రైల్వేలో 26502 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఖాళీలు
* సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో 3077 ఖాళీలు
దేశంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు సంయుక్తంగా కేంద్రీయ ఉద్యోగాల భర్తీ విధానంలో 26502 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేశాయి. వీటికి ఫిబ్రవరి 3 (శనివారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లు అనర్హులు. జులై 1, 2018 నాటికి 18 నుంచి 28 ఏళ్లలోపు వయసువాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అభ్యర్థులను రెండంచెల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ మార్కులో మూడో వంతు చొప్పున తగ్గిస్తారు. స్టేజ్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికే స్టేజ్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 1 పరీక్షలో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్టేజ్ 2లో పార్ట్ ఎ, బిలు ఉంటాయి. పార్ట్ ఎలో వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్ బిలో 75 ప్రశ్నలు వస్తాయి. వీటికి ఒక గంట కేటాయించారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250; మిగిలిన అందరికీ రూ.500.
వెబ్‌సైట్లు: http://www.rrbahmedabad.gov.in/

No comments:
Post a Comment