Sunday 28 October 2018

ఏపీలో 7,729 ఉపాధ్యాయ పోస్టులు (చివ‌రితేది: 16.11.18)


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల పోస్టులు మొత్తం కలిపి 7,729 భర్తీ చేయనున్నారు.వివ‌రాలు...పోస్టు-ఖాళీలు: స్కూల్ అసిస్టెంట్ (గ‌ణితం, భౌతిక‌శాస్త్రం, జీవ‌శాస్త్రం, సాంఘిక‌శాస్త్రం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, ఉర్దు, కన్న‌డ‌, త‌మిళం, ఒరియా, సంస్కృతం, వ్యాయామ‌విద్య‌), భాషా పండితులు (తెలుగు, హిందీ, ఉర్దు, ఒరియా, త‌మిళం, సంస్కృతం), ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్ అండ్ డ్రాయింగ్‌, సెకండరీ గ్రేడ్ టీచ‌ర్‌, ప్రిన్సిప‌ల్‌, టీజీటీ, పీజీటీ.అర్హ‌త‌లు: పోస్టుల‌ను బ‌ట్టి ఇంట‌ర్‌, బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ, డీఈడీ/ డీఈఎల్ఈడీ, బీఈడీ/ బీఈఎల్ఈడీ, బీపీఈడీ/ ఎంపీఈడీ, పండిట్ ట్రెయినింగ్, టెట్‌ త‌దిత‌రాల్లో ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 44 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500.ఫీజు చెల్లింపు తేదీలు: 2018 నవంబరు 1 నుంచి 15 వరకు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 01.11.2018.చివ‌రితేది: 16.11.2018. ప‌రీక్షా కేంద్రాలకు ఐచ్ఛికాలు: నవంబరు 19 నుంచి 24 వరకు ఇచ్చుకోవచ్చు.ఆన్‌లైన్‌ పరీక్షాల తేదీలు:స్కూల్ అసిస్టెంట్లు భాషేతర: 2018 డిసెంబరు 6, 10. స్కూల్‌ అసిస్టెంట్లు భాషలు: 2018 డిసెంబరు 11. పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు: 2018 డిసెంబరు 12, 13.ట్రెయినింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపల్‌: 2018 డిసెంబరు 14, 26. పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయిండ్‌: 2018 డిసెంబరు 17. భాషాపండితులు: 2018 డిసెంబరు 27.ఎస్జీటీ: 2018 డిసెంబరు 28 నుంచి 2019 జనవరి 2 వరకు.
 
 

ఐటీబీపీలో 218 కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రితేది: 27.11.18)

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు..* కానిస్టేబుల్ (టెలికామ్‌)మొత్తం పోస్టుల సంఖ్య‌: 218. పురుషుల‌కు 185, మ‌హిళ‌ల‌కు 33 పోస్టులున్నాయి.అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌. ఇండ‌స్ట్రియ‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా లేదా స‌ర్ట‌ఫికెట్ కోర్సు చేసిన‌వారికి ప్రాధాన్యం. నిర్దిష్ట శారీర‌క, వైద్య‌ ప్ర‌మాణాలు ఉండాలి.వ‌యఃప‌రిమితి: 27.11.2018 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత ప‌రీక్ష ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 29.10.2018.చివ‌రితేది: 27.11.2018.
 


Friday 26 October 2018

ఐటీబీపీఎఫ్‌, న్యూదిల్లీలో 20 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు (చివ‌రి తేది: 04.12.18)


న్యూదిల్లీలోని ఇండో - టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్‌) హెడ్‌ కాన్‌స్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు ......

* హెడ్‌ కాన్‌స్టేబుల్ (డ్రెస‌ర్ వెట‌ర్న‌రీ)
మొత్తం ఖాళీలు: 20 (మ‌హిళ‌ల‌కు-03, పురుషుల‌కు
-17)
అర్హ‌త‌, వ‌య‌సు: స‌ంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం
.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.100.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 05.11.2018.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.12.2018.



