ఇందులో ప్రదర్శించే గ్లోబ్ 20 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. చుట్టూర అమర్చిన 12 వేర్వేరు వీడియో ప్రొజెక్టర్లతో దృష్యాలను గ్లోబ్‌పైన ప్రొజెక్ట్ చేస్తారు. పది రకాల శాటిలైట్లు అందించిన సమాచారంతో ఈ వీడియోలను రూపొందించారు. మనం చూసే డిజిటల్ సినిమాకన్నా ఎక్కువ సాంద్రతతో వీడియోలను రికార్డు చేశారు. ప్రొజెక్ట్ చేసే ఒక్కో దృశ్యం 5.80 కోట్ల పిక్సల్స్‌తో ఉంటుంది. కోటిన్నర ఇండివిజల్ పిక్చర్స్‌తో కూడాని ఫ్రేమ్స్ సెకండ్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున కదులుతాయి.
ఈ కారణంగా గ్లోబ్‌పై ప్రొజెక్టయ్యే వీడియోల వల్ల మనకు నేల మీద కూర్చొనే రోదసిలో నుంచి భూమిని ప్రత్యక్షంగా చూస్తున్న భ్రాంతి కలుగుతుంది. రాత్రి, పగళ్లను కూడా అనుభూతి చెందుతూ అంతరిక్షింలో విహరిస్తున్నట్లుగా ఫీలవుతాం. భాషతో ప్రమేయం లేదని, అందరు ఈ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తారని డీఎల్‌ఆర్ చీఫ్ నిల్స్ పర్వాసర్ మీడియాకు తెలిపారు.
No comments:
Post a Comment