Tuesday 14 May 2019

డిగ్రీ ప్రవేశాలకు'దోస్త్'.. నోటిఫికేషన్ !!!

తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మే 15న నోటిఫికేషన్ వెలువడనుంది. మే 16 నుంచి దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. వాస్తవానికి మే 9న 'దోస్త్' ప్రవేశ ప్రకటన జారీచేసి.. 10 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని భావించారు. అయితే ఇంటర్‌ పునఃపరిశీలన పూర్తయినప్పటికీ.. సర్టిఫికేట్లు రావడానికి ఆలస్యమవుతుందని భావించిన విద్యాశాఖ ఆరురోజులపాటు దోస్త్‌ ప్రక్రియను వాయిదా వేసింది. 

ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే కళాశాలలకు ఫీజు చెల్లింపు, రిపోర్టు చేసే విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభంకానున్నాయి. అన్ని వర్సిటీల పరిధిలో విద్యాసంవత్సరం షెడ్యూల్ ఒకేలా ఉండాలని అధికారులు నిర్ణయించారు. 

ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 20% యాజమాన్య కోటా ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సుముఖంగా ఉన్నప్పటికీ.. ఈ విద్యాసంవత్సరం నుంచి అమలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో మే 27 వరకు దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి రానున్న విద్యాసంవత్సరం నుంచే యాజమాన్య కోటా అమలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
వెబ్‌సైట్ 

No comments:

Post a Comment