Monday 7 March 2016

ముస్లిం ఫ్రెండ్స్

మీకు ఖచ్చితంగా ముస్లిం ఫ్రెండ్స్ ఉండాలి.............
భారతీయులంటే మంచి మంచి, రకరకాల వంటలకి ఫేమస్. అలాగే రకరకాల సంస్కృతులు, మతాల, ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం ఇండియా. అయితే ముస్లింల వంటలు మరింత నోరూరిస్తాయి. ముస్లింలు వంటల్లో ఘనాపాఠీలని చెప్పవచ్చు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముస్లింలు మాత్రమే అత్యంత రుచికరమైన బిర్యానీ చేస్తారని గట్టి విశ్వాసం ఉంది. ఇండియాలో ఇస్లాం మతస్థుల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బిర్యాని మాత్రమే కాదు ఇతర వంటలు కూడా ముస్లింలు బాగా చేస్తారు. అంతేకాదు ముస్లింలు మంచి మనసున్నవాళ్లు. కాబట్టి మీకు ముస్లింలు స్నేహితులుగా ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? అనుకోకుండా మీరు ఎప్పుడైనా ముస్లింల ఇంటికి వెళ్తే ఇంట్లో తయారు చేసిన రెండు మూడు రకాల స్వీట్లు, ఘుమ ఘుమలాడే బిర్యానీ గిన్నె పక్కన పెట్టి ఉంటాయి. హైదరాబాద్ ఎందుకంత ఫేమస్ అయింది ఇక వాళ్ల పెళ్ళిళ్లు ఎంత కలర్ ఫుల్ గా ఉంటాయో చెప్పనక్కరలేదు. డార్క్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్సుల్లో చాలా హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అసలు ముస్లింలు మీకు స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలేంటో చూద్దాం.
వాళ్లింట్లో ఆహారం: చాలా మంది ముస్లింలు ఆహార ప్రియులు. అందువల్ల ఎప్పుడూ వాళ్లింటికి వెళ్లినా నోరూరించే విభిన్న వంటకాలు డైనింగ్ టేబుల్ పై కొలువుదీరి ఉంటాయి. అన్ని రకాల పదార్ధాలు అలా అందంగా అమర్చి ఉండటం చూస్తేనే మీకు కడుపు నిండిపోతుంది
.
బిర్యాని: బిర్యానీకి పెట్టింది పేరు ముస్లింలు. ముస్లింలు చేసినంత రుచికరంగా బిర్యానీ ఎవరూ చేయలేరు. మీరు బిర్యాని ప్రియులయితే అత్యంత రుచికరమైన బిర్యానీ కోసం మీ ముస్లిం స్నేహితుని ఇంటికి వెళ్లాల్సిందే.

రకరకాల స్వీట్స్: అన్ని రకాల స్వీట్లు చూస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. మీ ముస్లిం స్నేహితుల ఇంట్లో బిర్యాని తిన్నాక మాల్పువా, రబ్రీ లేదా షీర్ కొర్మా తినడం మర్చిపోవద్దు. ఈ స్వీట్లు చేయడంలో ముస్లింలు చాలా ప్రత్యేకం.

బంగారు నగలు: ముస్లింలకి ఖరీదైన నగలు, బట్టలంటే చాలా ప్రీతి. పెళ్లిళ్లలో వధువులు ఆపాదమస్తకం బంగారంలో మునిగి తేలుతారు. అలా వారిని చూస్తే అధ్భుతంగా ఉంటుంది కదూ??
వివాహ ఆడంబరం: మీకెప్పుడైన ముస్లింల పెళ్లికి హాజరయ్యే అవకాశం వస్తే తప్పక వెళ్లండి. వారు పెళ్లిళ్లల్లో ధరించే దుస్తులు రక రకాల రంగులతో ఉండి ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటాయి.

టైమ్: ముస్లింలు ఖచ్చితమైన టైం ఫాలో అవుతారు. ఎందుకంటే.. రోజుకి 5సార్లు ప్రే చేస్తారు. అది కూడా ఖచ్చితమైన సమయానికే చేస్తారు. కాబట్టి వాళ్ల నుంచి మనం టైం సెన్స్ నేర్చుకోవచ్చు.







No comments:

Post a Comment