ప్రకాశవంతమైన చర్మానికి మామిడిపండ్లలో డార్క్ స్పాట్స్, యాక్నే నివారించి ప్రకాశవంతమైన చర్మం అందించే సత్తా ఉంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల.. చర్మం షైనింగ్ గా మారుతుంది.
యాంటీ ఏజింగ్ ఏజింగ్ ని, పిగ్మెంటేషన్ ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ మామిడిపండ్లలో ఉన్నాయి. అలాగే హానికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడే సత్తా కూడా వీటిలో ఉంది. విటమిన్ సి మొటిమలు, యాక్నేతో పోరాడుతాయి. మ్యాంగో గుజ్జుని చర్మానికి డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల చర్మానికి సహజ సౌందర్యం పొందుతుంది.
కాంప్లెక్షన్ మామిడిపండ్లలో విటమిన్ ఏ ఉండటం వల్ల ఇది ఆరోగ్యవంతమైన చర్మానికి సహాయపడుతుంది. బాగా పండిన మామిడిపండుని ముఖానికి, చేతులకు స్క్రబ్ చేయడం, లేదా మామిడిపండు గుజ్జుకి మీగడ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. మీరు ఊహించని ఫలితాలు పొందుతారు.
డార్క్ స్పాట్స్ మామిడితొక్క కూడా డార్క్ స్పాట్స్ నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి మామిడితొక్కలను ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పొడికి టీ స్పూన్ పెరుగు కలిపి.. రాసుకుంటే.. డార్క్ స్పాట్స్ తగ్గిపోయి.. గ్లోల్డెన్ గ్లో సొంతమవుతుంది.
యాక్నె మ్యాంగో జ్యూస్ రాయడం వల్ల చర్మంపై యాక్నే నివారించవచ్చు. చిన్న మామిడిపండుని కొద్ది ఉడకబెట్టాలి. ఈ నీటిని యాక్నే రిమూవర్ గా ఉపయోగించాలి.
క్లెన్సర్ టీ స్పూన్ వీట్ ఫ్లోర్ కి , కొద్దిగా మామిడిపండు గుజ్జు కలపాలి. ఇది క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. ముఖంపై గుంతలను కూడా మాయం చేస్తుంది.
హోంమేడ్ ఫేస్ వాష్ ఒక టీస్పూన్ మామిడిపండు గుజ్జు, ఒక టీస్పూన్ బాదాం పొడి కలపాలి. ఇందులో టేబుల్ స్పూన్ పాలు మిక్స్ చేసి.. బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
సున్నితమైన చర్మానికి మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. మామిడిపండు గుజ్జు, ఓట్ మీల్, పాలు, తేనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
జుట్టుకి కండిషనర్ హోంమేడ్ కండిషనర్ తయారు చేసుకోవచ్చు. మామిడిపండు గుజ్జు, పెరుగు, రెండు కోడిగుడ్లలోని పచ్చసొన తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కండిషనర్ లా పనిచేస్తుంది.
చుండ్రు మామిడిపండ్లలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది డాండ్రఫ్ నివారించి జుట్టు షైనింగ్ గా మారుతుంది. విటమిన్ ఈ స్కాల్ఫ్ లో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
హెయిర్ లాస్ మ్యాంగో సీడ్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆయిల్ తయారు చేయడానికి మామిడి విత్తనంపై పొట్టు తీసేయాలి. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆవ నూనె కలిపి ఒక జార్ పెట్టుకోవాలి. ఈ జార్ లో మామిడి విత్తనం వేయాలి. కొన్ని రోజులు సూర్యరశ్మి తగిలేలా ఈ జార్ పెట్టాలి. తర్వాత ఈ ఆయిల్ ని రోజూ వాడుతూ ఉంటే.. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా మారి.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
No comments:
Post a Comment