న్యూయార్క్: ఆనందం, బాధ, ఆగ్రహం, శుభాకాంక్షలు, సంతాపాలు.. విషయం ఏదైనా భావాలను పంచుకోవడానికి గొప్ప వేదిక ట్విట్టర్. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మదిలో ఏ ఆలోచన మెదిలినా, సెల్ఫీ దిగినా అందులో పోస్ట్ చేయాల్సిందే. సెలబ్రిటీలు, రాజకీయనాయకులను అభిమానులను మరింత దగ్గర చేస్తున్న వేదిక ఇది. ఓ రకంగా చెప్పాలంటే సమాచార, ప్రసార మాధ్యమాన్నే మార్చేసింది ఈ ట్వీటు పక్షి. ఎంతో మందికి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుటాం కదా.. ఈరోజు ట్విట్టర్ పుట్టిన రోజు మరి. హ్యాపీ బర్త్‌డే చెప్పేయండి మరి..
ట్విట్టర్ ఈరోజు పదో పుట్టినరోజు వేడుక జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ సరికొత్త హ్యాష్‌ట్యాగ్ ఎమోజీని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ట్విట్టర్‌పై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు లవ్‌ట్విట్టర్ అనే హ్యాష్‌ట్యాగ్‌కు హృదయాకారం, ట్విట్టర్ బర్డ్ చిత్రాలతో కొత్త ఎమోజీలను జతచేర్చింది.
పదేళ్ల క్రితం మార్చి 21న ట్విట్టర్ ఒక ట్వీట్‌తో తన ప్రయాణం ప్రారంభించింది. అమెరికాలో ప్రారంభమై ప్రపంచమంతా చుట్టేస్తున్నామని.. ట్విట్టర్ ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా సంస్థ వినియోగదారులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ వీడియోను పోస్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారులు రోజుకు 500 మిలియన్ ట్వీట్లు.. ఏడాదికి 200 బిలియన్ల ట్వీట్లు చేస్తున్నారు. పదేళ్ల క్రితం మార్చి 21న ఒకే ఒక్క ట్వీట్‌తో ప్రయాణం మొదలుపెట్టాం. అప్పటి నుంచి ప్రతి క్షణంలో ప్రజలు తమ భావాలను ట్విట్టర్‌తో పంచుకుంటున్నారు అని ట్విట్టర్ ఆనందం వ్యక్తంచేస్తోంది.
No comments:
Post a Comment