Thursday, 24 March 2016

కాఫీతో పాటు............ కప్పునూ తినొచ్చు!

కాఫీ.. టీ లేకుండా ఉండగలమా? ఇంట్లో అయితే ఎంచక్కా గ్లాస్ కప్‌లోనో.. పింగానీ కప్పులోనో పోసుకొని తాగేస్తుంటాం. బయటకెళితే ఏ ప్లాస్టిక్ కప్పో.. పేపర్ కప్పో దిక్కవుతుంది. అలా అని లంచ్‌బాక్స్‌తో పాటు తీసుకెళ్లలేం. ఏం చేయాలి? అందమైన కాఫీని.. అంతకంటే అందమైన కప్పులో పోసుకొని తాగలేమా? అంటే తాగొచ్చు. కేవలం తాగడం మాత్రమే కాదు. కాఫీ అయిపోయాక ఆ కప్పును అట్టే గుటకాయస్వాహా అని తినేయొచ్చు! వింతగా విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఇప్పటికే ఈ కాఫీకప్పులు అందుబాటులోకి వచ్చాయి.cafi
ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద హోటళ్లలో.. రెస్టారెంట్లలో ఇవి సందడి చేస్తున్నాయి. పర్యావరణం పరిరక్షించడంతో పాటు కస్టమర్‌కు కొత్త అనుభూతి కలిగిండమే లక్ష్యంగా ఇలాంటి కప్పులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ఈటబుల్ కప్ మేకర్స్ చెప్తున్నారు. పైగా పిల్లలకు ఇవి భలే నచ్చడం.. వీటిలో కాఫీ, టీ తాగితే సృజనాత్మక ఆలోచనలు వస్తాయంటున్నారు. సో.. మీరెందుకు దిగులు పడతారు. ఇష్టం లేకున్నా ప్లాస్టిక్ గ్లాస్‌లో కాఫీ తాగడం ఆపేసి.. ఆ కాఫీతో పాటు తినేసే అవకాశమున్న కప్‌లను తెచ్చేసుకోండి!

No comments:

Post a Comment