Monday, 27 May 2019

ఆర్పీఎఫ్ 2019 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మే 27న విడుదల చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి, గ్రూప్-ఈ, గ్రూప్-ఎఫ్ రాతపరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను పొందుపరిచారు. హాల్‌టికెట్ నెంబరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలతో ఎంపిక జాబితాను రూపొందించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన షెడ్యూలును అధికారులు వెబ్‌సైట్ ద్వారా ప్రకటించనున్నారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. 
✪ అభ్యర్థులు మొదట ఆర్పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి - http://cpanc.rpfonlinereg.org/ 
✪ వెబ్‌సైట్‌ హోంపేజీలో కనిపించే “ Qualified Candidates” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

✪ క్లిక్ చేయగానే.. రైల్వే జోన్లవారీగా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన గ్రూపులు కనిపిస్తాయి. 
✪ వాటిలో సంబంధిత గ్రూపుపై క్లిక్ చేయగానే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న అభ్యర్థుల ఎంపిక జాబితా కనిపిస్తోంది. 
✪ పీడీఎఫ్‌లో ' Ctrl + F' క్లిక్ చేయగా.. వచ్చే బాక్సులో అభ్యర్థి హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి. జాబితాల నెంబరు వస్తేనే అర్హత సాధించినట్లు.. లేకపోతే అనర్హులు. 

No comments:

Post a Comment