Saturday 10 February 2018

రైల్వేలో 62907 గ్రూప్‌-డి పోస్టులు


దేశంలోని ప‌లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 62907 గ్రూప్‌-డి పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. వీటికి ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ట్రాక్‌మెన్‌, గేట్‌మెన్‌, పాయింట్స్‌మెన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ మొద‌లైన పోస్టులు గ్రూప్‌-డి ప‌రిధిలో ఉన్నాయి.
విద్యార్హ‌త‌: కొన్ని విభాగాల‌కు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. మిగిలిన వాటికి ప‌దోత‌ర‌గ‌తితోపాటు ఐటీఐ లేదా నేష‌న‌ల్ అప్రెంటీస్ స‌ర్టిఫికెట్ ఉండాలి (ఆఖ‌రు సంవ‌త్స‌రం కోర్సులు చ‌దువుతున్న‌వాళ్లు అన‌ర్హులు)
వ‌యోప‌రిమితి: జులై 1, 2018 నాటికి 18 నుంచి 31 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష ద్వారా
వేత‌నం: ఎంపికైన‌వారికి రూ.18,000 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. దీంతోపాటు ఇత‌ర ఆల‌వెన్సులు ఉంటాయి.
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ. 250; జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్ర‌వ‌రి 10 ఉద‌యం 10 గంట‌ల నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 12, 2018

రైల్వేలో 62,907 గ్రేడ్-4 పోస్టులకు నోటిఫికేషన్

రైల్వేలో 62,907 గ్రేడ్-4 పోస్టులకు నోటిఫికేషన్

దేశంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బీలు) 62,907 గ్రేడ్ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.
Jobsఅర్హత: కొన్నింటికి పదోతరగతి, మిగతా వాటికి పదో తరగతితోపాటు ఐటిఐ ఉత్తీర్ణత.
పోస్టులు: ట్రాక్‌మెన్, గేట్‌మెన్, స్విచ్‌మెన్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ సిగ్నల్/ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో హెల్పర్స్, పోర్టర్ .
వయసు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 31 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపులు ఉంటాయి.
వేతనం: ఉద్యోగాలకు ఎంపికైన వారు నెలకు రూ. 18 వేల వేతనంతో పాటు అలవెన్సులు పొందుతారు.
దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 10 నుంచి మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in

Saturday 3 February 2018

రైల్వేలో 26502 అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ ఖాళీలు

రైల్వేలో 26502 అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ ఖాళీలు

* సౌత్ సెంట్ర‌ల్ రైల్వే సికింద్రాబాద్‌లో 3077 ఖాళీలు
దేశంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు సంయుక్తంగా కేంద్రీయ ఉద్యోగాల భ‌ర్తీ విధానంలో 26502 అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేశాయి. వీటికి ఫిబ్ర‌వరి 3 (శ‌నివారం) నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మార్చి 5 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా విద్యార్థులు ఈ పోస్టుల‌కు అర్హులు. అలాగే ఆఖ‌రు సంవ‌త్స‌రం కోర్సులు చ‌దువుతున్న‌వాళ్లు అన‌ర్హులు. జులై 1, 2018 నాటికి 18 నుంచి 28 ఏళ్ల‌లోపు వ‌య‌సువాళ్లు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. అభ్య‌ర్థుల‌ను రెండంచెల్లో నిర్వ‌హించే కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా ఎంపిక‌చేస్తారు. ప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కులు ఉన్నాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికీ మార్కులో మూడో వంతు చొప్పున త‌గ్గిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారికే స్టేజ్ 2 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్ష‌లో 75 ప్ర‌శ్న‌లు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్టేజ్ 2లో పార్ట్ ఎ, బిలు ఉంటాయి. పార్ట్ ఎలో వంద ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటిని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్ బిలో 75 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటికి ఒక గంట కేటాయించారు. ద‌ర‌ఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ.250; మిగిలిన అంద‌రికీ రూ.500.
వెబ్‌సైట్లు: http://www.rrbahmedabad.gov.in/

Friday 2 February 2018

రైల్వేలో 26,502 ఏఎల్‌పీ, టెక్నీషియ‌న్ పోస్టులు (చివ‌రి తేది: 05.03.18)

భార‌త రైల్వే మంత్రిత్వ శాఖ ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి కేంద్రీయ ఉద్యోగ భ‌ర్తీ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది.
వివ‌రాలు
.......* అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ (సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేష‌న్) మొత్తం పోస్టుల సంఖ్య: 26,502
ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ ద్వారా భ‌ర్తీ అయ్యే పోస్టులు: 3262 (ఏఎల్‌పీలు 2719, టెక్నీషియ‌న్లు 543)
అర్హత‌:
ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ అప్రెంటీస్‌షిప్/ ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎంపిక విధానం: రెండంచెల కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా. ఏఎల్‌పీ పోస్టుల‌కు చివ‌రిగా ఆప్టిట్యూడ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ప‌రీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ మార్కులో మూడో వంతు చొప్పున త‌గ్గిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించిన‌వారికే స్టేజ్ 2 ప‌రీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 1 ప‌రీక్షలో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్టేజ్ 2లో పార్ట్ ఎ, బిలు ఉంటాయి. పార్ట్ ఎలో వంద ప్రశ్నలు వ‌స్తాయి. వీటిని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్ బిలో 75 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి ఒక గంట కేటాయించారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ.250; మిగిలిన అంద‌రికీ రూ.500.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 05.03.2018

 
 

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు (చివరి తేది: 28.02.18)

హైద‌రాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్‌ యూనివ‌ర్సిటీ వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* బీఏ/ బీకాం/ బీఎస్సీ డిగ్రీ కోర్సులుఅర్హత‌: ఇంట‌ర్ లేదా త‌త్సమాన విద్యార్హత‌.వ‌యసు: 01.07.2018 నాటికి 18 సంవ‌త్సరాలు నిండి ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ద్వారా.ప్రవేశ ప‌రీక్ష తేది: 11.03.2018.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.02.2018.