Sunday 31 July 2016

TSPSC Constables Exam QuestionPaper & Key-2016

 తెలంగాణ రవాణా శాఖ, అబ్కారీ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జులై 31న రాతపరీక్ష నిర్వహించింది. ప్రశ్నల సరళిని తెలుసుకునేందుకు పరీక్షార్థుల అవగాహన కోసం ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నాం.
ఈ రాతపరీక్ష ద్వారా రవాణాశాఖలో 137, అబ్కారీ శాఖలో 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

» Question Paper and Key  

Clik Below Link.....

http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/keys/documents/TSPSC-Constables-Exam-QuestionPaper-and-Key-2016.pdf

Tuesday 19 July 2016

ఇండియన్ ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్-2017




indian-army


ఇండియన్ ఆర్మీ (ఐఏ) జడ్జ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్ కింద లా గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత/వివాహిత పురుషులు, అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
పోస్ట్ పేరు: జాగ్ ఎంట్రీ స్కీమ్( 18 వ కోర్స్ -ఏప్రిల్ 2017)
మొత్తం ఖాళీల సంఖ్య: 20 ( పురుషులు-13, మహిళలు-7)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మూడేండ్ల/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 1990 జనవరి 2 నుంచి 1996 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు17
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 15
వెబ్‌సైట్: www.indanarmy.nic.in

బ్యాంకుల్లో ...............8822 పీవో ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న 20 జాతీయబ్యాంకుల్లో 8822 పీవో/ఎంటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది.


-వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ రిటన్ ఎగ్జామ్ (VI) - 2016 నోటిఫికేషన్ ఇది. దీని ద్వారా మొత్తం 8822 పోస్టులను భర్తీ చేయనున్నారు.
-ఏయే బ్యాంకుల్లో:
 కెనరా బ్యాంక్- 2200, 
ఐడీబీఐ- 1350, 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 899,
 పంజాబ్ నేషనల్ బ్యాంక్- 750, 
అలహాబాద్ బ్యాంక్- 525, 
యూకో బ్యాంక్- 540, 
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్- 500, 
విజయాబ్యాంక్- 500, సిండికేట్ బ్యాంక్- 400, 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 300, 
ఆంధ్రా బ్యాంక్- 300,
 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 200, 
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 200,
 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 158, 
 కార్పొరేషన్ బ్యాంక్- 00, 
దేనాబ్యాంక్- 00, 
బ్యాంక్ ఆఫ్ బరోడా- 00, 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 00, 
ఇండియన్ బ్యాంక్- 00, 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 00 (మొత్తం 20 బ్యాంకులు - 8822 పోస్టులు).
-వయస్సు: 2016, జూలై 1 నాటికి 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక:ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వూ ద్వారా
-నోట్: ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్, ఖాళీలను బట్టి మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వూకు పిలుస్తారు. తుది ఎంపికకు మెయిన్స్, ఇంటర్వూలకు 80: 20 నిష్పత్తిలో వెయి ఉంటుంది.
-ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి సబ్జెక్టులోనూ, మొత్తం మీద నిర్దేశ కటాఫ్‌ను సాధించాలి.
-ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 600/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
-కొత్త అంశాలు: ఈసారి మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టు వారీగా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.
-స్కోర్ వ్యాలిడిటీ: ఈ కామన్ రిటన్ ఎగ్జామ్ (VI)లో సాధించిన స్కోరుకు 2018, మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

ముఖ్యతేదీలు:


-ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం - జూలై 26
-చివరితేదీ: ఆగస్టు 13
-ప్రిలిమినరీ పరీక్షతేదీ: అక్టోబర్ 16, 22, 23
-ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి - 2016, నవంబర్
-మెయిన్ ఎగ్జామినేషన్ - 2016, నవంబర్ 20
-మెయిన్ ఫలితాల వెల్లడి - 2016, డిసెంబర్
-ఇంటర్వూలు - 2017, జనవరి/ఫివూబవరి
-వెబ్‌సైట్: www.ibps.in

Friday 8 July 2016

415 ట్రెయినీ పైలట్ ఉద్యోగాలు.........

