Monday 27 May 2019

పోలీసు మెయిన్ పరీక్షల తుది 'కీ' విడుదల

తెలంగాణలో 18,428 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్షల ఫలితాలను కూడా తెలంగాణ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాల్లో ఫలితాల్లో మొత్తం 83.46 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్‌ఐ పరీక్షలకు సంబంధించి మొత్తం 53,633 మంది అభ్యర్థులు తుది పరీక్షలు రాయగా.. వీరిలో 39,079 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి 1,09,095 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 96,750 అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా.. మెయిన్ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌'కీ'ని పోలీస్ నియామక మండలి సోమవారం (మే 27) విడుదల చేసింది. విభాగాల వారీగా ఆన్సర్'కీ'ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

✦ ఎస్‌ఐ (సివిల్) ఫైనల్ 'కీ' 

✦ ఎస్‌ఐ (ఐటీ/కమ్యూనికేషన్స్)/ ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) ఫైనల్ 'కీ' 
✦ కానిస్టేబుల్ (సివిల్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (ఐటీ/కమ్యూనికేషన్స్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (డ్రైవర్) ఫైనల్ 'కీ' 

✦ కానిస్టేబుల్ (మెకానిక్) ఫైనల్ 'కీ' 

✪ ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

రాష్ట్రంలో మొత్తం 18,428 పోలీసు పోస్టుల భర్తీకి గతేడాది మేలో పోలీసు నియామక మండలి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. వీటి 17,156 కానిస్టేబుల్ ఉండగా.. 1,272 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌, మే నెలల్లో తుది పరీక్షలను నిర్వహించారు. వీటి ఫలితాలను మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

తుది ఫలితాల్లో అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం.. ఖాళీలు, రిజర్వేషన్ల ప్రాతిపదికన కటాఫ్‌ మార్కులు నిర్ణయిస్తారు. కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో తుది జాబితాలో ఎంపికై అభ్యర్థులకు జూన్‌ నుంచే పోలీసు శిక్షణ ప్రారంభం కానుంది. జూన్‌ నెలాఖరునాటికి ఎస్‌ఐలకు, జులై నుంచి కానిస్టేబుల్ శిక్షణ చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 
వెబ్‌సైట్ 

ఆర్పీఎఫ్ 2019 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మే 27న విడుదల చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి, గ్రూప్-ఈ, గ్రూప్-ఎఫ్ రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను పొందుపరిచారు. హాల్‌టికెట్ నెంబరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలతో ఎంపిక జాబితాను రూపొందించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన షెడ్యూలును అధికారులు వెబ్‌సైట్ ద్వారా ప్రకటించనున్నారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. 
✪ అభ్యర్థులు మొదట ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి - http://cpanc.rpfonlinereg.org/ 
✪ వెబ్‌సైట్‌ హోంపేజీలో కనిపించే “ Qualified Candidates” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

✪ క్లిక్ చేయగానే.. రైల్వే జోన్లవారీగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన గ్రూపులు కనిపిస్తాయి. 
✪ వాటిలో సంబంధిత గ్రూపుపై క్లిక్ చేయగానే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న అభ్యర్థుల ఎంపిక జాబితా కనిపిస్తోంది. 
✪ పీడీఎఫ్‌లో ' Ctrl + F' క్లిక్ చేయగా.. వచ్చే బాక్సులో అభ్యర్థి హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి. జాబితాల నెంబరు వస్తేనే అర్హత సాధించినట్లు.. లేకపోతే అనర్హులు. 

టీఎస్ పీఈసెట్ 2019 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఫిజకల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) - 2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం (మే 27) ఫలితాలను విడుదల చేశారు. అధికార వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీఈసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ)లో 2,038 మంది అభ్యర్థులు, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ)లో 1,798 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. 

వెబ్‌సైట్..
 

పీఈసెట్ పరీక్ష ద్వారా వ్యాయామ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి రెండేళ్ల బ్యాచిలర్ కోర్సు, రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం మహాత్మాగాంధీ యూనివర్సిటీ మే 15న పీఈసెట్-2019 పరీక్ష నిర్వహించింది. 

ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు సోమవారం (మే 27) విడుదలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు మే 27న ఫలితాలను వెల్లడించింది. రీవెరిఫికేషన్‌ ఫలితాలతో పాటు.. విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్‌ కాపీలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో ఫెయిలైన మొత్తం 3,82,116 మంది విద్యార్థుల ఫలితాలను ఇంటర్‌ బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. వీటిలో 92,429 జవాబు పత్రాలను అధికారులు రీవెరిఫికేషన్ చేశారు. వీటి ఫలితాలనే బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు హాల్‌టికెట్‌ నెంబరు నమోదుచేసి స్కానింగ్‌ కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

జూన్ 7 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. 
షెడ్యూలు ప్రకారం జూన్‌ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను కళాశాలల లాగిన్‌లో మే 25 నుంచి అందుబాటులో ఉంచారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ వాటిని డౌన్‌లోడు చేసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ హాల్‌టికెట్లతో జూన్‌ 7 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరుకావాలి. జూన్ 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

Saturday 25 May 2019

Navodaya 6th Class Entance Exam Results


 Navodaya 6th Class Entance Exam Results

Image result for navodaya Navodaya Results...Click Here

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

తెలంగాణలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. 



6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2019 

7వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు - 2019 

రాష్ట్రవ్యాప్తంగా పాతజిల్లాల ప్రాతిపదికన మొత్తం 261 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 132 బాలుర పాఠశాలలు కాగా.. 129 బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాల కోసం బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించింది.

పోలీసు ఉద్యోగాల తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన తుది రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తుది పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి శనివారం (మే 25) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించి.. తుదిపరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 
రాతపరీక్షలకు సంబంధించి తుది కీ, ఓఎంఆర్‌ జవాబు పత్రాలను కూడా మే 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మార్కులపై సందేహాలుంటే.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. మే 28న ఉదయం 8.30 గంటల నుంచి మే 30న రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకుగాను రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులుంటే.. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్‌ నెంబరు వివరాలతో సంబంధిత చిరునామాకు ఈమెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చు. 
ఈమెయిల్: support@tslprb.in 

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌లో ఇంజినీర్లు (చివ‌రితేది: 04.06.19)

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్.. చెన్నై యూనిట్‌లో ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న‌ కింది ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....* ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ఇంజినీర్ మొత్తం ఖాళీలు: 15విభాగాల‌వారీ ఖాళీలు: ఎల‌క్ట్రానిక్స్‌-06, మెకానిక‌ల్‌-07, కంప్యూట‌ర్ సైన్స్‌-02.అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.వ‌యఃప‌రిమితి: 01.04.2019 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక: రాతప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ (ఈ-మెయిల్), ఆఫ్‌లైన్ (పోస్టు) ద్వారా.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.06.2019హార్డుకాపీల‌ను పంపేందుకు చివ‌రితేది: 11.06.2019చిరునామా: Deputy General Manager (HR&A), Bharat Electronics Limited, BEL-Army Road, Nandambakkam, Chennai - 600 089, Tamil Nadu.
 

Friday 24 May 2019

ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. 8 నుంచి ఇంటర్ అర్హత ఉంటే చాలు

ఏపీలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. చెన్నైలోని జోన‌ల్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్, గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూల్‌, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఒంగోలులోని పరేడ్ గ్రౌండ్‌లో జులై 5 నుంచి 15 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 

* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

పోస్టుల వివరాలు..

పోస్టులుఅర్హత
సోల్జర్ జ‌న‌ర‌ల్ డ్యూటీపదోతరగతి/ తత్సమాన విద్యార్హత
సోల్జర్ టెక్నిక‌ల్‌ఇంటర్ (ఎంపీసీ)
సోల్జర్ టెక్నిక‌ల్ (ఏవియేష‌న్‌/ అమ్యూనిష‌న్ ఎగ్జామిన‌ర్‌)ఇంటర్ (ఎంపీసీ)
సోల్జర్ న‌ర్సింగ్ అసిస్టెంట్‌/ న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్నరీఇంటర్ (బైపీసీ)
సోల్జర్ క్లర్క్‌/ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌ఇంటర్ (ఆర్ట్స్, కామర్స్, సైన్స్)
సోల్జర్ ట్రేడ్‌మెన్ప‌దో త‌ర‌గ‌తి
సోల్జర్ ట్రేడ్‌మెన్ఎనిమిదో త‌ర‌గ‌తి

వయోపరిమితి: సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 17.5 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా. 

