Sunday 28 August 2016

PAVAN: Home

PAVAN: Home: **డిజిటల్ సేవా కేంద్రం** డిజిటల్ సేవా కేంద్రం మరియు ఇంటర్నెట్ & జిరాక్స్ సెంటర్ : మా యొక్క ప్రత్యేకతలు కలర్ బ్లాక్ జిరక...

Saturday 27 August 2016

వాస్తు శాస్త్రం .........లో


*ధనవంతులు అవ్వడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్*

వాస్తు టిప్ 1:

సంపద బాగా వ్రుద్ది చెందాలంటే ఇంట్లో నార్త్ డైరెక్షన్ లో ఉంచడం వల్ల పాజిటివ్ మరియు ఎనర్జీని పొందుతారు. ఇంటి ప్రదాన ద్వారం ముందు ఎలాంటి వైర్లు , పోల్స్, పిట్ లేదా ఇతర వస్తువులను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వాస్తు టిప్ 2:

నార్త్ , ఈస్ట్ ప్రదేశంలో బీరువా ఉంచుకోవడం వల్ల ఎంత సంపాందించినా నిలవదు. ఎక్కువగా ఖర్చై పోతుంది, ఖర్చులుపెరుగుతాయి. నార్త్ ఈస్ట్ లో ప్రదేశంలో ఇంటిని క్లీన్ గా...ఓపెన్ గా ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అక్కడ దేవుడుని పూజించుకోవచ్చు.

వాస్తు టిప్ 3:

నార్త్ కుబేరునికి మంచి ప్రదేశం, సంపద పెరుగుతుంది. కాబట్టి, ఈ ప్రదేశం ఎనర్జిటిక్ గా మరియు పాజిటివ్ గా ఉంచుకోవాలి . సంపద పెరగడానికి సహాయపడుతుంది.

వాస్తు టిప్ 4:

మన ఇల్లు ఒక దేవాలయం వంటిది. ఇంటిని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటే అంత ప్రయోజనాలను పొందవచ్చు. అందువల్ల ఇంట్లో ధనం సంపంద వ్రుద్ది చెందాలంటే ఇంటిని అన్ని రకాలుగా సిద్దంగా ఉంచాలి.

వాస్తు టిప్ 5:

ఇంట్లో సంపద పెరగాలంటే నార్త్ ఈస్ట్ ఇంటి మీద కానీ, లేదా గ్రౌండ్ లో కానీ వాటర్ ట్యాంక్స్ ఉండకూడదు.

వాస్తు టిప్ 6:

ఫిష్ ఎక్వేరియం సంపదకు పాజిటివ్ గా సూచిస్తుంటారు. కాబట్టి అట్రాక్టివ్ గా మరియు హెల్తీగా..చురుకుగా తిరుగాడు చేపలను ఎంపిక చేసుకుని ఫిష్ ట్యాంక్ లో వదలాలి. వాటర్ తరచూ మార్చుతుండాలి. మురికిగా మారకుండా ఏరియేటెడ్ చేయాలి. ఫిష్ టాంక్ లో చేపలు చురుకుగా తిరుగుతుంటే ఇంట్లో సంపద, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

వాస్తు టిప్ 7:

ఎప్పుడూ బెడ్ రూమ్ లోని విండోస్ కనీసం రోజుకు 20 నిముషాల తెరిచి ఉంచాలి. ఫ్రెష్ ఎనర్జీ లోపలకి రావడానికి సహాయపడుతుంది. అలాకాకపోతే, ప్రతి రోజూ రాత్రి నెగటివ్ ఎనర్జీతో నిద్రించాల్సి వస్తుంది . ఇలా జరిగితే , భవిష్యత్త్ సుఖంగా ఉంటుందని మీరు ఎలా భావిస్తారు . బెడ్ ఎప్పుడూ ఫ్లోర్ కు ఒక అడుగు ఎత్తులోఉండాలి . కొన్ని నియమాలు పాటించడం వల్ల సంపద పెరుగుతుంది.

వాస్తు టిప్ 8:

ఇంట్లో గడియారాలన్ని పనిచేసేట్లు చూసుకోవాలి. ఒక వేళ పనిచేయకపోతే, వాటిని రిపేర్ చేయించడం లేదా వాటిని పారవేయడం చేయాలి. గడియారం పనిచేయకపోతే ఆర్థికపరంగా స్థిరంగా ఉండలేరు . ఆలస్యంగా తిరిగే గడియారాలన్నీ మీ డ్యూడేట్స్ కు సంకేతంగా సూచిస్తుంటాయి.

