Wednesday 24 May 2017

ఇండియన్ ఆర్మీలో 130 పోస్టులు

ఇండియన్ ఆర్మీలో 130 పోస్టులు

ఆర్మీలో 130 పోస్టులను 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్-38 (10+2 టీఈఎస్-38), టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్-126 (టీజీఎస్-126) ద్వారా భర్తీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనలు వెలువడ్డాయి. 10+2 టీఈఎస్-38 ద్వారా 90, టీజీఎస్-126 ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీఈఎస్‌కు అవివాహిత పురుషులు, టీజీఎస్‌కు అవివాహిత/వివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
Jobsవయోపరిమితి: 10+2 టీఈఎస్-38 కోర్సుకు.. అభ్యర్థులు 1998, జూన్ 1 - 2001, జూన్ 1 మధ్య జన్మించి ఉండాలి. టీజీఎస్-126 కోర్సుకు.. 20-27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
విద్యార్హత: 10+2 టీఈఎస్-38 కోర్సుకు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టీజీఎస్-126 కోర్సుకు.. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ/బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వేతనం: శిక్షణలో రూ.21,000. అనంతరం లెఫ్టినెంట్, కల్నల్ ... తదితర హోదాలను అనుసరించి వేతనం పెరుగుతుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్. మొదట దరఖాస్తులను పరిశీలించి కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత నిర్దేశిత కేంద్రాల్లో ఎస్‌ఎస్‌బీ ఇంటర్య్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, తగిన శారీరక ప్రమాణాలు, ఆరోగ్యం ఉన్నవారిని ఎంపికచేస్తారు.
శారీరక ప్రమాణాలు-ఆరోగ్యం: అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, ఆరోగ్యం తప్పనిసరి. దీంతోపాటు టీజీఎస్-126 అభ్యర్థులు 2.4 కి.మీ దూరాన్ని 15 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. 3-4 మీటర్ల రోప్ క్లైంబింగ్ అధిగమించాలి. అలాగే 13 పుష్ అప్స్, 25 సిట్ అప్స్, 6 చిన్ అప్స్ నియమిత సమయానికి తీయగలగాలి.
శిక్షణ: 10+2 టీఈఎస్-38 వ్యవధి ఐదేళ్లు. ఇందులో మొదట ఏడాదిపాటు గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. అనంతరం రెండోదశలో పేజ్-1 (ప్రీ కమిషన్ ట్రైనింగ్) మూడేళ్లు, పేజ్-2 (పోస్ట్ కమిషన్ ట్రైనింగ్) ఏడాది పాటు పుణె లేదా సికింద్రాబాద్‌లోని మిలిటరీ విభాగాల్లో ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అవార్డ్ ఆఫ్ డిగ్రీ ప్రకటిస్తారు. టీజీఎస్-126 శిక్షణ వ్యవధి ఏడాది. దీన్ని డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇస్తారు. శిక్షణ అనంతరం ఆఫీసర్ కేడర్‌లో నియమితులవుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని రెండు ప్రింటవుట్లు తీసుకొని, ఒకదానికి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు తదితరాలను జతచేసి, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయంలో అందజేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 14, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in


Monday 1 May 2017

ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో 384 పోస్టులు

ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో 384 పోస్టులు

ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో 384 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నేవీ పరిధిలోని ఇతర శాఖల్లో పనిచేయగలగాలి.
Jobsమొత్తం పోస్టులు: 384 (అన్‌రిజర్వ్డ్-194, ఓబీసీ-104, ఎస్సీ-57, ఎస్టీ-29). మొత్తం పోస్టుల్లో కొన్నింటిని ఎక్స్-సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కేటాయించారు.
వేతనం: రూ.18,000-రూ.56,900.
విద్యార్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసేనాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లిష్ 25, జనరల్ అవేర్‌నెస్ 25 మార్కులకు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (29 ఏప్రిల్-5 మే) సంచికలో నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల వరకు.

వెబ్‌సైట్: www.bhartiseva.comwww.joinindiannavy.gov.in

ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్: Batukamma

ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్: Batukamma