టెక్నాలజీ రోజు రోజుకు ముందుకు దూసుకుపోతోంది. దానికి తగ్గట్లుగానే 1జీ, 2జీ, 3జీ అంటూ ఒక్కో జనరేషన్ అమితవేగంతో ముందుకు దూసుకొస్తోంది.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 4జీ పూర్తి స్థాయిలో రానే లేదు..ఇప్పుడు 5జీ అంటూ ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతోంది. అసలింతకీ ఏంటీ ఈ నెట్‌వర్క్‌లు.. ఈ జనరేషన్‌లు.. వీటివల్ల ఉపయోగాలు ఏంటీ.. అవి ఎలా పనిచేస్తాయి.. అసలు జీ అంటే ఏమిటీ..
ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడా జీ అంటే జనరేషన్ అని అర్థం. కుప్తంగా చెప్పాలంటే ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడాను తెలుపుతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.
మొదటి తరం (1G ) 1980- 19990 మధ్య కాలం ఈ జనరేషన్ అంతా మీకు అన్ లాగ్ పద్దతిలో ఉంటుంది. అంటే మీరు సిగ్నల్స్ పంపించడం కాని అలాగే తీసుకోవడం కాని మొత్తం అన్‌లాగ్ పద్దతే.. ఈ జనరేషన్‌లోని డేటాలో మీరు కాల్ అలాగే టెక్ట్స్ మెసేజ్ మాత్రమే పంపే వీలుంటుంది
మొదటి తరం (1G ) 1980- 19990 మధ్య కాలం 1980- 19990 మధ్య కాలంలో ఈ జనరేషన్ పనిచేయడం ప్రారంభించింది. దీని వేగం దాదాపు 2.4 kbps వరకు ఉంటుందని అంచనా.. అయితే ఈ జనరేషన్ లో ఫోన్ లో ధ్వని తక్కువ కావడం అలాగే ఫోన్ సైజు చాలా పెద్దదిగా ఉండటంతో పాటు పరిమిత మైన సేవలు ఉండేవి
రెండవ తరం (2G) 1991 ఈ జనరేషన్ మొట్టమొదటగా ఫిన్ ల్యాండ్ లో ప్రారంభమైంది. ఈ దశలో సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండేవి కాబట్టి మీరు కాల్స్ అలాగే డేటానే ఎక్కడికైనా సులభంగా పంపుకునే వీలు ఉండేది. ఈ 2జీ నెట్ వర్క్ ఉన్న ఫోన్ ని మీరు ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాడుకునే వీలుంది.
రెండవ తరం (2G) 1991 ఇలా వాడుకోవాలంటే రోమింగ్ ఛారీలు చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే మొదటి తరం ఫోన్లు అని చెప్పవచ్చు. వీటి సరాసరి వేగం 64 kbps.అయితే ఈ జనరేషన్లో వీడియో మెసేజ్ లకు ఛాన్స్ లేదు.
మూడవ తరం (3G) ఇది అసలైన జనరేషన్..ఇక్కడి నుంచే అసలైన యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. సెల్ ఫోన్లతో ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఈజనరేషన్ నుంచే వచ్చింది. ఈ జనరేషన్ లో సెల్ ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్లు కూడా రావడం మొదలయ్యాయి. డేటా స్పీడు 144 Kbps to 2mbps వరక ఉంటుంది
మూడవ తరం (3G) ఈ జనరేషన్ లోనే మనకు వీడియో కాలింగ్ , వాయిస్ కాలింగ్ , ఫైల్ ట్రాన్సిమిషన్ ,ఇంటర్నెట్ సెర్చింగ్ ,ఆన్ లైన్ టీవీ ఇంకా గేమ్స్ అన్ని రకాల సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నవారికి 3జీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.
నాలుగవ తరం (4G) ఇది ఓ మ్యాజిక్ లాంటిది. 3జీ ఓవరమయితే ఇది అంతకుమించిన పెద్ద వరం. 3జీలో డాటా ట్రాన్సఫర్ కన్నా 4జీలో చాలా ఫాస్ట్ గా అవుతుంది. అక్కడ 144 Kbps to 2mbps ఉంటే అది 4జీకి వచ్చేసరికి 100 mbps నుంచి 1Gbps వరకు వచ్చింది.
నాలుగవ తరం (4G) దాదాపు చాలాదేశాల్లో ఈ నాలుగవ తరం వాడుకలోకి వచ్చింది. అయితే ఈ జనరేషన్లో ఫోన్ బ్యాటరీ దెబ్బకు అయిపోతుంది. మీరు అన్ని రకాల సదుపాయాలు వాడుకునే వీలుంది కాని..హీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు..క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక మొబైల్ బ్రాండ్ అంతే..దీని వేగం చాలా ఎక్కువ కాబట్టి బ్యాటరీ కూడా అంతే వేగంతో అయిపోతుంది.
ఐదవ తరం (5G) ఈ తరం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది. దీనికి అసలు హద్దులే లేవు. ఇది పూర్తిగా వైర్ లెస్ టెక్నాలజీతో కూడుకున్నది. 4జీ httpని సపోర్ట్ చేస్తే 5G WWWW Wireless World Wide webకు కూడా సపోర్ట్ చేస్తుంది.
2జీ- 3జీ మధ్యలో ఓ తరం మీకు తెలియకుండా 2జీ -3జీ మధ్యలో ఓ తరం ఉంది. అదే 2. 5జీ ఈ తరంలో చాలా తక్కువ స్థాయిలో ఫోన్లు రేడియో తరంగాల ద్వారా పనిచేయడం ప్రారంభించాయి. ఈతరం నుంచే మనకు జేబులో పట్టే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ వేగం 64 kbps నుండి 144 kbps వరకు పెరిగింది.
No comments:
Post a Comment