వాస్తు టిప్ 9:

ఇంటికి ప్రధాణ ద్వారం చాలా ముఖ్యం. పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా ఇంటి ప్రధాన ద్వారం గుండానే ప్రవేశిస్తుంది. ప్రధాన ద్వారం అపార్ట్ మెంట్ లోని చివరగా ఉంటే సంపద పెరగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫైనాన్సియల్ గా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వాస్తు టిప్ 10:

వాస్తు నియమాల్లో ముఖ్యమైనది , ఇంట్లో గాలి వెలుతురు బాగా వస్తుండాలి, విండోస్, డోర్లు క్లీన్ గా ఓపెన్ గా ఉండాలి . ఇలా ఉన్నప్పుడు సంపద వెల్లువలా వచ్చి పడుతుంది.

వాస్తు టిప్ 11:

ఇంట్లో దేవుడు విగ్రహాలు, ముఖ్యంగా గణేషుడు విగ్రహం, ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అయితే గణేష్ విగ్రహాలను నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు.

వాస్తు టిప్ 12:

వాస్తు నియమాల్లో క్యాస్ డ్రాయర్ లో అద్దం పెట్టడం సంపదను సూచిస్తుంది, సంపదను పెంచుతుంది . బాత్ రూమ్ లో గ్రీన్ ప్లాంట్స్ గ్రెయిన్స్ ఉంచడం వల్ల మంచిది., అదే విధంగా పగిలిన అద్దాలు, నిలిచిపోయిన గడియారాలు, లేదా పనిచేయని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు .

వాస్తు టిప్ 13:

ఫైనాల్సియల్ గా స్థిరపడాలంటే సౌత్ వెస్ట్ ‘‘కుబేర మూల' (ఈ కార్నర్ సంపదకు నిలయం). సేఫ్టీ లాకర్స్ ను దక్షిణ గోడకు కు నార్త్ వైపు ఓపేన్ చేసే విధంగా ఉండాలి . ఇది కుబేరున్ని ఆహ్వానించడానికి మంచి వాస్తు.

వాస్తు టిప్ 14:

లాకర్ ను నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. ధన నష్టం జరుగుతుంది. సౌత్ ఈస్ట్-నార్త్ వెస్ట్ కార్నర్స్ కూడా మంచిది కాదు, అనవసర ఖర్చులను సూచిస్తుంది.

వాస్తు టిప్ 15:

డోర్స్ మరియు విండోస్ యొక్క అద్దాలు క్లీన్ గా ఉంచాలి. ఇవి క్లీన్ గా లేకపోతే వచ్చే సంపదను అడ్డుకుంటుంది.

వాస్తు టిప్ 16:

ఇంట్లో సంపద నీళ్ల ప్రాయంగా ఖర్చైపోతుంటే, బాత్ రూమ్ లో గ్రీన్ ప్లాంట్స్ లేదా గ్రెయిన్స్ ఉంచాలి. డబ్బు అనవసరంగాఖర్చుకాకుండా చేస్తుంది. . చెట్లు పెరిగినట్లు, నీరు రీసైలింగ్ పద్దతిలో నిండుతున్నట్లు సంపద పెరగుతుంది, నిలుస్తుంది.

వాస్తు టిప్ 17:

బాల్కనీ, లేదాయార్డ్ లో పక్షులకు ఆహారం లేదా బర్డ్ బాత్ ను అరేంజ్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీని అవి తీసుకొస్తాయి . బర్డ్ బాత్స్ లేదా ఫీడర్స్ ఫైనాన్సియల్ సమస్యలను క్లియర్ చేస్తాయి.

వాస్తు టిప్ 18:

డ్రైనేజ్ పైప్స్ ఈస్ట్ లేదా నార్త్ లో ఫిట్ చేయాలి . ఈ ప్రదేశంలో గుంతలు, మర్మమత్తులు లేకుండా చూసుకోవాలి.

Thursday 18 August 2016

HOW TO START APNA CSC CENTER - Video Dailymotion

HOW TO START APNA CSC CENTER - Video Dailymotion: Common Services Centers (CSC) are multiple-services-single-point model for providing facilities for multiple transactions at a single geographical location. The main purpose of these centres is to provide a physical facility for delivery of e-Services of the Government of India to the rural and remote locations where availability of computers and Internet is currently negligible or mostly absent. The introduction of eGovernance on a massive scale is part of the Common Minimum Programme (CMP) of the UPA-II (2009-2014) government of India. The CSC project, which forms a strategic component of the National eGovernance Plan was approved in September 2006.[1][2] It is also one of the approved projects under the Integrated Mission Mode Projects of the National eGovernance Plan.