ఎయిర్ ఇండియా లిమిటెడ్ (ఏఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదేండ్ల (స్థిరకాల ఒప్పందంపై) వరకు ఏ-320 ఎండార్స్‌మెంట్ సీనియర్ ట్రెయినీ పైలట్స్ (పీ-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.air-india
వివరాలు: ఏఐఎల్ ఎయిర్ ఇండియా పరిధిలో పని చేస్తున్న అనుబంధ సంస్థ
పోస్టు పేరు: సీనియర్ ట్రెయినీ పైలట్స్ (ఏ-320 ఎండార్స్‌మెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 415 (జనరల్ -116, ఎస్సీ-63, ఎస్టీ-45, ఓబీసీ-191)
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన స్థాయిలో ఉత్తీర్ణత. డీజీసీఏ ఇండియా జారీచేసిన, వినియోగంలో ఉన్న సీపీఎల్/ఏటీపీఎల్, ఎఫ్‌ఆర్‌టీవో, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఏ-320 ఎయిర్‌క్రాఫ్ట్ సీపీఎల్/ఏఎల్‌టీపీ లైసెన్స్ కలిగి ఉండాలి. డబ్ల్యూపీసీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జారీచేసిన ఆర్‌టీఆర్ (ఏ/బీ, సీ), వ్యాలిడ్ ఈఎన్‌పీ (సీపీఎల్/ఏటీపీఎల్)
లైసెన్స్ కలిగి ఉండాలి
వయస్సు : 2016 ఆగస్టు 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 25,000లు స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు రూ. 80,000/-, అదనంగా ఫ్లయింగ్ అలవెన్స్‌లు గంటకు రూ.15,00-4,500 (ఫ్లయింగ్ అవర్స్ నెలకు 70 గంటలు దాటకుండా) ఒకవేళ దాటితే ఓవర్‌టైమ్ కింద గంటకు రూ. 2000-5300 అలవెన్స్‌లు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 3000/- (ఎయిర్ ఇండియా లిమిటెడ్ పేరు మీద ఢిల్లీలో చెల్లే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్‌ను తీయాలి)
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: అప్లికేషన్ స్క్రూటిని తర్వాత క్వాలిఫయింగ్ టెస్ట్‌లో భాగంగా సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దీనిని ఢిల్లీ/ముంబై, ఇతర నగరాల్లో నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులు సిమ్యులేటర్ ప్రొఫిషియెన్సీ అసెస్‌మెంట్ చెక్ (ఎస్‌పీఏసీ) కోసం హైదరాబాద్‌లోని ఏ-320 సిమ్యులేటర్, సెంట్రల్ ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిర్ ఇండియా లిమిటెడ్‌లో నిర్వహిస్తారు.
సిమ్యులేటర్‌ను చెక్ చేయటానికి ఎయిర్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ పేరు మీద రూ. 25,000/- డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్‌పీఏసీని పూర్తి చేసిన వారిని ఫైనల్ మెరిట్‌లిస్ట్‌లోకి పరిగణిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి, విద్యార్హత, అకడమిక్/టెక్నికల్ సర్టిఫికెట్‌లు, ఎక్స్‌పీరియన్స్, ఎండార్స్‌మెంట్/లైసెన్స్‌లను అటెస్టెడ్ కాపీలతో సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: General Manager (Personnel),
AirIndia Limited, Headquarters
Airlines House, 113,
Gurudwara Rakab Ganj Road,
NewDelhi-110001
వెబ్‌సైట్: www.airindia.in/careers.htm

ఆధార్ కార్డ్ ఉంటేనే రైలు ప్రయాణం

మీకు ఆధార్ కార్డు లేదా..అయితే ఇకపై మీరు రైలు ప్రయాణం చేయలేరు. మీరు రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకోవాల్సిందే..ఎందుకంటే రైల్వేశాఖ ఆ దిశగా కసరత్తులు చేస్తోంది. రైల్వే టికెట్‌కు ఆధార్‌ కార్డును అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. దానికి అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. 15 రోజుల్లో ముసాయిదా విధానం ఖరారు కానుంది. ఈ ప్రాజెక్ట్ ను రెండు దశల్లో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది


అసలైన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా వారికి మాత్రమే సబ్సిడీలు ,రాయితీలను అందించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. రాయితీలు,సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా కోత వేస్తోంది. 
తొలిదశలో రాయితీలు గల టికెట్లకు ఈ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు. వయోవృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, వికలాంగులు, విద్యార్థులు, నిరుద్యోగుల కోటా కింద ఇచ్చే రాయితీ టికెట్లకు ఆధార్‌ వివరాలు తప్పనిసరి చేస్తారు.
ఇక రెండోదశలో ముందుగా రిజర్వేషన్‌ టికెట్లపై ప్రయోగించనున్నారు. తర్వాత సాధారణ జనరల్‌ టికెట్లకూ అమలు చేయనున్నారు. మొదటిదశ అమలు చేసిన రెండునెలల తర్వాత రెండోదశను అమలు చేయాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

మీరు ఆన్‌లైన్లో టికెట్ బుక్‌చేసేటప్పుడు లేదా రైల్వే కౌంటర్లో కొనేటప్పుడు వారికి మీ ఆధార్‌కార్డు నెంబరు ఇకపై తప్పక ఇవ్వాల్సి ఉంటుంది.
నిజమైన ప్రయాణికులు మాత్రమే ప్రయాణించాలన్న ఉద్దేశంతో ఈవిధానాన్ని రూపొందిస్తున్నామని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. దేశంలో మెజారిటీ ప్రజలు ఆధార్‌ కార్డులు తీసుకున్నారు కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఎదురుకాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ప్రయోగంలో ప్రణాళిక ప్రకారం ఆధార్‌ కార్డు నెంబరును టికెట్‌పై ముద్రిస్తారు. తర్వాత ఆ నెంబర్‌ను టికెట్‌ ఎగ్జామినర్‌ వద్దనున్న ప్రత్యేక మొబైల్‌కు పంపిస్తారు. దాంతో ప్రయాణ సమయంలో టీసీ ఆ ప్రయాణికుని దగ్గరకు తనిఖీ కోసం వెళ్లి ఆధార్‌ కార్డు వివరాలు పరిశీలిస్తారు.

ఇప్పుడు ఒక ప్రయాణికునికి రైల్వేశాఖ 43 శాతం దాకా సబ్జిడీ అందిస్తోంది. అంటే ప్రయాణికునికి రైల్వేశాఖ నుంచి అయ్యే ఖర్చు 100 అయితే అందులో రూ. 57 రూపాయలు మాత్రమే రైల్వే శాఖకు చేరుతోంది.

ఈ ఖర్చును సాధ్యమైనంతగా తగ్గించాలని రైల్వేశాఖ ఎప్పటినుంచో కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే ఆధార్ ను తప్పనిసరి చేయాలనే ప్లానింగ్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రయాణానికి అయ్యే ఖర్చు వివరాలను రాయితీ టికెట్లపై ముద్రిస్తున్నారు

ఈ ప్రయోగంతో ఒకరి టికెట్‌పై మరొకరు ప్రయాణించడాన్ని ఇకపై నివారిస్తామని రైల్వేశాఖ చెబుతోంది. అయితే, ఈ విధానాన్ని రూపొందించే ముందు రైల్వేలో న్యాయపరమైన చర్చలు జరిగాయని తెలిసింది.

పీడీఎస్‌, ఎల్పీజీ కనెక్షన్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఆధార్‌లంకెపై తర్జనభర్జనలు జరిగాయి. అయితే ఆధార్‌ అనుసంధానం కేసు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఇంకా పెండింగ్‌లో ఉంది.

మరి ఇది ముందు ముందు రైల్వేశాఖ నుంచి అమలవుతుందా.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరి.

Thursday 7 July 2016

32 అంగుళాల టీవీ .................రూ.9,900 కే



ఢిల్లీ: రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ తాజాగా.. రూ.9,900కు ఎల్ఈడీ టీవీని ఆవిష్కరించింది. గతంలో తాము విడుదల చేసిన రూ.251 స్మార్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251 డెలివరీలు రేపటి నుంచి ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ మోహిత్ గోయల్ గురువారం నాడు వెల్లడించారు. Ringing Bells Freedom 251 LED TV launched for Rs 9,900 ఈ రోజు న్యూఢిల్లీలో ఎల్ఈడీ టీవీలను ఆవిష్కరించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఎల్ఈడీ టీవీతో పాటే మూడు రకాల ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాము విడి భాగాలను తెచ్చి వాటితో ఉత్పత్తులను తయారు చేస్తున్నామన్నారు. అన్ని ఖర్చులనూ లెక్కించిన తర్వాతనే ధరలను నిర్ణయిస్తున్నామన్నారు. హిట్, కింగ్, బాస్, రాజా పేరిట నాలుగు ఫీచర్ ఫోన్లను రూ.699 నుంచి రూ.1099 ధరల మధ్య, ఎలిగెంట్ 3జీ ఫోన్‌ను రూ.3,999కు, ఎలిగెంట్ 4జీ ఫోన్‌ను రూ.4,999కు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎల్ఈడీ టీవీల డెలివరీని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు.

Tuesday 5 July 2016

SCCL సింగరేణి కాలరీస్





ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం(ఖమ్మం).. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమేనేజ్‌మెంట్ ట్రైనీ : 10
అర్హత:
సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత.

జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్: 4
అర్హత:
ఎమ్మెస్సీ(అగ్రి)/ ఫారెస్ట్రీ/ హార్టి కల్చర్. లేదా ఫారెస్ట్ రేంజర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు, ఫారెస్ట్ ఇతర విభాగాల్లో సమాన హోదాలో పనిచేస్తూ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (పురుషులు మాత్రమే) :163
అర్హత:
మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

వెల్డర్ ట్రైనీ (పురుషులు మాత్రమే) : 46
అర్హత:
పదో తరగతితోపాటు వెల్డర్ విభాగంలో ఐటీఐ చదివి ఉండాలి.

ఫిజియోథెరపిస్ట్ : 4
అర్హత:
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ.

జూనియర్ టెక్నీషియన్(ఎక్స్ రే) : 4
అర్హత:
ఇంటర్/ తత్సమాన ఉత్తీర్ణతతో ‘రేడియోలాజికల్ అసిస్టెంట్’ సర్టిఫికెట్ కోర్సు చదివి ఉండాలి.

ఫార్మాసిస్ట్ : 7
అర్హత:
ఫార్మసీలో డిప్లొమా లేదా ఇమేజ్ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణత.

జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ : 4
అర్హత:
జువాలజీ/బోటనీ విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.scclmines.com

APSRTC -ఏపీఎస్‌ఆర్టీసీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)... కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ రీజియన్లలో స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ఎస్సీ/ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Jobsపోస్టులు: డ్రైవర్ , కండక్టర్, మెకానిక్స్, ట్రిమ్మర్, బ్లాక్‌స్మిత్, పెయింటర్ తదితర.
రీజియన్లు: విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి (చిత్తూరు), నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు.
ఖాళీలు: 1467.
దరఖాస్తుకు చివరి తేది: జూలై 25
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.