ఒక్క సిమ్‌కార్డు ఉంటే చాలు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఇంటర్నెట్
వాడుకోవచ్చు. అలాంటి సదుపాయాన్ని ఇప్పుడు గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రాజెక్ట్ ‘ఫై’ పేరుతో తాజాగా ఈ సేవలను
ప్రారంభించింది.
ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే.. అన్ని నెట్‌వర్క్‌లనూ సపోర్ట్ చేసే ప్రత్యేక
సిమ్‌కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ‘ఫై’ ద్వారా రీఛార్జి చేసుకుంటే.. ఎక్కడికెళ్లినా..
స్థానిక మొబైల్ నెట్‌వర్క్‌లతో అనుసంధానమవుతుందట. అందుకు నెలవారీ ఛార్జీలను వసూలు
చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.
ఈ సిమ్‌కార్డు ఉన్న ఫోన్ ఆటోమేటిక్‌గా ‘4జీ’ మొబైల్ నెట్‌వర్క్‌లకు.. వైఫైకి కనెక్ట్
అవుతుందట. భద్రత పరంగా ఎలాంటి సమస్య ఉండదని గూగుల్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం
నెక్సస్ 6, నెక్సస్ 6పీ, నెక్సస్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే ప్రాజెక్ట్ ‘ఫై’ పనిచేస్తుందని వెల్లడించింది. దాదాపు 120కి పైగా దేశాల్లో దీన్ని వాడుకోవచ్చని
చెబుతున్నారు.
No comments:
Post a Comment