Monday 15 August 2016

19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్


 భాగస్వామ్య బ్యాంకులు:
ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ-VIఆధారంగా అభ్యర్థులను నియమించుకోనున్న బ్యాంకులు...
  1. అలహాబాద్ బ్యాంక్
  2. ఆంధ్రా బ్యాంక్
  3. బ్యాంక్ ఆఫ్ బరోడా
  4. బ్యాంక్ ఆఫ్ ఇండియా
  5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  6. కెనరా బ్యాంక్
  7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  8. కార్పొరేషన్ బ్యాంక్
  9. దేనా బ్యాంక్
  10. ఇండియన్ బ్యాంక్
  11. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
  12. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
  13. పంజాబ్ నేషనల్ బ్యాంక్
  14. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
  15. సిండికేట్ బ్యాంక్
  16. యుకో బ్యాంక్
  17. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  18. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  19. విజయా బ్యాంక్

ఖాళీలు:

  • ఆంధ్రప్రదేశ్: 699
  • తెలంగాణ : 546

విద్యార్హత: డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్‌లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసుండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది.

వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ)-VIలో రెండు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రెండు.. మెయిన్ ఎగ్జామినేషన్.

1. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (గంట వ్యవధి):
పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఈ మూడు విభాగాల్లో విడివిడిగా కనీస మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు.
క్ర.సం.
సబ్జెక్టు
ప్రశ్నల సంఖ్య
మార్కులు
1.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
30
30
2.
న్యూమరికల్ ఎబిలిటీ
35
35
3.
రీజనింగ్ ఎబిలిటీ
35
35

మొత్తం
100
100

2. ప్రధాన పరీక్ష (మెయిన్ ఎగ్జామినేషన్):
135 నిమిషాల (2 గంటల 15 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ, మొత్తంమీద కనీస మార్కులు సాధించాలి.
సబ్జెక్టు
ప్రశ్నల సంఖ్య
మార్కులు
సమయం
రీజనింగ్
40
50
30 ని॥
ఇంగ్లిష్ లాంగ్వేజ్
40
40
30 ని॥
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
40
50
30 ని॥
జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత)
40
40
25 ని॥
కంప్యూటర్ నాలెడ్జ్
40
20
20 ని॥
మొత్తం
200
200
135 ని॥

గమనిక:

  • ఈ రెండు పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా ఇతర విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఒక తప్పు సమాధానానికి పావు(0.25) మార్కును కోత విధిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు.
  • 2016 నవంబర్/డిసెంబర్, 2017 జనవరిలో జరిగే ఈ పరీక్షలో అభ్యర్థులు పొందే స్కోర్‌ను 2018, మార్చి 31 వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వ్యాలిడిటీ ముగుస్తుంది.
  • హాల్ టికెట్‌తోపాటు ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్ ఉంటేనే అభ్యర్థిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇందులో భాగంగా తొలుత ఫొటోను, సంతకాన్ని నిర్దేశిత పరిమాణాల్లో స్కాన్ చేసి ఉంచుకోవాలి. దీంతోపాటు ఇ-మెయిల్ ఐడీ కూడా ఉండాలి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాం కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్ www.ibps.in లోని"CLICK HERE TO APPLY ONLINE FOR CWE-Clerks (CWE-Clerks-VI)'లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం "CLICK HERE FOR NEW REGISTRATION'పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వివరాలన్నీ నింపిన (ఈ క్రమంలో ఫొటోను, సంతకాన్ని అప్‌లోడ్ చేసిన) తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. ఈ వివరాలు మెయిల్‌కు, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. అప్లికేషన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసే ముందు ‘సేవ్ అండ్ నెక్ట్స్’ సదుపాయాన్ని వినియోగించుకొని, వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఫైనల్ సబ్మిట్ బటన్‌ను నొక్కిన తర్వాత అప్లికేషన్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. అందువల్ల ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయితే ఇ-రిసీట్ జనరేట్ అవుతుంది. అందులోని వివరాలను ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీనికి ముందు మార్పులూ చేర్పులకు మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100; ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు.

