Sunday 19 May 2019

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు

state bank of india invites online applications for the recruitment of specialist cadre officers postsముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.740 చెల్లించి జూన్ 2 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. 

పోస్టుల వివ‌రాలు...

* స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు: 19 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

పోస్టులుఖాళీల సంఖ్య
జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఐటీ - స్ట్రాట‌జీ, ఆర్కిటెక్చర్& ప్లానింగ్‌)01
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్)01
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (ఎంటర్‌ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్)01
అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ (ఎంటర్‌ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్)01
చీఫ్ మేనేజ‌ర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ )01
చీఫ్ మేనేజ‌ర్‌ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్ )01
చీఫ్ మేనేజ‌ర్‌ (బిజినెస్ ఆర్కిటెక్ట్ )02
మేనేజ‌ర్‌ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ )01
మేనేజ‌ర్‌ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్)02
మేనేజ‌ర్‌ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్)02
సీనియ‌ర్ క‌న్సల్టెంట్ అన‌లిస్ట్‌01
డేటా ట్రాన్స్‌లేట‌ర్‌02
డేటా ఆర్కిటెక్ట్‌02
డేటా ట్రైన‌ర్‌01
మొత్తం ఖాళీలు19

అర్హత‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, ఎంబీఏ, ఉత్తీర్ణతతో పాటు అనుభ‌వం ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఎంపిక‌ విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. 

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం16.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లించడానికి చివరితేది02.06.2019
దరఖాస్తుల ఎడిటింగ్‌కు చివరితేది02.06.2019
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది09.06.2019

Notification 

Online Application 

No comments:

Post a Comment