Saturday 17 September 2016

ఢిల్లీ పోలీస్‌లో 4669 టెంపరరీ కానిస్టేబుల్స్(

ఢిల్లీ పోలీస్‌లో 4669 టెంపరరీ కానిస్టేబుల్స్(ఎగ్జిక్యూటివ్)

ఢిల్లీ పోలీస్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో టెంపరరీ కానిస్టేబుల్స్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsఖాళీలు: 4669
కానిస్టేబుల్ (పురుషులు): 3115 (అన్‌రిజర్వుడ్ - 1557, ఓబీసీ - 847, ఎస్సీ - 473, ఎస్టీ-238)
కానిస్టేబుల్ (మహిళలు): 1554 (అన్‌రిజర్వుడ్ - 815, ఓబీసీ- 443, ఎస్సీ-250, ఎస్టీ - 46)
అర్హత: 10+2 ఉత్తీర్ణత . ఫురుషులు వ్యాలీడ్ డ్రైవింగ్ లెసైన్స్ (మోటార్ సైకిల్/కార్) కలిగి ఉండాలి.
వయోపరిమితి: జూలై 1, 2016 నాటికి పురుషులకు 18-21 ఏళ్లు, మహిళలకు 18-25 ఏళ్లు. వేతన శ్రేణి: రూ.5200- రూ.2020 (గ్రేడ్ పే రూ.2000)
శారీరక ప్రమాణాలు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులు 170 సెం.మీ ఎత్తు, ఛాతీ 81 సెం.మీ, గాలి పీల్చుకుని ఛాతీ విస్తరిస్తే 85 సెం.మీ ఉండాలి. జనరల్/ఓబీసీ మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి.
పరీక్ష విధానం: శారీరక ప్రమాణాల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్)ల్లో అర్హులైనవారికి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. గంటన్నర (90 నిమిషాలు) వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ (35 ప్రశ్నలు, 35 మార్కులు), జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ (50 ప్రశ్నలు, 50 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (15 ప్రశ్నలు, 15 మార్కులు) ఉంటాయి. మొత్తం ప్రశ్నలు 100, మొత్తం మార్కులు 100.
శారీరక సామర్థ్య పరీక్ష: మొదటి దశలో 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహిస్తారు. పురుషులు ఆరు నిమిషాల్లో, మహిళలు 8 నిమిషాల్లో పరుగెత్తాలి. తర్వాత పురుషులకు 14 ఫీట్, మహిళలకు 10 ఫీట్ లాంగ్‌జంప్ ఉంటుంది. అదేవిధంగా పురుషులకు 3.9 ఫీట్, మహిళలకు 3.0 ఫీట్ హైజంప్ ఉంటుంది.
ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.100 ఎస్‌బీఐ చలాన్, నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ssconline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 10, 2016
ఫీజు చెల్లించడానికి చివరి తేది: అక్టోబర్ 13, 2016
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: మార్చి 4, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: ssc.nic.in

No comments:

Post a Comment