ముఖ్యమైన తేదీలు.. 
✦ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2019. 
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.06.2019. 
✦ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 20.06.2019 నుంచి. 
✦ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ: 05.07.2019 - 15.07.2019. 

Notification 

Website 

Telangana Ecet-2019 Results || తెలంగాణా ఈ సెట్ పరిక్ష ఫలితాలు 2019



Telangana Ecet-2019 Results..... Click Here 



మ‌ద్రాసు హైకోర్టులో డ్రైవ‌ర్‌, గార్డెన‌ర్ పోస్టులు (చివ‌రితేది: 23.06.19)

హైకోర్ట్ ఆఫ్ మ‌ద్రాస్‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు....1) డ్రైవ‌ర్‌: 30అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.వ‌యఃప‌రిమితి: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.2) గార్డెన‌ర్‌: 24అర్హ‌త‌: ఎనిమిదో త‌ర‌గ‌తి లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.వ‌యఃప‌రిమితి: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్‌, ఓర‌ల్ టెస్ట్ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌చివ‌రితేది: 23.06.2019
 

Monday 20 May 2019

ఆర్‌జీయూకేటీ, బాస‌ర‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు (చివ‌రితేది: 10.06.19)

బాస‌ర (తెలంగాణ‌)లోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (ఆర్‌జీయూకేటి) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...1) టీచింగ్‌* గెస్ట్ ఫ్యాక‌ల్టీ (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్)ఇంజినీరింగ్ విభాగాలు: కెమిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్స్, ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్, మెకానిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్ అండ్ మెటీరియ‌ల్ ఇంజినీరింగ్.నాన్ ఇంజినీరింగ్ విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మేనేజ్‌మెంట్ అండ్ తెలుగు.2) నాన్‌టీచింగ్‌* గెస్ట్ ల్యాబొరేట‌రీ అసిస్టెంటు, గెస్ట్ ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్‌అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీటెక్/ బీఈ, ఎంటెక్‌/ ఎంఈ ఉత్తీర్ణ‌త‌తో పాటు నెట్‌/ సెట్/ స‌్లెట్ ఉండాలి.ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్టు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 20.05.2019 నుంచి 10.06.2019 వ‌ర‌కు.

 

ఈపీఎఫ్ఓ (EPFO) లో 280 ఉద్యోగాలు

అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO, ఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 25. డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈపీఎఫ్ఓ జారీ చేసిననోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

మొత్తం పోస్టులు- 280 దరఖాస్తు ప్రారంభం- 2019 మే 30 
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 25 
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- జూలై 20 నుంచి జూలై 30 
ప్రిలిమినరీ ఎగ్జామ్- జూలై 30, 31 మెయిన్ ఎగ్జామ్- తేదీ వెల్లడించాల్సి ఉంది.
వేతనం: 7వ పే కమిషన్ కింద రూ.44,900.
అర్హత: డిగ్రీ పాసవ్వాలి
వయస్సు: 20 నుంచి 27 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

TELANGANA GURUKUL [V-TG] CET -2019 Results

TELANGANA GURUKUL [V-TG] CET -2019

Results Available Now......!!!

 TG Cet Results
Results Available Now......!!!

Sunday 19 May 2019

ఎల్ఐసీలో 1251 ఏడీఓ పోస్టులు (చివ‌రితేది: 09.06.19)

హైద‌రాబాద్ (తెలంగాణ‌)లోని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) సౌత్ సెంట్ర‌ల్ జోన‌ల్ ఆఫీస్ దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ ఆఫీసులలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* అప్రెంటిస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్లు (ఏడీఓ)* మొత్తం ఖాళీలు: 1251అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.వ‌య‌సు: 01.05.2019 నాటికి 21 -30 మ‌ధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ ఆధారంగా.ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 6, 13మెయిన్స్ ఎగ్జామ్ తేది: ఆగ‌స్టు 10.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీల‌కు రూ.50.ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 20.05.2019 నుంచి 09.06.2019 వర‌కు.