Monday, 13 August 2018

TSPSC Upcoming Notification

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ కు సిద్దమైంది. త్వరలోనే 6,603 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ఇటీవలే తండాలను, గిరిజన గ్రామాలను గ్రామపంచాయితీలుగా మార్చిన విషయం తెలిసిందే. 500 జనాభాను మించిన ప్రతి గ్రామాన్ని పంచాయతీగా మార్చారు. దీంతో నూతనంగా దాదాపు 4,383 గ్రామ పంచాయ‌తీల‌ు ఏర్పడ్డాయి. ఇలా పాతవి, కొత్తవి కలుపుకుని మొత్తం 12,741 పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి.

అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను కూడా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అధికారులతో సమావేశమై వెంటనే సీఎం ఆదేశాల దిశగా పనిచేయాలని సూచించారు.

దీంతో కొత్త, పాత పంచాయితీలకు కలిపి 6,603 పంచాయతీ కార్యదర్శులు అవసరముంటారని అధికారులు ప్రభుత్వానికి నివేధిక అందించారు. దీనికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపింది. అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

No comments:

Post a Comment