రాజ్యసభ సచివాలయంలో 143 ఖాళీలు
పార్లమెంట్‌లోని
ఎగువ సభ (రాజ్యసభ) సచివాలయం వివిధ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో, ప్రజాప్రతినిధులు
కొలువుదీరే పార్లమెంటులో ఉద్యోగం అంటే ప్రతిభను చాటుకునేందుకు పటిష్టమైన
వేదికని చెప్పొచ్చు. మొత్తం ఖాళీలు 143. వాటి వివరాలు కేటగిరీల వారీగా..
|
వేతనం
విద్యార్హత - అనుభవం: పూర్తి వివరాల కోసం రాజ్యసభ వెబ్‌సైట్ చూడొచ్చు. వయసు: 2016, ఆగస్టు 29 నాటికి ఇంటర్‌ప్రిటర్, ట్రాన్స్‌లేటర్, ప్రూఫ్ రీడర్ పోస్టులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు గరిష్ట వయసు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర దశల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ప్రతి దశలో సాధించాల్సిన కనీస మార్కులు, పరీక్షల సిలబస్ వంటి వివరాలను రాజ్యసభ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: అప్లికేషన్ ఫీజు రూ.100, బ్యాంక్ చార్జీ రూ.60 చెల్లించాలి. చివరి తేదీ: 2016 ఆగస్టు 29. వెబ్‌సైట్: www.rajyasabha.nic.in |
No comments:
Post a Comment