ముఖ్య తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2016, ఆగస్టు 22
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
  • ఫీజును ఆన్‌లైన్లో చెల్లించేందుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
  • ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 2016, నవంబర్ 18
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, నవంబర్ 26, 27; డిసెంబర్ 3, 4
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల వెల్లడి: 2016, డిసెంబర్
  • మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2016, డిసెంబర్
  • మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, డిసెంబర్ 31; 2017, జనవరి 1
  • ప్రోవిజనల్ అలాట్‌మెంట్: 2017 ఏప్రిల్

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ibps.in

143 ఖాళీలు

రాజ్యసభ సచివాలయంలో 143 ఖాళీలు

పార్లమెంట్‌లోని ఎగువ సభ (రాజ్యసభ) సచివాలయం వివిధ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో, ప్రజాప్రతినిధులు కొలువుదీరే పార్లమెంటులో ఉద్యోగం అంటే ప్రతిభను చాటుకునేందుకు పటిష్టమైన వేదికని చెప్పొచ్చు. మొత్తం ఖాళీలు 143. వాటి వివరాలు కేటగిరీల వారీగా..
Jobs
  1. జూనియర్ పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్ (4): ఇంగ్లిష్/హిందీ-1, అస్సామీ-1, మరాఠీ-1, ఉర్దూ-1. ఇందులో ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-2.
  2. జూనియర్ పార్లమెంటరీ రిపోర్టర్(8): హిందీ-4, ఇంగ్లిష్-4. ఇందులో ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-5.
  3. సీనియర్ ఎగ్జిక్యూటివ్/లెజిస్లేటివ్/కమిటీ/ ప్రొటోకాల్ అసిస్టెంట్(23): ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-5, ఓసీ-12.
  4. రీసెర్చ్ అసిస్టెంట్(8): ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-1, ఓసీ-5
  5. ఇంగ్లిష్ స్టెనోగ్రాఫర్(6): ఎస్టీ-1, ఓబీసీ-2, ఓసీ-3 ఉన్నాయి.
  6. సెక్యూరిటీ అసిస్టెంట్(16): ఎస్సీ-2, ఓబీసీ-5, ఓసీ-9.
  7. జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్(2): వీటిని ఓసీలకు రిజర్వ్ చేశారు.
  8. జూనియర్ క్లర్క్(33): ఇంగ్లిష్-30, హిందీ-2, ఉర్దూ-1. ఇందులో ఎస్సీ-7, ఎస్టీ-2, ఓబీసీ-6, ఓసీ-18.
  9. ట్రాన్స్‌లేటర్(28): ఎస్సీ-4, ఎస్టీ-1, ఓబీసీ-7, ఓసీ-16.
  10. జూనియర్ ప్రూఫ్ రీడర్(13): ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఓసీ-7.
  11. స్టాఫ్ కార్ డ్రైవర్(2): ఓబీసీ-1, ఓసీ-1.

వేతనం

  • ఇంటర్‌ప్రిటర్, రిపోర్టర్లకు రూ.15,600-39,100 పేస్కేల్‌తోపాటు రూ.5400 గ్రేడ్ పే ఉంటుంది.
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ.9300-34,800 పేస్కేల్‌తోపాటు రూ.4800 గ్రేడ్ పే చెల్లిస్తారు.
  • క్లర్క్, ప్రూఫ్ రీడర్, కార్ డ్రైవర్ పోస్టులకు రూ.5200-20,200 పేస్కేల్‌తోపాటు రూ.2800 గ్రేడ్‌పే ఇస్తారు.

విద్యార్హత - అనుభవం: పూర్తి వివరాల కోసం రాజ్యసభ వెబ్‌సైట్ చూడొచ్చు.
వయసు: 2016, ఆగస్టు 29 నాటికి ఇంటర్‌ప్రిటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు గరిష్ట వయసు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర దశల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలో సాధించాల్సిన కనీస మార్కులు, పరీక్షల సిలబస్ వంటి వివరాలను రాజ్యసభ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ఫీజు రూ.100, బ్యాంక్ చార్జీ రూ.60 చెల్లించాలి.
చివరి తేదీ: 2016 ఆగస్టు 29.
వెబ్‌సైట్:  www.rajyasabha.nic.in

Wish you Happy Independence day 2016

Saturday 6 August 2016

** HaPpY FriendshiP DaY 2016 **



There r lots of people around u

some of them r important 4 u,

out of these some people few r more important 4 u

and out of these few people

1 is most important 4 u

and

4 me that 1 is u my sweet friend.

Monday 1 August 2016

ఆధార్ న్యూస్ ...

ఆధార్ కు చరవాణి నెంబర్లు (మొబైల్ నెంబర్) అనుసందానం చేసుకోవాలి .

 

ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసందించడం ద్వార ప్రభుత్వ పథకాలను సులువుగా పొందే అవకాశం ఉందని సోమవారం యూ.ఐ.డి.ఏ.ఐ{యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ అఫ్ ఇండియా } సంస్థ కోరింది, దీని మేరకు యూ.ఐ.డి.ఏ.ఐ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆజయ్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రం లేదా మీసేవ ద్వార ఆధార్ నెంబర్ ను మొబైల్ నెంబర్ తో అనుసందించుకోండి.