Friday 22 April 2016

కానిస్టేబుల్‌ అర్హత పరీక్ష రేపే.....

* అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు
* ఎస్ఎంఎస్‌తో పరీక్ష కేంద్రానికి మార్గదర్శనం

ఈనాడు, హైదరాబాద్: ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం(ఏప్రిల్ 24) జరగబోయే కానిస్టేబుల్ పరీక్షకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మందికిపైగా హాజరవుతున్న ఈ పరీక్షలలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 9281 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఈనెల 24న (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1132 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది హాజరవుతున్నారు. గత ఆదివారం అంటే 17వ తేదీ ఎస్సై పరీక్షలకు రాత పరీక్ష నిర్వహించినప్పుడు అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకునే బయోమెట్రిక్ యంత్రాలు కొన్ని చోట్ల మొరాయించాయి. దాంతో పరీక్ష పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులను కేంద్రంలోనే ఉంచి మరీ వేలిముద్రలు తీసుకోవాల్సి వచ్చింది. అలానే కొన్ని పరీక్ష కేంద్రాల చిరునామాల విషయంలోనూ అభ్యర్థులు కొంత సందిగ్ధతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ పరీక్షలకు గంట ముందుగానే వేలిముద్రలు తీసుకోవాలని నిర్ణయించారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య జరుగుతుంది. ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష రాయనివ్వరు. గంట ముందుగానే అభ్యర్థులను అనుమతిస్తారు కాబట్టి అప్పటి నుంని వేలిముద్రలు తీసుకోవడం మొదలుపెడతారు. వేలిముద్రలతోపాటు ఫొటో కూడా తీసుకుంటారు. తదుపరి జరిగే దేహదారుఢ్య, తుది పరీక్షలప్పుడు వీటిని వాడుకుంటారు. ఇక చిరునామా విషయంలో ఎస్సై పరీక్షలప్పుడే 'ఫైండ్‌మీ అనే యాప్‌ను రూపొందించారు. అభ్యర్థి దరఖాస్తు నెంబరు ఆధారంగా ఈ యాప్ వారివారి ఫోన్లలోకి దిగుమతి అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా వారి పరీక్ష కేంద్రం ఎక్కడనేది మ్యాప్‌లో చూపిస్తుంది. దాని ఆధారంగా సదరు అభ్యర్థి వారివారి పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. దీనికి అదనంగా ఇప్పుడు మరికొన్ని ఏర్పాట్లు చేశారు. స్మార్ట్‌ఫోన్ లేని అభ్యర్థులు 9222273310 నెంబరుకు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా హాల్‌టిక్కెట్ నెంబరు ఎస్ఎంఎస్ పంపిస్తే, ఆ అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం చిరునామా వచ్చేస్తుంది. దాంతోపాటు మ్యాప్ ద్వారా దారి చూపడానికి లింక్ కూడా వస్తుంది. అలానే గూగుల్ మ్యాప్‌లలో పరీక్ష కేంద్రం పిన్‌కోడ్ క్రోడీకరించడం ద్వారా కూడా చిరునామా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాచుర్యంలో ఉన్న విద్యాసంస్థల్లోనే ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకొని రావడం మంచిదని పోలీసు నియామక మండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు.

Wednesday 20 April 2016

న్యూమరాలజీని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవడం..............

