Friday, 2 September 2016

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో ..........279 పోస్టులు

ఎస్‌ఎస్‌సీలో279 పోస్టులు

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌ీసీ) ఈస్టర్న్ రీజియన్ ప్రకటనను విడుదల చేసింది. పదో తరగతి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు గల అభ్యర్థులకు ఇందులో పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 279
ఖాళీల వివరాలు...
  1. జూనియర్ ఇంజనీర్ (క్వాలిటీ అస్యూరెన్స్)- 105 (అమ్యునిషన్-40, వెపన్స్ -14, ఇన్‌స్ట్రుమెంట్స్-7, స్మాల్ ఆర్మ్స్-24, మెటలర్జీ-20).
  2. సైంటిఫిక్ అసిస్టెంట్-66 (మెకానికల్-9; కెమికల్-28; రబ్బర్, ప్లాస్టిక్, టెక్స్‌టైల్-5, ఎలక్ట్రికల్-8, సివిల్-13, నాన్ డిస్ట్రక్టివ్-3).
  3. ఆఫీస్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్)-40.
  4. ఫీల్డ్ అటెండెంట్-19
  5. ల్యాబ్ అసిస్టెంట్-19
  6. రీసెర్చ్ అసిస్టెంట్-5
  7. జూనియర్ కెమిస్ట్-5
  8. సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ (వీవింగ్)-4
  9. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్-4
  10. జూనియర్ జియోగ్రాఫికల్ అసిస్టెంట్-2
  11. డిప్యూటీ రేంజర్-2
  12. అసిస్టెంట్ ఆర్కైవిస్ట్-1
  13. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-1
  14. డూప్లికేటింగ్ మెషిన్ ఆపరేటర్-1
  15. ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1
  16. స్పీచ్ థెరపిస్ట్-1; 17. లైబ్రరీ క్లర్క్-1
  17. మెట్రోలాజికల్ అసిస్టెంట్-1
  18. హెరాల్డిక్ అసిస్టెంట్-1.

విద్యార్హత-అనుభవం:
  1. జూనియర్ ఇంజనీర్: అమ్యునిషన్ విభాగం పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్). వెపన్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్ (లేదా) ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ప్రొడక్షన్/మెషిన్ అండ్ టూల్స్). స్మాల్ ఆర్మ్స్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ (లేదా) డిప్లొమా(మెకానికల్ ఇంజనీరింగ్). మెటలర్జీ పోస్టులకు బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) (లేదా) డిప్లొమా (మెటలర్జికల్ ఇంజనీరింగ్). జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి.
  2. సైంటిఫిక్ అసిస్టెంట్: కెమికల్ విభాగం పోస్టులకు పీజీ (కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ) (లేదా) కెమికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బీఈ/బీటెక్, రెండేళ్ల పని అనుభవం. సివిల్ పోస్టులకు పీజీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ), రెండేళ్ల పని అనుభవం.
  3. ఆఫీస్ అటెండెంట్: పదో తరగతి/తత్సమానం.
  4. లేబొరేటరీ అసిస్టెంట్: 10+2 (లేదా) బయాలజీతో తత్సమాన విద్యార్హత. జువాలజీ ల్యాబ్‌కు సంబంధించిన పని అనుభవం.
  5. ఫీల్డ్ అటెండెంట్: పదో తరగతి (లేదా) తత్సమానం.
వయసు : జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 18-30 ఏళ్లు; ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు 18-27 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
వేతనం: జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌లకు రూ.9,300-34,800+గ్రేడ్‌పే. ఫీల్డ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, లేబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.5,200-20,200+గ్రేడ్‌పే.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులను బట్టి ఒక్కో పోస్టుకు 25 మంది చొప్పున రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తారు. ఒక తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ తదితర పరీక్షలు నిర్వహిస్తారు.

రాత పరీక్ష :
  1. పదో తరగతి విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున; జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి.
  2. ఇంటర్మీడియెట్ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ అనే నాలుగు సబ్జెక్టుల నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. యూజీ/పీజీ విద్యార్హతగా పేర్కొన్న పోస్టులకు కూడా రాత పరీక్ష ఇదే తరహాలో ఉంటుంది. అయితే ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్‌తోపాటు రీజనింగ్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే అప్లికేషన్లను వేర్వేరుగా సమర్పించాలి. పరీక్ష రుసుం కూడా విడివిడిగా చెల్లించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్‌కు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత, వయసు, అనుభవం తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి.

చిరునామా :
ది రీజనల్ డెరైక్టర్ (ఈఆర్), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈస్ట్ రీజియన్, నిజాం ప్యాలెస్, ఫస్ట్ ఎంఎస్‌వో బిల్డింగ్, ఎనిమిదో అంతస్తు, 234/4, ఏజేసీ బోస్ రోడ్డు, కోల్‌కతా, 700020.

పరీక్ష రుసుం : ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థులు మాత్రమే రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు నింపేందుకు, ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు చివరి తేది: 2016, సెప్టెంబర్ 26.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటౌట్ రీజనల్ ఆఫీసుకు చేరాల్సిన తేది: 2016, సెప్టెంబర్ 26 నుంచి పది రోజుల్లోపు.
వెబ్‌సైట్: ssconline.nic.in/sscselectionpost
l సింగిల్ డిజిట్ ఖాళీలున్న ఉద్యోగాల విద్యార్హత, వయసు, అనుభవం, వేతనం తదితర వివరాలకుకింది వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.sscer.org

No comments:

Post a Comment