తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన తుది రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తుది పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి శనివారం (మే 25) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించి.. తుదిపరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
రాతపరీక్షలకు సంబంధించి తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలను కూడా మే 27 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. మార్కులపై సందేహాలుంటే.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. మే 28న ఉదయం 8.30 గంటల నుంచి మే 30న రాత్రి 8 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకుగాను రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2000 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులుంటే.. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలతో సంబంధిత చిరునామాకు ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు.
ఈమెయిల్: support@tslprb.in

No comments:
Post a Comment