Sunday 12 May 2019

TS 10th Result 2019: తెలంగాణ‌ పదోతరగతి ఫలితాలు..

తెలంగాణ‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలు సోమవారం (మే 13) విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈసారి సీబీఎస్‌ఈ తరహాలో పూర్తి విశ్లేషణతో ఫలితాలను వెల్లడించనున్నారు. పాఠశాలల వారీగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయిలు లాగిన్ వివరాలను సమర్పించి ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 4,73,321 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 
ఫలితాలను కింది వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు..
www.bse.telangana.gov.in 

www.manabadi.com 

http://results.cgg.gov.in/ 

13 నుంచే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు 
ఫలితాల వెల్లడి రోజు అంటే.. మార్చి 13 నుంచే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 27 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఫిర్యాదుల కోసం ప్రత్యేక 'యాప్‌' 
పదోతరగతి ఫలితాలపై ఫిర్యాదుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రత్యేక యాప్‌ను రూపొందిచారు. 'TSSSC BOARD' పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా సంబంధిత పాఠాశాలల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదులు సమర్పించవచ్చు. 

No comments:

Post a Comment