న్యూమరాలజీ...ఇప్పుడు మంచి ట్రెండింగ్ టాపిక్, పేర్లలో కొన్ని
అక్షరాలను తొలగించడమో..లేక కొత్త అక్షరాలను కల్పించడమో
జరుగుతుంది.నవగ్రహాలు తొమ్మిది. అలాగే సంఖ్యలు 9. ఈ తొమ్మిదితో మనిషి జీవిత
విశేషాలు, వివాహం, వాహనం, ఆరోగ్యమే కాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు.
సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ గుణిస్తే తొమ్మిదిలోపు రాగలవు. ఉదాహరణ 20ని
తీసుకున్నప్పుడు అందులో "0" కి విలువలేదు. అందువల్ల 2 అవుతుంది. 0 కి
తదుపరి వచ్చే సంఖ్యలే లెక్కకు వస్తాయి. కనుక ఎన్ని సంఖ్యలు ఉన్నా మొత్తం
తొమ్మిదిలోపే వస్తాయి. ఈ శాస్త్రాన్నే న్యూమరాలజీ లేదంటే సంఖ్యా శాస్త్రం
అంటారు.
పెద్ద సంఖ్యలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడినట్లయితే మరలా 9 సంఖ్యలోపు
ఏర్పడగదలదు. ఉదా: 10-2-1948 ఉన్నాయనుకోండి. అది 1+0+2+1+9+4+8= 25
అవుతుంది. తిరిగి ఈ రెండు సంఖ్యలను కూడగా 2+5= 7 అవుతుంది. ఇలాగే ఎన్నివేల
సంఖ్యలు కూడినా 9లోపే వస్తాయి.
ఈ శాస్త్రానికి ముఖ్యంగా 9 గ్రహాలు ఉండటం వల్ల మరియు ఎన్నివేల సంఖ్యలను
కూడినా 9 లోపు రావటం వల్ల, ఒక్కొక్క సంఖ్య అమర్చబడింది. అంటే రవికి 1వ
సంఖ్య, చంద్రునికి 2వ సంఖ్య, గురువుకు 3వ సంఖ్య, రాహువుకు 4, బుధునికి 5,
శుక్రునికి 6, కేతువుకు 7, శనికి 8, కుజునికి 9వ సంఖ్య వచ్చింది. సంఖ్యా
శాస్త్రం వీటి ఆధారంగానే ఏర్పడింది.
ఈ సంఖ్యా శాస్త్రం ద్వారా మనిషియొక్క భూత, వర్తమాన భవిష్యత్తు కాలమునకు
సంబంధించిన గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి ఏ సంఖ్య కలసి
వస్తుంది... వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది... ఇత్యాది అంశాలను తేలికగా
గ్రహించవచ్చు.
ఈ శాస్త్రాన్ని మూడు రకాలుగా విభజించారు.
1. జన్మ తేదీని బట్టి చూచుకొను విధానం:
ఈ విధానంలో పుట్టిన సంవత్సరం లేదా నెల కానీ చాలా ముఖ్యం. అంటే 1వ తేదీన
జన్మించినవారు 1వ సంఖ్య వారవుతారు. అదేవిధంగా 23వ తేదీన జన్మించినవారు
2+3=5వ సంఖ్యవారవుతారు.
2. జనన తేదీ, నెల, సంవత్సరం:
ఈ మూడింటిని కూడగా వచ్చిన సంఖ్యను, మరలా వాటిని కూడగా వచ్చిన సంఖ్యను బట్టి
వారు ఏ సంఖ్యవారో చెప్పవచ్చు. ఉదా: 1953-7-1 తేదీన జన్మించారనుకోండి...
అప్పుడు 1+9+5+3+7+1= 26 అవుతుంది. వాటిని మళ్లీ కూడగా 2+6= 8 వస్తుంది
కనుక వారు 8వ సంఖ్యవారవుతారు. న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి మీ
వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. మరి అదేలాగో తెలుసుకుందాం...
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 1 అయితే పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా
కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి
ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు
ఎదుర్కొంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 2 అయితే వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు.
లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు
ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది
పెడతారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 3 అయితే వీరు ఎల్లప్పుడూ సాహసాలను చేయాలని కోరుకుంటారు. ఇతరుల
పట్ల మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటారు. ఇతరులను పాజిటివ్ దిశగా
నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 4 అయితే వీరిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ దాని గురించి
వారికి తెలియదు. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అప్పుడప్పుడు
విఫలమవుతుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 5 అయితే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త విషయాలను
నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో
ఓర్పు నశిస్తుంది. ఓర్పును జయించి కష్టపడితే విజయాన్ని సొంతం
చేసుకోగలుగుతారు
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 6 అయితే వీరు ఎల్లప్పుడూ తాము చేసే పనిలో కచ్చితత్వం
కోరుకుంటారు. ఇది వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. అయితే వీరు ఇతరుల
పట్ల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ వారికి సహాయం చేస్తారు. ఇది వారికి
మరింత ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టుదలకు పోతుంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 7 అయితే వీరు మంచి ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. తెలివైన
నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మక మనసు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా
వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపూరితంగా ఉంటారు.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 8 అయితే వ్యాపారంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అదే
ధ్యాసలో ఉంటారు. వీరు మంచి పరిపాలన నైపుణ్యాలు కలిగి ఉంటారు. అయితే కొన్ని
సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంతో అది వారి కొంప ముంచే
అవకాశం ఉంటుంది.
న్యూమరాలజీని బట్టి మీరు ఎలాంటి వారు చెప్పేయవచ్చు.
బర్త్ నంబర్ 9 అయితే వీరు సృజనాత్మకమైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇతరులకు
వీరు ప్రేరణగా నిలుస్తారు. అయితే సొంత విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపరు.
No comments:
Post a Comment