తిరుపతి .... ఈ ప్రదేశం గురించి వినని హిందువు, భారతీయుడు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉండరు. ప్రస్తుత కలియుగంలో భక్తుల కొంగు బంగారమై కోర్కెలను తీర్చే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయనను అందరూ ఆపదమొక్కులవాడని, శ్రీనివాసుడని, గోవిందుడని ఇత్యాది పేర్లతో పిలుస్తుంటారు. ఏవిధంగా పిలిచినా పలికే దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి. దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలో కూడా ఎంతో మంది భక్తులు ఈ స్వామి వారికి ఉన్నారు. ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక పండగ సమయాలలో, సెలవుల సమయాలలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా ..!! సరిగ్గా చెప్పాలంటే రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజ స్వామి ఆలయాన్ని నిర్మించడంతో తిరుమలకు బీజం పడిందని చరిత్రకారుల నమ్మకం. ప్రస్తుతం ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాగో చూస్తూనే ఉన్నారు. అదే మనం పుట్టనప్పుడు తిరుపతి ఎలా ఉందో ఎప్పుడైనా ఊహించారా ..?? అటువంటి ఊహలకు అద్దంపట్టే విధంగా, తిరుపతి ని మీరు ఇదివరకెప్పుడు చూడని విధంగా కొన్ని ఫోటో లతో మీ తెలుగు నేటివ్ ప్లానెట్ పొందుపరిచింది. చూసి తరించండి.
No comments:
Post a Comment