Saturday 10 February 2018

రైల్వేలో 62907 గ్రూప్‌-డి పోస్టులు


దేశంలోని ప‌లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు 62907 గ్రూప్‌-డి పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. వీటికి ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ట్రాక్‌మెన్‌, గేట్‌మెన్‌, పాయింట్స్‌మెన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్ మొద‌లైన పోస్టులు గ్రూప్‌-డి ప‌రిధిలో ఉన్నాయి.
విద్యార్హ‌త‌: కొన్ని విభాగాల‌కు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌. మిగిలిన వాటికి ప‌దోత‌ర‌గ‌తితోపాటు ఐటీఐ లేదా నేష‌న‌ల్ అప్రెంటీస్ స‌ర్టిఫికెట్ ఉండాలి (ఆఖ‌రు సంవ‌త్స‌రం కోర్సులు చ‌దువుతున్న‌వాళ్లు అన‌ర్హులు)
వ‌యోప‌రిమితి: జులై 1, 2018 నాటికి 18 నుంచి 31 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష ద్వారా
వేత‌నం: ఎంపికైన‌వారికి రూ.18,000 మూల‌వేత‌నంగా చెల్లిస్తారు. దీంతోపాటు ఇత‌ర ఆల‌వెన్సులు ఉంటాయి.
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళ‌ల‌కు రూ. 250; జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభ తేదీ: ఫిబ్ర‌వ‌రి 10 ఉద‌యం 10 గంట‌ల నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 12, 2018

No comments:

Post a Comment