న్యూమరాలజీ...ఇప్పుడు మంచి ట్రెండింగ్ టాపిక్, పేర్లలో కొన్ని అక్షరాలను తొలగించడమో..లేక కొత్త అక్షరాలను కల్పించడమో జరుగుతుంది.నవగ్రహాలు తొమ్మిది. అలాగే సంఖ్యలు 9. ఈ తొమ్మిదితో మనిషి జీవిత విశేషాలు, వివాహం, వాహనం, ఆరోగ్యమే కాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ గుణిస్తే తొమ్మిదిలోపు రాగలవు. ఉదాహరణ 20ని తీసుకున్నప్పుడు అందులో "0" కి విలువలేదు. అందువల్ల 2 అవుతుంది. 0 కి తదుపరి వచ్చే సంఖ్యలే లెక్కకు వస్తాయి. కనుక ఎన్ని సంఖ్యలు ఉన్నా మొత్తం తొమ్మిదిలోపే వస్తాయి. ఈ శాస్త్రాన్నే న్యూమరాలజీ లేదంటే సంఖ్యా శాస్త్రం అంటారు. పెద్ద సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడినట్లయితే మరలా 9 సంఖ్యలోపు ఏర్పడగదలదు. ఉదా: 10-2-1948 ఉన్నాయనుకోండి. అది 1+0+2+1+9+4+8= 25 అవుతుంది. తిరిగి ఈ రెండు సంఖ్యలను కూడగా 2+5= 7 అవుతుంది. ఇలాగే ఎన్నివేల సంఖ్యలు కూడినా 9లోపే వస్తాయి. ఈ శాస్త్రానికి ముఖ్యంగా 9 గ్రహాలు ఉండటం వల్ల మరియు ఎన్నివేల సంఖ్యలను కూడినా 9 లోపు రావటం వల్ల, ఒక్కొక్క సంఖ్య అమర్చబడింది. అంటే రవికి 1వ సంఖ్య, చంద్రునికి 2వ సంఖ్య, గురువుకు 3వ సంఖ్య, రాహువుకు 4, బుధునికి 5, శుక్రునికి 6, కేతువుకు 7, శనికి 8, కుజునికి 9వ సంఖ్య వచ్చింది. సంఖ్యా శాస్త్రం వీటి ఆధారంగానే ఏర్పడింది. ఈ సంఖ్యా శాస్త్రం ద్వారా మనిషియొక్క భూత, వర్తమాన భవిష్యత్తు కాలమునకు సంబంధించిన గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి ఏ సంఖ్య కలసి వస్తుంది... వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది... ఇత్యాది అంశాలను తేలికగా గ్రహించవచ్చు. ఈ శాస్త్రాన్ని మూడు రకాలుగా విభజించారు. 1. జన్మ తేదీని బట్టి చూచుకొను విధానం: ఈ విధానంలో పుట్టిన సంవత్సరం లేదా నెల కానీ చాలా ముఖ్యం. అంటే 1వ తేదీన జన్మించినవారు 1వ సంఖ్య వారవుతారు. అదేవిధంగా 23వ తేదీన జన్మించినవారు 2+3=5వ సంఖ్యవారవుతారు. 2. జనన తేదీ, నెల, సంవత్సరం: ఈ మూడింటిని కూడగా వచ్చిన సంఖ్యను, మరలా వాటిని కూడగా వచ్చిన సంఖ్యను బట్టి వారు ఏ సంఖ్యవారో చెప్పవచ్చు. ఉదా: 1953-7-1 తేదీన జన్మించారనుకోండి... అప్పుడు 1+9+5+3+7+1= 26 అవుతుంది. వాటిని మళ్లీ కూడగా 2+6= 8 వస్తుంది కనుక వారు 8వ సంఖ్యవారవుతారు. న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. మరి అదేలాగో తెలుసుకుందాం...
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. 
 బర్త్ నంబర్ 1 అయితే పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 2 అయితే వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 3 అయితే వీరు ఎల్లప్పుడూ సాహసాలను చేయాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటారు. ఇతరులను పాజిటివ్ దిశగా నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 4 అయితే వీరిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ దాని గురించి వారికి తెలియదు. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అప్పుడప్పుడు విఫలమవుతుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 5 అయితే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో ఓర్పు నశిస్తుంది. ఓర్పును జయించి కష్టపడితే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 6 అయితే వీరు ఎల్లప్పుడూ తాము చేసే పనిలో కచ్చితత్వం కోరుకుంటారు. ఇది వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. అయితే వీరు ఇతరుల పట్ల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ వారికి సహాయం చేస్తారు. ఇది వారికి మరింత ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టుదలకు పోతుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 7 అయితే వీరు మంచి ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మక మనసు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపూరితంగా ఉంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 8 అయితే వ్యాపారంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. వీరు మంచి పరిపాలన నైపుణ్యాలు కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంతో అది వారి కొంప ముంచే అవకాశం ఉంటుంది.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు. బర్త్ నంబర్ 9 అయితే వీరు సృజనాత్మకమైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇతరులకు వీరు ప్రేరణగా నిలుస్తారు. అయితే సొంత విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపరు.

45 ని.లు ఆగిన గుండె............?

అద్భుతం: 45 ని.లు ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంది, వైద్యుల ఘనత.. 

Miracle survivor at Chennai hospital comes back to life 45 minutes after his heart stops beatingచెన్నై: చెన్నైలో అద్భుతం జరిగింది! ఓ వ్యక్తి గుండె 45 నిమిషాల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. అయినప్పటికి అతను బతికి బట్టకట్టాడు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు జయ్‌సుఖ్‌భాయ్ ఠాకూర్. అతను గుజరాత్‌కు చెందిన వ్యక్తి. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేశారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సలో వైద్యులు విజయం సాధించారు. గుజరాత్‌కు చెందిన జయ్‌సుఖ్‌భాయ్ వయస్సు 38 ఏళ్లు. అతను హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హర్ట్ బీట్ ఆగిపోయింది. 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్య విధానం ద్వారా గుండెను కొట్టుకునేలా చేశారు.
ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో ఆసుపత్రి కార్డియాక్‌ సైన్సెస్‌ సంచాలకులు డా.బాలకృష్ణన్‌ మాట్లాడారు. గుండెపోటు పరిస్థితుల్లో ఈసిపిఆర్ అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్య విధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు. జయ్‌సుఖ్‌భాయ్ విషయంలోనూ ఇదే విధానం అనుసరించామన్నారు. గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామన్నారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పది రోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్నారని, డిశ్చార్జ్ కానున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జయ్‌సుఖ్‌భాయ్ మాట్లాడుతూ... నేను కొత్త జీవితాన్ని పొందానని చెప్పాడు. జయ్‌సుఖ్‌భాయ్ మంగళవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు అతనికి పుష్పగుచ్ఛం ఇచ్చారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..... 22.04.2016


రేపే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు
 హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలను ఈనెల 22వ తేదీన తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి విడుదల చేయనుంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారు. మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలను 9,64,664 మంది రాశారు.

Sunday 17 April 2016

ఇండియన్ ఆర్మీలో 635 హవల్దార్ పోస్టులు....

