ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో 384 పోస్టులు
ముంబైలోని
నేవల్ డాక్‌యార్డ్‌లో 384 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి ఇండియన్
నేవీ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నేవీ
పరిధిలోని ఇతర శాఖల్లో పనిచేయగలగాలి.
|
వేతనం: రూ.18,000-రూ.56,900. విద్యార్హత: పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత. వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసేనాటికి 18-25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్. రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లిష్ 25, జనరల్ అవేర్‌నెస్ 25 మార్కులకు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (29 ఏప్రిల్-5 మే) సంచికలో నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల వరకు. వెబ్‌సైట్: www.bhartiseva.com, www.joinindiannavy.gov.in |
No comments:
Post a Comment