Wednesday 24 October 2018

కెన‌రా బ్యాంకులో 800 పీవో పోస్టులు (చివ‌రి తేదీ: 13.11.2018)

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన కెన‌రా ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. వివిధ ద‌శ‌ల్లో ఎంపికైన అభ్య‌ర్థులు మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌- బెంగ‌ళూరు లేదా ఎన్ఐటీటీఈ ఎడ్యుకేష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైవేట్ లిమిటెడ్‌- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్(జేఎంజీఎస్‌-1) హోదాతో కెన‌రా బ్యాంక్‌లోకి తీసుకుంటారు.
మొత్తం ఖాళీలు: 800 (జ‌న‌ర‌ల్‌-404, ఓబీసీ-216, ఎస్సీ-120, ఎస్టీ
-60)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు సాధించాలి
.
వ‌య‌సు: 01.10.2018 నాటికి 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
.
ఎంపిక‌: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ
.708.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ:
13.11.2018.
ప‌రీక్ష తేదీ:
23.12.2018.
ప‌రీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో.. హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.



No comments:

Post a Comment