కేవలం పీజీ/డిగ్రీ, బీఎడ్‌తో ఆర్మీ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- ఆకర్షణీయమైన జీతభత్యాలు
Indianarmy ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: దేశ రక్షణలో ఆర్మీ పాత్ర కీలకమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ సరిహద్దుల్లో సైన్యం రక్షణ బాధ్యతలను చూస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 635
పోస్టులు - హవల్దార్ ఎడ్యుకేషన్ (ఆర్మీలోని ఎడ్యుకేషన్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి) సైన్స్, ఆర్ట్స్ స్ట్రీమ్‌లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే.
సైన్స్ స్ట్రీమ్ - 397 ఖాళీలు
ఆర్ట్స్ స్ట్రీమ్ - 238 ఖాళీలు
వయస్సు: 2016, అక్టోబర్ 1 నాటికి 20 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1991, అక్టోబర్ 1 నుంచి 1996, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కింది సబ్జెక్టుల్లో పీజీ/డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీల్లో వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
సైన్స్ స్ట్రీమ్: ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఎంసీఏ, బీసీఏ, ఎంటెక్, బీటెక్ లేదా బీఎస్సీ (ఐటీ)లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
ఆర్ట్స్ స్ట్రీమ్: ఎంఏ/బీఏలో ఇంగ్లిష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, ఉర్దూ లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, సోషియాలజీ చదివి ఉండాలి.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్: అభ్యర్థులకు మొదట స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఇది రిక్రూటింగ్ ఆఫీసర్స్ నిర్ణయం ప్రకారం ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: ఎత్తు - 162 సెం.మీ., ఛాతీ - 77 సెం.మీ, బరువు - 52 కేజీలు ఉండాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 6 నిమిషాల 20 సెకన్లలో 1.6 కి.మీ. దూరాన్ని పరిగెత్తాలి.
కనీసం 6 పుల్ అప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్స్‌లో క్వాలిఫై, 9 అడుగుల డిచ్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
మెడికల్ స్టాండర్డ్స్ : నిర్ణీత శారీరక ప్రమాణాలతో పాటు మంచి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
రాతపరీక్ష: స్క్రీనింగ్, మెడికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్షతేదీ: జూలై 31 రాతపరీక్ష 2గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ - I అందరికి ఒకేవిధంగా ఉంటుంది. పార్ట్ - II సైన్స్ స్ట్రీమ్, ఆర్ట్స్ స్ట్రీమ్‌లకు వేర్వేరుగా ఉంటుంది.
పార్ట్ -II పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 20 మార్కులు తప్పనిసరిగా రావాలి.
జవాబులను ఓఎంఆర్ షీట్‌లో గుర్తించాల్సి ఉంటుంది.
టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్: రాతపరీక్షలో అర్హత సాధించినవారి మెరిట్‌లిస్ట్ ప్రకారం టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
రాతపరీక్ష, టీచింగ్ ఆప్టిట్యూడ్/ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారి మెరిట్ ఆధారంగా ఆర్మీ ఎడ్యుకేషనల్ క్రాప్‌లోకి ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు సుమారు ఏడాదిపాటు మిలిటరీ, టెక్నికల్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.
పే అండ్ అలవెన్స్‌లు:
గ్రూప్ ఎక్స్: పీజీ/డిగ్రీ విత్ బీఎడ్ అభ్యర్థులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800 + మిలిటరీ సర్వీస్ పే రూ. 2,000 + గ్రూప్ ఎక్స్ పే రూ. 1,400/-
గ్రూప్ వై: కేవలం డిగ్రీ మాత్రమే కలిగిన అభ్యర్థులకు (బీఈడీ లేని వారికి)
రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800 + మిలిటరీ సర్వీస్ పే రూ. 2,000/- ఇస్తారు.
d వీటికి అదనంగా రెగ్యులర్ ఆర్మీ అభ్యర్థులకు ఇచ్చే అన్ని రకాల అలవెన్స్‌లను, వసతులను కల్పిస్తారు. పదోన్నతులు ఉంటాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 15
వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in

ఐఫోన్‌ తయారీలో................ . బంగారం

ఐఫోన్‌ తయారీలో బంగారాన్ని వాడుతున్న యాపిల్ సంస్థ..

స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో టాప్‌లో ఉన్న యాపిల్ సంస్థ బంగారంతో ఐఫోన్లను తయారు చేస్తుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఎలాగో తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ చదవండి. యాపిల్ ఐఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ల తయారీలో బంగారాన్ని వాడుతాన్నారు. ప్రతీ ఐఫోన్ తయారీలో దాదాపు 30 మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తున్నారు. 
 
అసలే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే, యాపిల్ సంస్థ బంగారం ఉపయోగించడం వినియోగదారులకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఫోన్ మీ చేతిలో ఉంటే ఇక పై మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఐ ఫోన్ కొంటె సరి. అయితే ఐఫోన్లు వాడుతున్న చాలామందికి కూడా ఫోన్‌లో బంగారం ఉంటుందని తెలీదు.
 
ఇకపోతే యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులని రీసైక్లింగ్ చేస్తుందట. గతేడాది టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని ఐ ఫోన్, ఐమాక్, ఐపాడ్ల నుండి సేకరించామని ఈ కంపెనీ తెలిపింది. పాత ఐఫోన్ల నుంచి తీసుకున్న అతి ముఖ్యమైన పదార్థాల్లో బంగారం ఒకటని యాపిల్ సంస్థ వెల్లడించింది. దీనితోపాటుగా అల్యూమినియం, ప్లాస్టిక్,  ఉక్కును, సిల్వర్‌ని కూడా రాబట్టుకున్నామని సంస్థ అధికారులు వెల్లడించారు. 
 
ఇదేవిధంగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కు, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియం, 3 మిలియన్ పౌండ్ల కాపర్, 6,600 పౌండ్ల సిల్వర్‌ను రీసైక్లింగ్ ద్వారా రాబట్టుకున్నట్లు యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల(టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో పేర్కొనబడింది. దీని విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా వేయబడుతుంది.
 
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో బంగారానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలు బంగారం ఉపయోగించడానికి ఒక ముఖ్యకారణం ఉంది. ఏంటంటే ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు, అద్భుతమైన విద్యుత్ వాహకంలా పనిచేసేందుకు బంగారం ఉపయోగపడుతుంది. వెండి, రాగిలను కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో విరివిగా వాడుతుంటారు. అయితే అవి త్వరగా తుప్పుపట్టి, పాడయ్యే అవకాశం అధికంగా ఉండటంతోపాటు ముఖ్యమైన సమయంలో ఎలక్ట్రాన్ల ప్రయాణం నెమ్మదించడం వంటి లోపాలు ఉండటంతో వీటిని గాడ్జెట్ల తయారీ తక్కువగా వినియోగిస్తున్నారు.

 

Saturday 16 April 2016

ఇంటర్నెట్‌లో .................కేవలం ఒక్క నిమిషం

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?


ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..? 
 
 

  • ఫేస్‌బుక్‌ ఫేస్‌బుక్‌లో నిమిషానికి 701,389 లాగిన్స్ జరుగుతున్నాయి.

  • ఫేస్‌బుక్‌ ఫేస్‌బుక్‌లో నిమిషానికి 701,389 లాగిన్స్ జరుగుతున్నాయి.
  •  
  • గూగుల్ గూగుల్ సెర్చ్‌లో నిమిషానికి 2.4 మిలియన్ సెర్చ్ క్వైరీలు జరుగుతున్నాయి.
  •  

  • యూట్యూబ్‌ యూట్యూబ్‌లో నిమిషానికి 2.78 మిలియన్ వీడియోస్ చూస్తున్నారు.
  •  

  • ఈమెయిల్స్ ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 150 మిలియన్ ఈమెయిల్స్ పంపబడుతున్నాయి.
  •  
  • ఉబెర్‌ క్యాబ్ హెయిలింగ్ సర్వీస్ ఉబెర్‌లో నిమిషానికి 1389 రైడ్స్ నమోదువుతున్నాయి.

  • Snapchat ఫోటో షేరింగ్ సైట్ Snapchatలో నిమిషానికి 5,27,760 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి
  •  
  • యాపిల్ యాప్ స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి నిమిషానికి 51,000 యాప్స్ డౌన్‌లోడ్ కాబడుతున్నాయి.
  •  
  • అమెజాన్‌ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో నిమిషానికి 203,596 డాలర్ల సేల్ జరుగుతోంది.
  •  
  • LinkedIn ప్రముఖ జాబ్ వెబ్‌సైట్ LinkedInలో నిమిషానికి 120 పై చిలుకు అకౌంట్‌లు కొత్తగా యాడ్ అవుతున్నాయి.
  •  
  • ట్విట్టర్‌ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో నిమిషానికి 347,222 ట్వీట్లు పంపబడుతున్నాయి.
  •  
  • Instagram ఫోటో బేసిడ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ Instagramలో నిమిషానికి 34,194 కొత్త పోస్ట్‌లు జనరేట్ అవుతున్నాయి.

Monday 11 April 2016

ఆడపిల్లలు జీన్స్ వేసుకోద్దు.................!


భాగ్‌పట్(యూపీ) : ఆడపిల్లలు జీన్స్ వేసుకోద్దు, బిగుతైన దుస్తులు కూడా ధరించ వద్దని యూపీలోని బావ్లీ గ్రామపంచాయతీ తీర్మానించింది. తమ మాట కాదంటే ఆ కుటుంబాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాదు మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రకటించింది. వరకట్నం తీసుకోం, ఇవ్వం అని గ్రామంలో ఉన్నవారంతా ప్రతిజ్ఞ చేయాలని పంచాయతీ కోరింది. పెండ్లిళ్ల సందర్భంగా డీజే సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని, ఆడశిశువని చెప్పి గర్భస్రావాలు చేయించరాదని తేల్చిచెప్పింది. ఎవరైనా చనిపోయినపుడు పెద్దకర్మ సందర్భంగా నిర్వహించే తేర్వీ ఉత్సవానికి హాజరై భోజనాలు చేయవద్దని కూడా సూచించింది. ఈ నిర్ణయాలను పాటించని వారిని గ్రామం నుంచి వెలివేస్తామని స్పష్టంచేసింది. బావ్లీ గ్రామపంచాయతీ పెద్దగా ఉన్న మహిళ భర్త ఓంవీర్ ఈ వివరాలు మీడియాతో చెప్పారు.

Saturday 9 April 2016

శ్రీ బాలాజీకి ముస్లింలు ప్రార్థనలు.....

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం ముస్లింలు కడపలోని పాతబస్తీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి (బాలాజీకి) పూజలు చేశారు. పూజలు చేయడానికి ముస్లింలు బారులు తీరారు. వారిలో బుర్ఖా ధరించిన ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్దయెత్తున క్యూ కట్టారు. క్యూలో నిలుచున్న ప్రతి నలుగురిలో ఓ ముస్లిం ఉండడం విశేషం. ఆ దేవాలయాన్ని దేవుని కడప అని ప్రజలు పిలుచుకుంటారు. దైవానికి అర్పించడానికి ముస్లింలు పుష్పాలు, బెల్లం, చెరుకు గడలలు, చింతపండు, వేప పండ్లు తెచ్చారు. మండుటెండలోనూ భక్తులు క్యూలో వేచి ఉన్నారు.

