భారత్‌లో 14 కోట్లు దాటిన ఫేస్‌బుక్ ఖాతాలు :
భారత్‌లో ఫేస్‌బుక్ ఖాతాలు 14.2 కోట్లు
దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీరిలో 13.3 కోట్ల మంది తమ ఖాతాలను చరవాణి ద్వారా నిర్వహిస్తున్నారని
సామాజిక అనుసంధాన వేదిక దిగ్గజం అయిన ఫేస్‌బుక్ తెలిపింది. రోజూ సుమారు 6.9 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో
ఆన్‌లైన్‌లో ఉంటున్నారని, వీరిలో చరవాణి ద్వారా వాడే వారు 6.4 కోట్ల మంది ఉన్నారని సంస్థ తెలిపింది.
అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు అతిపెద్ద మార్కెట్ భారత్ అని, డిసెంబర్ 2015 తర్వాత
ఫేస్‌బుక్‌ను వాడే క్రియాశీల యూజర్ల సంఖ్య నెలకు 159 కోట్ల మంది ఉంటున్నారని సంస్థ తెలిపింది.
అతి తక్కువ డేటాను ఉపయోగించుకునే ‘ఫేస్‌బుక్ లైట్’ యాప్ ప్రారంభించిన 9 నెలలకే ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల యూజర్లను సంపాదించుకుందని ఫేస్‌బుక్ వెల్లడించింది.
No comments:
Post a Comment