Tuesday, 15 March 2016

ప్రకృతి వరం కొబ్బరి బోండాం...

వేసవితాపాన్ని తట్టుకునేందుకు అనేక మంది కూల్‌డ్రింక్స్‌ను ఇష్టానుసారంగా తాగుతుంటారు. మరికొందరైతే సాయంత్రానికి మద్యపానానికి అలవాటుపడతారు. నిజానికి వేసవి కాలంలో ఇలాంటి వాటి కంటే.. కొబ్బరి నీరు ఎంతో శ్రేష్టకరమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేయడమేకాకుండా, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుందని వారు చెపుతున్నారు. వేడిని, దాహాన్ని తగ్గించే కొబ్బరిబొండాంలో సహజ ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. 
 
ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. ఒక కొబ్బరి బోండాంలోని నీరు ఒక సెలైన్‌ వాటర్‌ బాటిల్‌తో సమానమని వైద్యులు చెపుతున్నారు.

No comments:

Post a Comment