తమిళనాట మహాశివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున శ్మశాన కొల్ల అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పూనకం దాల్చిన వారు శ్మశానంలో మంటల్లో కాలుతున్న శవాన్ని శూలంతో పొడిచి.. శవాన్ని రుచిచూడటం సంప్రదాయం. ఈ ఇలాంటి ఘటనే తిరుచ్చి సమీపంలో అంకాళ పరమేశ్వరి ఆలయంలో చోటుచేసుకుంది. ఓ పూజారి శ్మశానంలో మండే మంటలో కాలుతున్న శవం ముక్కను టేస్ట్ చేశాడు.
ఈ దృశ్యానికి భక్తులంతా తన్మయత్వం చెందారు. తిరుచ్చి పెరియకడై వీథిలో అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలనంతరం అంకాళపరమేశ్వరి అమ్మవారి వేషధారణతో ఓ పూజారి చేత శూలం పట్టుకుని శ్మశాన కొల్లకు భక్తులంతా వెంటరాగా బయల్దేరారు. అర్థరాత్రి ఒయామారి శ్మశానంలో ప్రవేశించిన ఆ పూజరి పూనకంతో ఊగిపోయాడు.
ఆ సమయంలో శ్మశానంలో మండుతున్న ఓ శవం వద్దకు పరుగెత్తుకెళ్ళి తన వద్దనున్న శూలాయుధంతో శవాన్ని పొడిచి పైకి తీయగా ఆ శూలానికి అంటుకున్న శవ మాంసపు ముక్కను నోటిలో వేసుకుని ఆరగించాడు. ఆ తర్వాత ఆ పూజారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నాడు. ఈ ఉత్సవాలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment