Monday 12 September 2016

నవోదయలో 2072 పోస్టులు............

నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: నవోదయ విద్యాలయ సమితి కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ. దేశంలోని ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 2072
విభాగాల వారీగా ఖాళీల వివరాలు...

అసిస్టెంట్ కమిషనర్


-ఖాళీల సంఖ్య - 2. వీటిలో జనరల్ - 1, ఓబీసీ - 1 ఉన్నాయి. వీటిలో ఒకటి పీహెచ్‌సీ కేటగిరీకి కేటాయించారు.
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 7,600/-
అర్హతలు: హ్యూమనిటీస్ / సైన్స్ లేదా కామర్స్‌లో పీజీతోపాటు కనీసం ఐదేండ్లపాటు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రభుత్వ లేదా సెమీ గవర్నమెంట్ లేదా అటానమస్ సంస్థల్లో పనిచేసి ఉండాలి.
వయస్సు: 2016, జూలై 31నాటికి 45 ఏండ్లు మించరాదు.

ప్రిన్సిపాల్


-ఖాళీల సంఖ్య - 40. వీటిలో జనరల్ - 22, ఓబీసీ - 10, ఎస్సీ - 6, ఎస్టీ - 2 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 15,600 - 39, 100 + గ్రేడ్ పే రూ. 7,600/-
వయస్సు: 35 -45 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఎడ్ లేదా టీచింగ్‌లో తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. వీటితోపాటు అనుభవం ఉండాలి.

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)


-ఖాళీల సంఖ్య - 880. సబ్జెక్టుల వారీగా ఖాళీలు...
-బయాలజీ - 77. వీటిలో జనరల్ - 44, ఓబీసీ - 17, ఎస్సీ - 15, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
-కెమిస్ట్రీ - 90. వీటిలో జనరల్ - 46, ఓబీసీ - 12, ఎస్సీ - 15, ఎస్టీ - 17 ఖాళీలు ఉన్నాయి.
-కామర్స్ - 52. వీటిలో జనరల్ - 20, ఓబీసీ - 15, ఎస్సీ - 11, ఎస్టీ - 6 ఖాళీలు ఉన్నాయి.
-ఎకనమిక్స్ - 112. వీటిలో జనరల్ - 44, ఓబీసీ - 23, ఎస్సీ - 33, ఎస్టీ - 12 ఖాళీలు ఉన్నాయి.
-ఇంగ్లిష్ - 76. వీటిలో జనరల్ - 32, ఎస్సీ - 11, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-జాగ్రఫీ - 56. వీటిలో జనరల్ - 32, ఓబీసీ - 9, ఎస్సీ - 10, ఎస్టీ - 5 ఖాళీలు ఉన్నాయి.
-హిందీ - 56. వీటిలో జనరల్ - 57, ఎస్సీ - 12, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-హిస్టరీ - 70. వీటిలో జనరల్ - 48, ఓబీసీ - 8, ఎస్సీ - 9, ఎస్టీ - 5 ఖాళీలు ఉన్నాయి.
-మ్యాథ్స్ - 117. వీటిలో జనరల్ - 36, ఓబీసీ - 25, ఎస్సీ - 31, ఎస్టీ - 25 ఖాళీలు ఉన్నాయి.
-ఫిజిక్స్ - 102. వీటిలో జనరల్ - 49, ఓబీసీ - 19, ఎస్సీ - 15, ఎస్టీ - 19 ఖాళీలు ఉన్నాయి.
-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 50. వీటిలో జనరల్ - 33, ఎస్సీ - 7, ఎస్టీ - 10 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34, 800 + గ్రేడ్ పే రూ. 4,800/-
వయస్సు: 40 ఏండ్లు మించరాదు.
అర్హతలు:కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో రెండేండ్ల పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఐటీ పోస్టుకు మాత్రం బీఎడ్ అవసరం లేదు. ఇంగ్లిష్, హిందీలో ప్రావీణ్యత ఉండాలి.

