నలుగురిలో ఎంత అందంగా కనిపించినా… పసుపు దంతాలు వుంటే మాత్రం మనస్ఫూర్తిగా నవ్వలేం. ఏవిధంగా అయితే అందానికి ప్రాధాన్యత ఇస్తారో.. అదేవిధంగా దంతాలను తెల్లగా మార్చడంలో ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి! పసుపు దంతాలు వుంటే సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలుకుదరదు. కాబట్టి.. అటువంటి దంతాలను నివారించుకోవాలంటే ప్రతిరోజూ పళ్లను శుభ్రం చేసుకోవాలి.
కొంతమంది రోజుకు రెండుసార్లు పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల తెల్లగా కనిపిస్తాయి.. కానీ మరికొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు.. చూడ్డానికి ఓ మోస్తరు తెల్లగానే వున్నా.. పగుళ్ల దగ్గరలో పసుపుపచ్చ రంగు క్లియర్‌గా కనిపిస్తుంది. అటువంటి రంగును కూడా పూర్తిగా నిర్మూలించాలంటే ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ద్వారా దూరం చేయొచ్చు. అందులో ముఖ్యంగా తులసి బాగా పనిచేస్తుంది. ఈ తులసిని వివిధరకాల రెమెడీస్‌లో కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటేమంచి ఫలితం పొందుతారు. మరి తులసీ మిశ్రమంతో ఆ రెమెడీస్ ఏమిటి..? ఎలా తయారుచేస్తారో..? తెలుసుకుందాం…
* బాసిల్ టూత్ పౌడర్ : తాజాగా ఉండి తులసి ఆకులను తీసుకొని, నీడలో బాగా ఎండబెట్టుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత, ఆ ఆకులను మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి ప్రతిరోజూ బ్రష్ చేస్తే.. పసుపు దంతాలను నిర్మూలించుకోవచ్చు
* బానియన్(మర్రిచెట్టు) ట్రీ (ఫిక్కస్ రిలిజియోస) : ఈ చెట్టులోని వేరులో ఒక నేచురల్ ఆస్ట్రింజెంట్ వుంటుంది. ఆ వేరును తీసుకుని ప్రతిరోజూ బ్రష్ లా చేసుకుంటే.. అది దంతాలను ముత్యాల్లా మెరిపిస్తుంది. ఇది చెట్టు పైభాగంలో వ్రేలాడుతూ పెరుగుతుంది.
* వేప లేదా మార్గోస(అజార్డిరచ్తా ఇండిక) : వేపపుల్లలో ఆస్ట్రిజెంట్స్‌తో పాటు యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా వుంటాయి. ఈ పుల్లలతో బ్రష్ చేసుకుంటే దంతాలను శుభ్రపరచడంతో పాటు చెడు శ్వాసను, దంతక్షయాన్ని నివారిస్తుంది.
* బేకింగ్ సోడా రెమెడీ : బేకింగ్ సోడాలో సానపెట్టే స్వభావం కలిగి ఉంటుంది. ఇది మీ దంతాల ఎనామిల్ ను తగ్గించేయవచ్చు. అయితే, బేకింగ్ సోడాలోని ఈ సానపెట్టే గుణం దంతాల మీద పడ్డ మొండి మరకలను తొలగించడంలో చాలా గొప్పగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో పాటు నిమ్మరసం ఉపయోగించినట్లైతే, దంతాల్లోన్ని క్యాల్షియంను బ్లాక్ చేసి దంతాలను తెల్లగా మార్చుతుంది. అయితే జాగ్రత్తగా వాడాలి.
* విటమిన్ సి ఎక్కువగా వుండే పళ్లు, కూరగాయలు: స్ట్రాబెర్రీస్, టమోటో, ఆమ్లా, ఆరెంజ్, నిమ్మకాయ వంటివాటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. స్ట్రాబెర్రీని రెండు ముక్కలుగా కట్ చేసి, అందులో సగం తీసుకొని, దాని మీద బేకింగ్ సోడాను చిలకరించి, దాంతో దంతాల మీద బాగా రుద్దాలి. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్ యాసిడ్, అందులోని ఆస్ట్రిజెంట్ లక్షణాలు, స్వచ్చమైన దంతాలను అందిస్తాయి.
* ఆరెంజ్ తొక్క : రాత్రి నిద్రపోవడానికి ముందు ఆరెంజ్ తొక్కను తీసుకుని.. దంతాలను బాగా రుద్దుకోవాలి. అనంతరం నీటితో పుక్కిలించుకుని నిద్రపోవాలి.
No comments:
Post a Comment