  • ఏటా వస్తారు... దేవుని కడపకు ఉగాది పర్వదినం సందర్భంగా రాయలసీమ అంతటి నుంచి ముస్లింలు తరలి వస్తుంటారు. పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు.
  • శతాబ్దాల సంప్రదాయం దేవుని కడపను ముస్లింలు దర్శించుకోవడం శతాబ్దాలుగా ఓ సంప్రదాయంగా వస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు భక్తిప్రపత్తులతో కొలుస్తారు.
  • ఆహ్వానించదగ్గ పరిణామం.. దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతోందనే విమర్సలు వస్తున్న నేపథ్యంలో దేవుని కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
  • పెద్ద దర్గా కూడా... కడపలో పెద్ద దర్గా కూడా ఉంది. ఆ దర్గా సందర్శన కోసం అన్ని మతాలకు చెందినవారు పెద్ద యెత్తున వస్తుంటారు.
  • బీబీ నాంచారమ్మ ఉగాది నాడు ఉదయం ఆరు గంటల నుంచే ముస్లింలు బారులు తీరి శ్రీ వెంకటేశ్వర స్వామిని బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
  • ఈ ఏడాది ఎక్కువగా.. దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈసారి ఎక్కువ మంది ముస్లింలు వచ్చినట్లు చెబుతున్నారు.
  • ఈ ఏడాది ఎక్కువగా.. దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈసారి ఎక్కువ మంది ముస్లింలు వచ్చినట్లు చెబుతున్నారు.
  • ముస్లిం భక్తులకు హారతులు... ఆలయ అర్చకులు ముస్లిం భక్తులకు హారతులు, ఇచ్చి వారిని దీవించారు. దేవుని కడప దైవాన్ని దర్శించుకున్నవారిలో ఈసారి ముస్లిం భక్తులే ముందున్నారు.


Thursday 7 April 2016

తెలుగు సంవత్సరాలు 60......!

తెలుగు సంవ‌త్స‌రాల వెనుక ఓ కథ ఉంది. నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన సంతానంతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.



Ugadi 2016


 

















తెలుగు సంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిథులు...
 
మన తెలుగు సంవత్సరాల పేర్లు : 
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
 
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది.... ఆయనములు 2: అవి...
ఉత్తరాయణం :
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించువరకు గల కాలము 6 నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంత భాగం, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉంటుంది. 
 
దక్షిణాయణం :
కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6 నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగం
 
సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది... అందుకే ఋతువులు ఆరు... 
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర
 
సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది... అందుకే
మాసాలు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
 
పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.
అవి...పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
 
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి.
 
ఇప్పుడు మనం పాటించే అర్థంపర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. అదే ఉగాది అయింది.

దుర్ముఖి నామ సంవత్సరం రాశిఫలాలు.....

రాశి ఫలాలు తెలుసుకునే ముందు కొన్ని తెలుగసకోవాలి. రాశి ఫలాలో చెప్పే విషయాలు తమ జాతకంతోనే సరి చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి రాశి ఫలాలో వివాహం ఈసంవత్సరం జరుగుతుంది అనుకుంటే. ఆవ్యక్తి జాతకంలో వివాహానుకూలత 75శాతం ఉండాలి. ప్రతికలాంశ, వివాహభావానికి మాంగల్య దోషం, కుజదషం లేకుండా ఉండటం వంటివి అవసరం. ఇలాంటి కొన్ని ఆటంకాల వల్ల జరగక పోవచ్చు. మరికొన్ని తప్పకుండా జరుగుతాయి.......



మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము) ఆదాయం -14, వ్యయం-14. రాజ్యపూజ్యం-3,అవమానం -6. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- ఆగస్టువరకు బాగుంటుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆగస్టు తర్వాత కొంత నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- అనుకూలంగా లేదు. ఉద్యోగాలు తక్కువస్థాయివి పొందుతారు. కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు తక్కువ. వివాహంకానివారికి - ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ప్రమోషన్స్‌ జరుగవు. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. పైవారి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకి - నూతన వ్యాపారులకి కొంత సమస్య కాలం. మొత్తానికి మిశ్రమ ఫలితం. గురుని 2016 ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభము కలుగుతుంది, కొత్తస్నేహితులను కలుసుకుంటారు, వ్యవహారం లేదా చేసే పనులలో అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, రాజానుగ్రహము పెద్దల అనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన అష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును. ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన భాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.

వృషభ రాశివారు (కృత్తిక2,3,4 పాదాలూ, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు) ఆదాయం -8, వ్యయం-8. రాజ్యపూజ్యం -6,అవమానం -6. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- ఆశించిన ఫలితాలు ఉండవు. పోటి పరీక్షలు వ్రాసేవారికి నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- మంచి ఫలితం పొందుతారు. పైవారి ఆధరణ పొందుతారు. వివాహం కానివారికి - ఈసారి వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ప్రమోషన్స్‌ లభిస్తాయి. కుటుంబానికి దూరంగా గడుపుతారు. వ్యాపారులకి- అన్ని విధాలుగా బాగుంటుంది. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన అష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది. గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టి మాత్రమే ధరించాలి)కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శ��ఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు, ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)


మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు) ఆదాయం - 11, వ్యయం-5. రాజ్యపూజ్యం-2,అవమానం -2. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి- అన్ని విధాలుగా బాగుటుంది. నిరుద్యోగులకి- మంచి ఫలితాలు పొందుతారు. వివాహంకానివారికి - ఈ సంవత్సరం వివాహం అవుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌ కుటుంబజీవనం బాగుంటుంది. వ్యాపారులకి-మంచి లాభాలు పొందుతారు. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళనకలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థితి ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును.శని 2017జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. గ్రహాల పరిహారాలు గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)


కర్కాటక రాశివారు (పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు) ఆదాయం -5, వ్యయం-5. రాజ్యపూజ్యం-5, అవమానం -2. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-మంచిమార్కులు పొంది ఉత్తీర్ణులు అవుతారు. పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. నిరుద్యోగులకి-మంచి ఉద్యోగాలు పొందుతారు. వివాహంకానివారికి -తప్పకుండా వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌ పొందుతారు. వ్యాపారులకి- కిందటి సంవత్సరంకంటే బాగుంటుంది. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా తీవ్ర వ్యతిరేక ఫలదములు పొందుతారు. అనారోగ్యం కలుగుతుంది, వివాదములు ఏర్పడుతాయి, ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుట జరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు (న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు (కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన గోచార కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసము, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును. గ్రహాల పరిహారాలు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)



సింహం రాశివారు (మఖ 4పాదాలూ, పుబ్బ 4 పాదాలూ, ఉత్తర 1 వపాదం) ఆదాయం - 8, వ్యయం -14. రాజ్యపూజ్యం - 1,అవమానం -5.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-నిరాశ మిగులుతుంది. పోటి పరీక్షలలో కోరుకున్న సీట్లు పొందలేరు. నిరుద్యోగులకి-అంతగా అనుకూలంగా లేదు. వివాహంకానివారికి -ఆగస్టుతర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి-పని ఒత్తిడి, దూరప్రాంతాల బదిలి, అపనింద పొందుతారు. వ్యాపారులకి- నిరాశజనకంగా ఉన్నా కొద్దిపాటి లాభాలు పొందుతారు. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా వ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా శుభఫలస్థానం ఫలితాలు వర్తిస్తాయి. ధన లాభము కలుగుతుంది, సంసారంలో సుఖము పొందుతారు, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులో ఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి, శత్రువులు తగ్గుతారు, అధికారం పెరుగుతుంది, ప్రమోషన్లు పొందటానికి అవకాశం వుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరవము వస్తుంది. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుట జరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు (న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు (కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా ఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును. గ్రహాల పరిహారాలు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) 


కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు) ఆదాయం -11, వ్యయం -5. రాజ్య పూజ్యం -4, అవమానం -5. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-గురుబలం బాగాలేదు. సమయం నిరుపయోగం చేస్తారు. దాని ఫలితంగా నష్టపోతారు. నిరుద్యోగులకి-ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది కాని అంత బాగుండదు. వివాహంకానివారికి -ఆగస్టు తర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి-సాధారణ జీవనం. ఉద్యోగమార్పిడికి అవకాశం ఉంది. వ్యాపారులకి-లోహసంబంధం మొదలైన వారికి కొంత అనుకూలత. ఇతరులకు మామూలుగా ఉంటుంది. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా ఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగావ్యతిరేఖ ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధము ఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు, అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలన శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనఅర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మనఃక్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటు నుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నష్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు, శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా 12వ స్థానం చలనం అశుభ ఫలితము ఇచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. గ్రహాల పరిహారాలు గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) రాహు గ్రహానికి పరిహారాలు - అనేకరూప వర్ణైశ్చ శతశః అథసహస్రశః | ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః|| ఈశ్లోకాన్ని జపించాలి.దానాలు - ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు పూజలు, దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు-గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)



తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు) ఆదాయం -8, వ్యయం -8. రాజ్య పూజ్యం - 7, అవమానం -1. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అన్ని విధాల అనుకూలత. నిరుద్యోగులకి-కోరుకున్న ఉద్యోగం పొందుతారు. వివాహంకానివారికి -తప్పక వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-ప్రమోషన్స్‌, విహారయాత్రలు లభిస్తాయి. వ్యాపారులకి- కొంత నష్టం పొందుతారు. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగాఉన్నచోటు నుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దుఃఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్తినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును. గ్రహాల పరిహారాలు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వుల నూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు-రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)


వృశ్చిక రాశివారు (విశాఖ 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు) ఆదాయం -14, వ్యయం -14. రాజ్య పూజ్యం -3, అవమానం -1
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకి- ఉద్యోగం లభిస్తుంది. వివాహంకానివారికి - ఆగస్టు తర్వాత వివాహం జరుగుతుంది. ఉద్యోగులకి-పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో చిక్కులు వస్తాయి. వ్యాపారులకి-నష్టాలు ఎక్కువ. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలుచేస్తారు.గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలము ఏర్పడుతుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది, గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, నూతన ఉద్యోగ వ్యాపారములు ప్రాప్తించును. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. గ్రహాల పరిహారాలు గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)శని 2017 జనవరి 26వరకు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమ శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)


ధను రాశివారు (మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 వపాదం) ఆదాయం -2, వ్యయం -8. రాజ్య పూజ్యం-6, అవమానం -1.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అన్నివిధాలుగా బాగుంది. చెడు సహవాసాలు తగ్గించుకోవాలి. నిరుద్యోగులకి-ఏదో ఒక ఉద్యోగం పొందుతారు. వివాహంకానివారికి -వివాహం అవుతుంది. ఉద్యోగులకి- పనిఒత్తిడి, అపనింద ప్రమోషన్స్‌ లాంటి మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకి-అనుకూల కాలం. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా దోష ఫల స్థానము. వస్తువులు, ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయి, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలు చేస్తారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనశని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన ఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సు తగ్గటం, భయం, రోగంకలుగుతాయి, దుఃఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధ కలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా తృతీయ స్థానములో శుభ ఫలదాతలు, కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగటం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషము కల్పిస్తాడు. గ్రహాల పరిహారాలు శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)



మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు) ఆదాయం -5, వ్యయం -2. రాజ్యపూజ్యం-4,అవమానం -4. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అనుకూలంగా లేదు. నిరాశ మిగులుతుంది. నిరుద్యోగులకి- ఆగస్టు తర్వాత బాగుంటుంది. వివాహంకానివారికి -సెప్టెంబరు తర్వాత వివాహం అవుతుంది. ఉద్యోగులకి- ఆగస్టు వరకు బాగుంటుంది. వ్యాపారులకి- అన్నివిధాల లాభదాయకం. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా మిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు, అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, కొత్తవస్తువులు పొందుతారు, ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును, ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనశని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మనఃక్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దుఃఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును.రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసం, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును. గ్రహాల పరిహారాలు గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)శని 2017 జనవరి 26వ తర్వాత శని గ్రహానికి పరిహారాలు - సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -వాడుకున్నవస్త్రాల్లో చినిగిపోని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు.అవిటివారు, రోగులకు మందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్నిరుద్ది తర్వాత స్నానంచేయడం. పూజలు - రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారంవ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలుచదవటం. రత్నాలు- నీలం(దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)



కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) ఆదాయం -5, వ్యయం -2. రాజ్య పూజ్యం -5, అవమానం -4.
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-ఆగస్టు వరకు బాగుంటుంది. నిరుద్యోగులకి-ఆగస్టు లోపే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాలి. వివాహంకానివారికి - అవుతుంది. ఉద్యోగులకి-సెప్టెంబరరు తర్వాత కొంత ప్రతికూలత వస్తుంది. వ్యాపారులకి-ఆగస్టు తర్వాత కొంత రాబడి తగ్గుతుంది. గురుని 2016ఆగస్ట్‌ 11వరకు సింహంలో సంచార ఫలంగా శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును.గురుడి 2016ఆగస్ట్‌ 12తర్వాత కన్యలో సంచార ఫలంగా వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత, ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి.శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనదశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, గౌరవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కాలుగును. రాహువు సంవత్సరాంతం వరకుసింహరాశి సంచారం వలన ఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును.కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. గ్రహాల పరిహారాలు గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత గురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండ ివంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)



మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు) ఆదాయం -2, వ్యయం -8. రాజ్య పూజ్యం -1, అవమానం -7. 
మొత్తానికి ఈసంవత్సరంలో విద్యార్థులకి-అనుకూల కాలం. నిరుద్యోగులకి-మంచి కాలం. వివాహంకానివారికి -జరుగుతుంది. ఉద్యోగులకి-శ్రమకు తగిన ఫలితం వస్తుంది. వ్యాపారులకి - చాలా లాభదాయక కాలం. గురుని 2016ఆగస్ట్‌ 11 వరకు సింహంలో సంచార ఫలంగా షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు. గురుడి 2016ఆగస్ట్‌ 12 తర్వాత కన్యలో సంచార ఫలంగా శుభఫలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం, సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను, గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును. శని 2017 జనవరి 26వరకు వృశ్చిక సంచారం వలనభాగ్య స్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దుఃఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు, వ్యాధి, దారిద్య్రత, పితృ వర్గమునకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్ప సుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును., ఆతర్వాత సంవత్సరాంతం వరకు ధనూ సంచారం వలన దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దుఃఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును. రాహువు సంవత్సరాంతం వరకు సింహరాశి సంచారం వలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు. కేతువు సంవత్సరమంతా వరకూ కుంభ రాశి సంచారం ఫలితంగా అశుభ ఫలితములిచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. గ్రహాల పరిహారాలు గురుని 2016ఆగస్ట్‌ 11 వరకుగురు గ్రహానికి పరిహారాలు - దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః |, అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః. ఈశ్లోకాన్ని జపించాలి దానాలు -పుస్తకాలు,బంగారు వస్తువులు, తీపి పిండి వంటలు, పట్టు బట్టలు. పండ్లు. పూజలు. హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం. రత్నాలు- పుష్యరాగం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్ని బట్టి మాత్రమే ధరించాలి) కేతు గ్రహానికి పరిహారాలు - మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః| అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ || ఈశ్లోకాన్ని జపించాలి దానాలు- ఉలవలు, మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు,ఆహారం, పూజలు, దుర్గారాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తర శతనామాలు చదవటం రత్నాలు- వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

***** Happy Ugadi *******

















Tuesday 5 April 2016

వడదెబ్బ గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు.....

సమ్మర్ వచ్చిందంటే.. అందరికీ హడలే. ఎండాకాలం అంటే బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా చాలా హాట్ గా ఉంటుంది. చెమట, ఉక్కపోత కారణంగా.. ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా... ఒంట్లో వేడిగానే ఉంటుంది. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి హాట్ వెదర్ ని ఫేస్ చేయడం ప్రతి ఒక్కరికీ ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే.. సన్ స్ట్రోక్ బెంబేలెత్తిస్తుంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో.. చాలామంది వడదెబ్బ బారిన పడుతుంటారు. ఈ వడదెబ్బనే హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అని పిలుస్తారు. కొంతమంది వడదెబ్బ ధాటికి ప్రాణాలే కోల్పోతుంటారు. తీవ్రస్థాయిలో ఉండే ఎండలకు వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ తగలకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వడదెబ్బ లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎండవేడిమి, వడదెబ్బ తట్టకోవడానికి టాప్ 12 సమ్మర్ డ్రింక్స్ సమ్మర్ సీజన్ లో ముఖ్యంగా.. శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ పడిపోకుండా.. జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోతే.. శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. బయట ఎక్కువగా తిరగడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ లోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక మే వచ్చిందంటే.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలి. వడదెబ్బని చాలా తీవ్రంగా పరిగణించాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీలు ఉండాలి.. కానీ.. 40 డిగ్రీలకంటే మించకూడదు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఉందంటే.. శరీరంలో ముఖ్యమైన అవయవాలపై దుష్ర్పభావం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బ నివారించే హోం రెమిడీస్ తెలుసుకుందాం..
తలనొప్పి:  శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గడం లేదా తీవ్రంగా డీహైడ్రేషన్ అయినప్పుడు.. వడదెబ్బ తగులుతుంది. అలాంటప్పుడు ముందుగా కనిపించే లక్షణం తలనొప్పి. తీవ్రమైన తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు.

బ్రీతింగ్: వడదెబ్బ తగిలినప్పుడు శ్వాస వేగంగా ఉంటుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది.
చర్మ సమస్యలు:  ఎండల కారణంగా, వడదెబ్బ తగిలినప్పుడు చర్మ సమస్యలు కనిపిస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చెమట: ఎక్కువగా చెమట పట్టడం, అంటే సాధారణంగా కంటే.. తీవ్రంగా చెమట పట్టడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు.. వడదెబ్బకు సంకేతంగా గుర్తించాలి.

బయటకు వెళ్లేముందు ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా.. ఎక్కువ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే ముందు నిమ్మరసం తాగడం ఉత్తమం. లేదా ఒక టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా 200 ఎమ్ఎల్ నీటిలో కలుపుకుని తాగడం మంచిది.
ఆనియన్ జ్యూస్ వడదెబ్బ నివారించడానికి ఆనియన్ జ్యూస్ చక్కటి హోం రెమిడీ. అనేక అధ్యయనాలు, నిపుణులు సన్ స్ట్రోక్ కి చక్కటి పరిష్కారంగా దీన్నే సూచిస్తారు. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు ఆనియన్ జ్యూస్ ని చెవుల వెనక భాగం, చెస్ట్ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే సలాడ్స్, చట్నీలలో ఉల్లిపాయలు కలుపుకుని తీసుకోవడం మంచిది.
చింతపండు రసం చింతపండులో విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వేడినీటిలో చింతపండు నానబెట్టాలి. తర్వాత ఆ నీటిలో పంచదార కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.
ఆమ్ పన్నా ఆమ్ పన్నా.. అనేది మార్కెట్ లో దొరుకుతుంది. దీన్ని మామిడికాయలతో చేస్తారు. ఇందులో జీరా, మిరియాలు వంటి శరీరాన్ని కూల్ చేసే గుణాలున్న మూలికలు ఉంటాయి. కాబట్టి వడదెబ్బ తగిలిన వాళ్లు ఆమ్ పన్నా తీసుకోవడం వల్ల త్వరిత ఉపశమనం కలుగుతుంది.
మజ్జిగ మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. కాబట్టి వడదెబ్బ తగిలినప్పుడు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినీళ్లు మంచినీళ్లు ఎక్కువగా తాగలేనప్పుడు కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి.. ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది.
కొత్తిమీర లేదా పుదినా జ్యూస్ కొత్తిమీరతో గానీ, పుదీన ఆకులతో గానీ జ్యూస్ తయారు చేసుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగడం వల్ల సన్ స్ట్రోక్ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ సింపుల్ హోం రెమిడీ బాడీలో హీట్ ని తగ్గిస్తుంది. ఒకవేళ శరీరంపై దురద వస్తుంటే.. కొత్తిమీర జ్యూస్ అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది
తులసి విత్తనాలు తులసి విత్తనాలను రోజ్ వాటర్ లో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
సోపు సోపు గింజలు శరీరంలో టెంపరేచర్ ని వేగంగా తగ్గిస్తాయి. ఇవి శరీరాన్ని కూల్ చేస్తాయి. కాబట్టి గుప్పెడు సోపు గింజలు తీసుకుని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఫలితం ఉంటుంది.

వెనిగర్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా, చల్లటి నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ మిక్స్ చేసి, తేనె కలుపుకుని తాగడం వల్ల.. శరీరం కోల్పోయిన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ని అందిస్తుంది.
అలోవెరా జ్యూస్ అలోవెరాలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల వడదెబ్బ నివారించడం తేలికవుతుందని నిపుణులు చెబుతున్నారు.