బ్యాంకుల్లో 1,599 స్పెష‌లిస్ట్ ఆఫీసర్‌ ఉద్యోగాలు (చివ‌రితేది: 26.11.2018)


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది.
విభాగాల వారీ ఖాళీలు(స్కేల్ 1): ఐటీ ఆఫీసర్- 219, అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్- 853, రాజభాష అధికారి- 69, లా ఆఫీసర్- 75, హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్- 81, మార్కెటింగ్‌ ఆఫీసర్- 302.
మొత్తం పోస్టులు: 1,599.
అర్హతలు: పోస్టును బ‌ట్టి సంబంధిత విభాగంలో బ్యాచిల‌ర్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌
.
వ‌య‌సు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
.
ఎంపిక: ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. 100; మిగిలిన అంద‌రికీ రూ
.600.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్ర‌క్రియ తేదీలు: 06.11.2018 నుంచి 26.11.2018 వ‌ర‌కు
.
ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు: డిసెంబ‌రు
29, 30.
మెయిన్స్ ప‌రీక్ష తేదీ:
27.01.2019.
ఇంట‌ర్వ్యూలు: ఫిబ్రవ‌రి, 2019లో ఉంటాయి
.
తుదినియామ‌కాలు: ఏప్రిల్, 2019లో చేప‌డ‌తారు
.
బ్యాంకుల్లో ఉద్యోగాలు: అలహాబాద్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయా బ్యాంక్‌.


Thursday 25 October 2018

సెంట్ర‌ల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు (చివ‌రితేది: 05.11.18)


చెన్నైలోని సెంట్ర‌ల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌.. జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.వివ‌రాలు...* జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ మొత్తం ఖాళీల సంఖ్య‌: 02అర్హ‌త‌: 10+2 ఉత్తీర్ణ‌త‌తో పాటు టైపింగ్ సామ‌ర్థ్యం ఉండాలి.వ‌యసు: 28 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100.చివ‌రితేది: 05.11.2018చిరునామా: Section Officer E.I, CSIR- Central Leather Research Institute, Sardar Patel Road, Adyar, Chennai-600 020 ,Tamil Nadu.
 
 

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌, ఒడిశాలో 107 ట్రెయినీ పోస్టులు (చివ‌రితేది: 24.11.18)

ఎన్‌టీపీసీ లిమిటెడ్(ఈస్ట్ర‌న్ రీజియ‌న్) ప‌రిధిలోని దార్లిప‌ల్లి సూప‌ర్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్(సుంద‌ర్‌గ‌ఢ్ జిల్లా, ఒడిశా)లో ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం పోస్టుల సంఖ్య‌: 107ట్రెయినీ పోస్టు-ఖాళీలు: డిప్లొమా ఇంజినీర్- 55, ఐటీఐ/ ల్యాబ్ అసిస్టెంట్/ అసిస్టెంట్- 52.విభాగాలు: మెకానిక‌ల్‌, ఎలక్ట్రిక‌ల్‌, సీ&, సివిల్‌, ఫిట్ట‌ర్, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌, కెమిస్ట్రీ, మెటీరియ‌ల్స్‌/ స్టోర్‌కీప‌ర్‌.అర్హ‌త‌: స‌ంబంధిత విభాగంలో ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌, ఇంగ్లిష్ టైపింగ్ ప‌రిజ్ఞానం ఉండాలి.వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల ఆధారంగా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 24.11.2018.
 
 


Wednesday 24 October 2018

కెన‌రా బ్యాంకులో 800 పీవో పోస్టులు (చివ‌రి తేదీ: 13.11.2018)

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన కెన‌రా ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. వివిధ ద‌శ‌ల్లో ఎంపికైన అభ్య‌ర్థులు మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌- బెంగ‌ళూరు లేదా ఎన్ఐటీటీఈ ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైవేట్ లిమిటెడ్‌- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్(జేఎంజీఎస్‌-1) హోదాతో కెన‌రా బ్యాంక్‌లోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 800 (జ‌న‌ర‌ల్‌-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ
-60)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు సాధించాలి
.
వ‌య‌సు: 01.10.2018 నాటికి 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.708.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ:
13.11.2018.
ప‌రీక్ష తేదీ:
23.12.2018.
ప‌రీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో.. హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.



