కోల్‌కతా: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన మ్యాచులో భారత్ చరిత్రను తిరగ రాసింది. ఈడెన్ గార్డెన్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించలేదనే రికార్డును తిప్పికొట్టింది. పాకిస్తాన్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 15.5 ఓవర్లలో పాకిస్తాన్ తమ ముందుంచిన 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. విరాట్ కోహ్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అయితే, ఫినిషర్ మాత్రమే కెప్టెన్ ధోనీయే. విన్నింగ్ షాట్ అతనే కొట్టాడు. ధోనీ 9 బంతుల్లో ఓ సిక్సర్ సాయంతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. పాకిస్తాన్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీశాడు. అమీర్, వాహబ్ రియాజ్ తలో వికెట్ తీశారు. పాకిస్తాన్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ భారత్ విజయాన్ని నిలువరించలేకపోయారు. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. పాకిస్తాన్ తమ ముందు ఉంచిన 119 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా భారత్ 14 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొహమ్మద్ అమీర్ బౌలింగులో అవుటయ్యాడు. భారత్ 84 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. యువరాజ్ సింగ్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాహబ్ రియాజ్ బౌలింగులో అవుటయ్యాడు. కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 23 పరుగుల స్కోరు వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ మొహమ్మద్ సమీ బౌలింగులో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ వెంటనే సురేష్ రైనా అదే స్కోరు వద్ద డకౌట్ అయ్యాడు. ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో పాకిస్తాన్ నిర్ణీత 18 ఓవర్లలో పాకిస్తాన్ 118 పరుగులు చేసింది. సర్ఫరాజ్ 8 పరుగులతో, మొహమ్మద్ హఫీజ్ 5 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, జడేజా, రైనా, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌పై భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆడిన జట్టుతోనే భారత్ మైదానంలోకి దిగింది. 105 పరుగుల వద్ద పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. షోయబ్ మాలిక్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు. 101 పరుగుల వద్ద పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఉమర్ అక్మల్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగులో అవుటయ్యాడు. పాకిస్తాన్ 60 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. పాకిస్తాన్ 46 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగులో అహ్మద్ షెహజాద్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పాకిస్తాన్ 38 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా బౌలింగులో షార్జీద్ ఖాన్ బౌలింగులో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభంలో జాప్యం జరిగింది. భారత కాలమానం ప్రకారం 8.10 గంటలకు టాస్ వేశారు. ఆల్ రౌండర్ ఇమాద్ వసీం స్థానంలో పాకిస్తాన్ తుది జట్టులోకి మొహమ్మద్ షమీ వచ్చాడు. మ్యాచును 18 ఓవర్లకు కుదించారు. జట్లు భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, బుమ్రా, ఆశిష్ నెహ్రా పాకిస్తాన్: షార్జీల్ ఖాన్, అహ్మద్ షెహజాద్, మొహమ్మద్ హఫీజ్, ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, షాహిద్ అఫ్రిదీ, మొహమ్మద్ షమీ, వాహబ్ రియాజ్, మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఇర్ఫాన్

No comments:
Post a Comment