడత ప్రవేశ షెడ్యూలును విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల జూనియర్ కళాశాలల్లో మే 21 నుంచి మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా కళాశాలల్లో జూన్‌ 1 నుంచి తరగతులు ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. జులై 1తో మొదటి విడత ప్రవేశ ప్రక్రియ పూర్తికానుంది. 

ప్రవేశ ప్రక్రియకు సంబంధించి ఇంటర్ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా.. ప్రవేశాల్లో రిజర్వేషన్లను పాటించాలని, ఒక్కో సెక్షన్‌కు 88 మందికి మించి ప్రవేశాలు జరపడానికి వీల్లేదని తెలిపింది. ప్రవేశాలకుగాను కళాశాలల్లో ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని కూడా బోర్డు స్పష్టం చేసింది. పదోతరగతిలో వచ్చిన గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులను బోర్డు ఆదేశించింది. మే 13న తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment