Sunday 17 April 2016

ఐఫోన్‌ తయారీలో................ . బంగారం

ఐఫోన్‌ తయారీలో బంగారాన్ని వాడుతున్న యాపిల్ సంస్థ..

స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో టాప్‌లో ఉన్న యాపిల్ సంస్థ బంగారంతో ఐఫోన్లను తయారు చేస్తుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఎలాగో తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ చదవండి. యాపిల్ ఐఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ల తయారీలో బంగారాన్ని వాడుతాన్నారు. ప్రతీ ఐఫోన్ తయారీలో దాదాపు 30 మిల్లీగ్రాముల బంగారం ఉపయోగిస్తున్నారు. 
 
అసలే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే, యాపిల్ సంస్థ బంగారం ఉపయోగించడం వినియోగదారులకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఫోన్ మీ చేతిలో ఉంటే ఇక పై మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఐ ఫోన్ కొంటె సరి. అయితే ఐఫోన్లు వాడుతున్న చాలామందికి కూడా ఫోన్‌లో బంగారం ఉంటుందని తెలీదు.
 
ఇకపోతే యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులని రీసైక్లింగ్ చేస్తుందట. గతేడాది టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని ఐ ఫోన్, ఐమాక్, ఐపాడ్ల నుండి సేకరించామని ఈ కంపెనీ తెలిపింది. పాత ఐఫోన్ల నుంచి తీసుకున్న అతి ముఖ్యమైన పదార్థాల్లో బంగారం ఒకటని యాపిల్ సంస్థ వెల్లడించింది. దీనితోపాటుగా అల్యూమినియం, ప్లాస్టిక్,  ఉక్కును, సిల్వర్‌ని కూడా రాబట్టుకున్నామని సంస్థ అధికారులు వెల్లడించారు. 
 
ఇదేవిధంగా 23 మిలియన్ పౌండ్ల ఉక్కు, 13 మిలియన్ పౌండ్ల ప్లాస్టిక్, 12 మిలియన్ పౌండ్ల గ్లాస్, 4.5 మిలియన్ పౌండ్ల అల్యూమినియం, 3 మిలియన్ పౌండ్ల కాపర్, 6,600 పౌండ్ల సిల్వర్‌ను రీసైక్లింగ్ ద్వారా రాబట్టుకున్నట్లు యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల(టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో పేర్కొనబడింది. దీని విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని కంపెనీ అంచనా వేయబడుతుంది.
 
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో బంగారానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలు బంగారం ఉపయోగించడానికి ఒక ముఖ్యకారణం ఉంది. ఏంటంటే ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు, అద్భుతమైన విద్యుత్ వాహకంలా పనిచేసేందుకు బంగారం ఉపయోగపడుతుంది. వెండి, రాగిలను కూడా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో విరివిగా వాడుతుంటారు. అయితే అవి త్వరగా తుప్పుపట్టి, పాడయ్యే అవకాశం అధికంగా ఉండటంతోపాటు ముఖ్యమైన సమయంలో ఎలక్ట్రాన్ల ప్రయాణం నెమ్మదించడం వంటి లోపాలు ఉండటంతో వీటిని గాడ్జెట్ల తయారీ తక్కువగా వినియోగిస్తున్నారు.

 

No comments:

Post a Comment