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)


-ఖాళీల సంఖ్య - 660. సబ్జెక్టుల వారీగా ఖాళీలు...
-ఇంగ్లిష్ - 159. వీటిలో జనరల్ - 77, ఓబీసీ -26, ఎస్సీ - 19, ఎస్టీ - 37 ఖాళీలు ఉన్నాయి.
-హిందీ - 132. వీటిలో జనరల్ - 78, ఓబీసీ - 28, ఎస్సీ - 18, ఎస్టీ - 8 ఖాళీలు ఉన్నాయి.
-మ్యాథ్స్ - 229. వీటిలో జనరల్ - 99, ఓబీసీ -20, ఎస్సీ - 51, ఎస్టీ - 59 ఖాళీలు ఉన్నాయి.
-సైన్స్ - 72. వీటిలో జనరల్ - 35, ఓబీసీ - 6, ఎస్సీ - 9, ఎస్టీ - 22 ఖాళీలు ఉన్నాయి.
-సోషల్ స్టడీస్ - 68. వీటిలో జనరల్ - 49, ఓబీసీ - 8, ఎస్సీ - 2, ఎస్టీ - 9 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
అర్హతలు: రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. లేదా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో బోధనా సామర్థ్యం కలిగి ఉండాలి. కొన్ని సబ్జెక్టులకు ఆయా ప్రాంతాల స్థానిక భాషల్లో బోధన చేయాలి. సీబీఎస్‌ఈ నిర్వహించిన సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి.

మిసిలీనియస్ కేటగిరీ


-ఖాళీల సంఖ్య - 255. విభాగాల వారీగా...
-మ్యూజిక్ - 41. వీటిలో జనరల్ - 14, ఓబీసీ - 21, ఎస్సీ - 2, ఎస్టీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-ఆర్ట్ - 50. వీటిలో జనరల్ - 20, ఓబీసీ - 26, ఎస్టీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-పీఈటీ (పురుషులు) - 28. వీటిలో జనరల్ - 12, ఓబీసీ - 16, ఖాళీలు ఉన్నాయి.
-పీఈటీ (మహిళలు) - 91. వీటిలో జనరల్ - 54, ఓబీసీ - 21, ఎస్సీ - 8, ఎస్టీ - 8 ఖాళీలు ఉన్నాయి.
-లైబ్రేరియన్ - 45. వీటిలో జనరల్ - 35, ఓబీసీ - 10 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4, 600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-లైబ్రేరియన్ పోస్టుకు లైబ్రెరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిగ్రీ తర్వాత లైబ్రెరీ సైన్స్‌లో ఏడాది కాలపరిమితిగల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్, హిందీలో లేదా స్థానిక భాషలో పనిచేసే సామర్థ్యం కలిగి ఉండాలి.

టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)


-ఖాళీల సంఖ్య - 235.
-వీటిలో తెలుగు - 4 (ఎస్టీ కేటగిరీలో) ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300 - 34, 800 + గ్రేడ్ పే రూ. 4,600/-
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా
-సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఎడ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో బోధించాలి. వీటితోపాటు సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి.
నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, మహిళలకు 10 ఏండ్లు (అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్స్‌పాల్ పోస్టులకు మాత్రం సడలింపు లేదు), నవోదయ ఉద్యోగులకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టీజీటీ, మిస్‌లీనియస్ (లైబ్రెరీ), టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు మాత్రం కేవలం రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-రాతపరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 42 కేంద్రాల్లో నిర్వహిస్తారు. మనకు దగ్గర్లోని కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం.

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: అసిస్టెంట్ కమిషనర్ - రూ. 1,500/-, ప్రిన్స్‌పాల్ - రూ. 1,500/, పీజీటీ, టీజీటీ, మిసిలీనియస్, రీజనల్ లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు రూ. 1,000/-
-చివరితేదీ: అక్టోబర్ 9
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 14
-రాతపరీక్ష: 2016 నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
-వెబ్‌సైట్: www.nvshq.org / www.mecbsegov.in

No comments:

Post a Comment