Monday 22 October 2018

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌ పరీక్షలు (చివరి తేది: 19.11.18)

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) కింది ప‌రీక్ష‌లకు సంబంధించిన సంక్షిప్త ప్ర‌క‌ట‌న‌ల‌ను జారీ చేసింది.1) జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ ఎగ్జామ్ 2018 పరీక్ష ప్రకటనను కమిషన్ జూన్ 2 జారీ చేసింది. ప్రస్తుతం దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. 2) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి & డి ఎగ్జామ్ 2018 రెండు పరీక్షల దరఖాస్తు దాఖలుకు చివరి తేది: నవంబరు 19.అర్హత, వయసు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలకు ఎస్ఎస్‌సీ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
 


Friday 19 October 2018

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు (చివ‌రి తేది: 10.11.18)


భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.వివరాలు.....* సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2018మొత్తం పోస్టుల సంఖ్య: 1054 (తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో విజయవాడ-20, హైదరాబాద్-36 పోస్టులు ఉన్నాయి).అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకు సంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి.వయసు: 27 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు, మ‌హిళ‌లు ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018
 
 

Monday 15 October 2018

నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019- 2020

జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉ  CBSE  విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది.


▪అర్హత 2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి.
 01-05-2006  మధ్య  30-04-2010 జన్మించి ఉండాలి .

▪ప్రారంభ తేదీ : 01-10-2018
▪చివరి తేదీ : 30 - 11- 2018
▪పరీక్ష తేదీ : 30 - 03 - 2019

▪వెబ్‌సైట్  ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను
https://gg-l.xyz/MOqVb8T

https://gg-l.xyz/Q4AVTm


 ద్వారా పొందవచ్చు .

దరఖాస్తులను ప్రధానోపాధ్యాయుని చే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం  ముందుగానే తెలియపర్చాలి.నింపిన దరఖాస్తును online లేక offline  apply చేసుకోవచ్చు .

Sunday 14 October 2018

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

 తెలంగాణలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు ఆదివారం (అక్టోబరు 14) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 50.09శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఆధారంగా ఫలితాలను చూడవచ్చు. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


http://pcresult.tslprb.in:8092/QualifiedPC2018.pdf

 

యూపీఎస్సీ - కేంద్ర స‌ర్వీసుల్లో 81 పోస్టులు (చివ‌రి తేది: 01.11.18)

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో అసిస్టెంట్ ఇంజినీర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* మొత్తం పోస్టుల సంఖ్య‌: 811) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్‌క్యూఏ) (ఎల‌క్ట్రిక‌ల్‌): 022) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్‌క్యూఏ) (మెకానిక‌ల్‌): 013) డిప్యూటీ ఆర్కిటెక్ట్: 074) ప్రిన్సిప‌ల్ డిజైన్ ఆఫీస‌ర్ (ఎల‌క్ట్రిక‌ల్): 015) రిఫ్రిజిరేష‌న్ ఇంజినీర్‌: 016) డిప్యూటీ డైరెక్ట‌ర్ (సేఫ్టీ) (సివిల్‌): 017) అడిష‌న‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (సేఫ్టీ) (మెకానిక‌ల్‌): 018) డిప్యూటీ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎల‌క్ట్రిక‌ల్): 239) డిప్యూటీ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్‌): 44అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, అనుభ‌వం.ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ద్వారా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.25చివ‌రి తేది: 01.11.2018
 


Saturday 13 October 2018

Group-4 Answer Sheet: వెబ్‌సైట్‌లో గ్రూప్‌-4 పరీక్ష జవాబు పత్రాలు.. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి...

Group-4 Answer Sheet: వెబ్‌సైట్‌లో గ్రూప్‌-4 పరీక్ష జవాబు పత్రాలు.. వెంటనే డౌన్...
ts group-4 omr answer sheets released, download nowతెలంగాణలో 'గ్రూప్‌-4' పరీక్షకు హాజరైన అభ్యర్థుల డిజిటల్ జవాబు పత్రాలను (ఓఎంఆర్) టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఓఎంఆర్ జవాబు పత్రాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైనా.. పత్రాలు సరిగా డౌన్‌లోడ్‌ కాకపోయినా.. వెంటనే కమిషన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. త్వరలోనే అర్హత పొందనివారి ఓఎంఆర్‌ వివరాలు, హాల్‌టికెట్‌ నంబర్లు వెబ్‌సైట్లో పొందుపరచనున్నారు.
OMR Answersheet Download


మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తదనంతరం పరీక్ష ప్రాథమిక కీని కూడా విడుదల చేయనున్నారు.
వెబ్‌సైట్