Monday, 15 August 2016

19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్

19243 క్లర్క్ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్


 భాగస్వామ్య బ్యాంకులు:
ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ-VIఆధారంగా అభ్యర్థులను నియమించుకోనున్న బ్యాంకులు...
  1. అలహాబాద్ బ్యాంక్
  2. ఆంధ్రా బ్యాంక్
  3. బ్యాంక్ ఆఫ్ బరోడా
  4. బ్యాంక్ ఆఫ్ ఇండియా
  5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  6. కెనరా బ్యాంక్
  7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  8. కార్పొరేషన్ బ్యాంక్
  9. దేనా బ్యాంక్
  10. ఇండియన్ బ్యాంక్
  11. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
  12. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
  13. పంజాబ్ నేషనల్ బ్యాంక్
  14. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
  15. సిండికేట్ బ్యాంక్
  16. యుకో బ్యాంక్
  17. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  18. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  19. విజయా బ్యాంక్

ఖాళీలు:

  • ఆంధ్రప్రదేశ్: 699
  • తెలంగాణ : 546

విద్యార్హత: డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్స్‌లో తప్పనిసరిగా సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ కోర్సు చేసుండాలి. లేదా హైస్కూల్/కళాశాల/యూనివర్సిటీ స్థాయిలో కంప్యూటర్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా సరిపోతుంది.

వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష (సీడబ్ల్యూఈ)-VIలో రెండు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. రెండు.. మెయిన్ ఎగ్జామినేషన్.

1. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (గంట వ్యవధి):
పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఈ మూడు విభాగాల్లో విడివిడిగా కనీస మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు.
క్ర.సం.
సబ్జెక్టు
ప్రశ్నల సంఖ్య
మార్కులు
1.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
30
30
2.
న్యూమరికల్ ఎబిలిటీ
35
35
3.
రీజనింగ్ ఎబిలిటీ
35
35

మొత్తం
100
100

2. ప్రధాన పరీక్ష (మెయిన్ ఎగ్జామినేషన్):
135 నిమిషాల (2 గంటల 15 నిమిషాల) వ్యవధి ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు విభాగాల వారీగా నిర్దేశిత సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ, మొత్తంమీద కనీస మార్కులు సాధించాలి.
సబ్జెక్టు
ప్రశ్నల సంఖ్య
మార్కులు
సమయం
రీజనింగ్
40
50
30 ని॥
ఇంగ్లిష్ లాంగ్వేజ్
40
40
30 ని॥
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
40
50
30 ని॥
జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత)
40
40
25 ని॥
కంప్యూటర్ నాలెడ్జ్
40
20
20 ని॥
మొత్తం
200
200
135 ని॥

గమనిక:

  • ఈ రెండు పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా ఇతర విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ఒక తప్పు సమాధానానికి పావు(0.25) మార్కును కోత విధిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు.
  • 2016 నవంబర్/డిసెంబర్, 2017 జనవరిలో జరిగే ఈ పరీక్షలో అభ్యర్థులు పొందే స్కోర్‌ను 2018, మార్చి 31 వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వ్యాలిడిటీ ముగుస్తుంది.
  • హాల్ టికెట్‌తోపాటు ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్ ఉంటేనే అభ్యర్థిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇందులో భాగంగా తొలుత ఫొటోను, సంతకాన్ని నిర్దేశిత పరిమాణాల్లో స్కాన్ చేసి ఉంచుకోవాలి. దీంతోపాటు ఇ-మెయిల్ ఐడీ కూడా ఉండాలి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాం కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్ www.ibps.in లోని"CLICK HERE TO APPLY ONLINE FOR CWE-Clerks (CWE-Clerks-VI)'లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం "CLICK HERE FOR NEW REGISTRATION'పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో వివరాలన్నీ నింపిన (ఈ క్రమంలో ఫొటోను, సంతకాన్ని అప్‌లోడ్ చేసిన) తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. ఈ వివరాలు మెయిల్‌కు, మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి. అప్లికేషన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ నంబర్‌ను, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసే ముందు ‘సేవ్ అండ్ నెక్ట్స్’ సదుపాయాన్ని వినియోగించుకొని, వివరాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఫైనల్ సబ్మిట్ బటన్‌ను నొక్కిన తర్వాత అప్లికేషన్‌లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. అందువల్ల ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయితే ఇ-రిసీట్ జనరేట్ అవుతుంది. అందులోని వివరాలను ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్‌ను ప్రెస్ చేయాలి. దీనికి ముందు మార్పులూ చేర్పులకు మూడు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ చార్జీల కింద రూ.100; ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు.

ముఖ్య తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2016, ఆగస్టు 22
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
  • ఫీజును ఆన్‌లైన్లో చెల్లించేందుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 12
  • ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 2016, నవంబర్ 18
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, నవంబర్ 26, 27; డిసెంబర్ 3, 4
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల వెల్లడి: 2016, డిసెంబర్
  • మెయిన్ ఎగ్జామినేషన్‌కు హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: 2016, డిసెంబర్
  • మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు: 2016, డిసెంబర్ 31; 2017, జనవరి 1
  • ప్రోవిజనల్ అలాట్‌మెంట్: 2017 ఏప్రిల్

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ibps.in

No comments:

Post a Comment